Atlee-Allu Arjun Movie : బన్నీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్, అట్లీతో అల్లు అర్జున్ సినిమా ఫిక్స్ - అఫీషియల్ అనౌన్స్మెంట్ ఆరోజే!
Atlee : అల్లు అర్జున్ - అట్లీ ప్రాజెక్టుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ బన్నీ బర్త్ డేకి రానున్నట్లు తాజా సమాచారం.
Atlee-Allu Arjun’s movie Announcement: 'పుష్ప' సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన అల్లు అర్జున్ తన అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా అంతకుమించి ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రజెంట్ అల్లు అర్జున్ లైనప్ లో పాన్ ఇండియా డైరెక్టర్స్ ఉన్నారు. ఈ ఏడాది 'పుష్ప 2'తో ప్రేక్షకులు ముందుకు రాబోతున్న బన్నీ తన తదుపరి చిత్రాన్ని కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీతో చేయబోతున్నట్లు ఇప్పటికే వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. గత ఏడాది 'జవాన్' సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే సత్తా చాటిన అట్లీ.. ఈసారి బన్నీతో అదిరిపోయే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ని తెరకెక్కించబోతుండడంతో బన్నీ - అట్లీ కాంబినేషన్ పై ఫ్యాన్స్, ఆడియన్స్ తో పాటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ ప్రాజెక్టు కి సంబంధించి ఓ అదిరిపోయే అప్డేట్ బయటికి వచ్చింది.
అల్లు అర్జున్ - అట్లీ మూవీ అనౌన్స్ మెంట్ ఆరోజే
బాలీవుడ్ అగ్ర హీరో షారుక్ ఖాన్‌తో అట్లీ తెరకెక్కించిన 'జవాన్' గత ఏడాది బాక్సాఫీస్ దగ్గర రూ.1000 కోట్లు కొల్లగొట్టి దర్శకుడిగాగా అట్లీకి పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చి పెట్టింది. దీంతో ‘జవాన్’ తర్వాత అట్లీ చేయబోయే ప్రాజెక్టు గురించి అందరిలో ఆసక్తి నెలకొంది. ఇలాంటి తరుణంలో ఈ కోలీవుడ్ డైరెక్టర్ నెక్స్ట్ అల్లు అర్జున్ తోనే సినిమా చేయబోతున్నాడని గత కొద్దిరోజులుగా వార్తలు వచ్చాయి. నిజానికి 'జవాన్' సినిమాలోని అల్లు అర్జున్ ఓ స్పెషల్ క్యామియో చేయాల్సింది. కానీ అనివార్య కారణాల వల్ల అది జరగలేదు. అయితే ఈసారి అట్లీ అల్లు అర్జున్ తో ఓ ఫుల్ ఫ్లెడ్జ్ మూవీ తీసేందుకు రెడీ అయ్యాడు. లేటెస్ట్ గా అట్లీ తన టీమ్ తో కలిసి డిస్కస్ చేస్తున్న వీడియో ఒకటి బయటికొచ్చి వైరల్ గా మారింది. ఈ డిస్కషన్ అంతా అల్లు అర్జున్ ప్రాజెక్ట్ కోసమే అని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు బన్నీ బర్త్ డే కానుకగా ఏప్రిల్ 7 లేదా 8న ఈ ప్రాజెక్ట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నట్లు ఇన్సైడ్ వర్గాల సమాచారం.
ఎవరితో ముందు?
అట్లీ కంటే ముందు అల్లు అర్జున్ త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగ వంటి స్టార్ డైరెక్టర్స్ తో ఇప్పటికే సినిమాలకు సైన్ చేశాడు. ఈ రెండు ప్రాజెక్ట్స్‌కు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఎప్పుడో వచ్చేసింది. అయితే ఈ ముగ్గురు దర్శకుల్లో బన్నీ ఎవరితో ముందు సినిమా చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది. సందీప్ రెడ్డి వంగాతో ఇప్పట్లో చేసే అవకాశం లేదు. ఎందుకంటే, ప్రజెంట్ ఆయన ప్రభాస్ 'స్పిరిట్' తో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత 'యానిమల్' సీక్వెల్ చేయాలని భావిస్తున్నాడు. ఇక త్రివిక్రమ్ విషయానికొస్తే, 'గుంటూరు కారం' రిజల్ట్ తేడా కొట్టడంతో ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో అనే విషయంపై క్లారిటీ లేదు. బన్నీ కూడా ప్రస్తుతం గురూజీతో సినిమా చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదని టాక్. అంటే 'పుష్ప2' తర్వాత బన్నీ చేయబోయే ప్రాజెక్ట్ అట్లీ దర్శకత్వంలోనే ఉండే అవకాశాలు ఉన్నాయి.
వైజాగ్ లో 'పుష్ప 2' షూటింగ్
సుకుమార్ తెరకెక్కిస్తున్న 'పుష్ప 2' మూవీ షూటింగ్ ఇప్పుడు వైజాగ్ లో జరుగుతోంది. షూటింగ్ కోసం బన్నీ ఇటీవలే వైజాగ్ వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వైజాగ్ లోని పోర్ట్ ఏరియాలో బన్నీ పై పలు కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఖర్చుకి ఏమాత్రం వెనకాడకుండా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నఈ సినిమా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read : సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న ఉర్ఫీ జావేద్ - ఆ హాట్ మూవీ సీక్వెల్‌తో రచ్చ రంబోలా!