శర్వానంద్ పెళ్లి, ప్రశాంత్ నీల్ బర్త్‌డే అప్‌డేట్స్, ఓజీ షూటింగ్ వివరాలు - నేటి సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.
మహేష్ బాబు - దీపికా పదుకోన్ - 'ఫిదా' చేసి ఉంటేనా? ఎందుకు 'నో' చెప్పారంటే?
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కథానాయకుడిగా ఓ ఫీల్ గుడ్ ఫిల్మ్ వస్తే ఎలా ఉంటుంది? అదీ సున్నితమైన కథలు తెరకెక్కించే శేఖర్ కమ్ముల (Sekhar Kammula) దర్శకత్వంలో సినిమా చేస్తే ఎలా ఉంటుంది? ఆ ఊహ ఎంత బావుందో కదూ! నిజం చెప్పాలంటే... ఆ ఊహ వాస్తవం అవుతుందని కొన్ని రోజుల క్రితం తెలుగు ప్రేక్షకులు భావించారు. మహేష్ బాబు హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా చేయాలని సీనియర్ దర్శకుడు జయంత్ సి. పరాన్జీ ట్రై చేశారు. అందులో కథానాయికగా దీపికా పదుకోన్ (Deepika Padukone)ని అనుకున్నారు. అయితే... ఆ సినిమా ఎందుకు సెట్స్ మీదకు వెళ్ళలేదు? అనేది తాజాగా ఓ ఇంటర్వ్యూలో జయంత్ చెప్పారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
శర్వానంద్ పెళ్ళైపోయిందోచ్ - రక్షితతో ఏడడుగులు వేసిన హీరో
యువ కథానాయకుడు శర్వానంద్ (Sharwanand) ఓ ఇంటివాడు అయ్యారు. నిన్న రాత్రి (జూన్ 3వ తేదీ) పదకొండు గంటలకు రక్షిత (Sharwanand wife Rakshita) మెడలో ఆయన మూడు ముళ్ళు వేశారు. ఏడు అడుగులు నడిచారు. ఇక నుంచి శర్వానంద్ బ్యాచిలర్ కాదు... మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్టులో నుంచి ఆయన పేరును తెలుగు చిత్రసీమ తీసేసింది. శర్వానంద్, రక్షితల వివాహ మహోత్సవానికి జైపూర్ (Leela Palace Jaipur)లోని లీలా ప్యాలెస్ వేదిక అయ్యింది. మూడు నాలుగు రోజుల క్రితమే నూతన వధూవరులతో పాటు ఇరువురి కుటుంబాలు, సన్నిహిత మిత్రులు జైపూర్ వెళ్ళారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
ప్రశాంత్ నీల్ పుట్టినరోజు - విషెస్ చెప్పిన ప్రభాస్, 'సలార్' మేకింగ్ వీడియో విడుదల
ప్రస్తుతం సౌత్ ఇండియా సినీ పరిశ్రమ నుంచి భారీ పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కుతున్నాయి. అలాంటి వాటిలో టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ నటిస్తోన్న ‘సలార్’ మూవీ కూడా ఒకటి. ఈ సినిమాకు ‘కేజీఎఫ్’ ఫేమ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘కేజీఎఫ్’ మూవీతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రశాంత్. దీంతో ఆయన ఇప్పుడు ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ తో కలసి సినిమా తీస్తుండటంతో ఈ మూవీ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే జూన్ 4 న దర్శకుడు ప్రశాంత్ నీల్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘సలార్’ మూవీ టీమ్ ఆయనకు ప్రత్యేకంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
రాజకీయాలు రాజకీయాలే, సినిమాలు సినిమాలే - పవన్ షూటింగులు ఆగట్లేదు!
రాజకీయాలు, సినిమాలు... ఇప్పుడు రెండు రంగాల్లోనూ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) బిజీ బిజీ. ఆయన సినిమాలు మూడు సెట్స్ మీద ఉన్నారు. మరోవైపు జనసేన పార్టీ కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ నెల నుంచి జనసేనాని వారాహి యాత్ర మొదలవుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో 'ఉస్తాద్ భగత్ సింగ్', 'ఓజీ' చిత్ర బృందాలు ఎటూ పాలుపోని స్థితిలో ఉన్నాయని, అయోమయంలో పడ్డాయని, రాజకీయ యాత్రలో పవన్ బిజీ కావడంతో ఆ రెండు సినిమాలకు ఇప్పట్లో డేట్స్ కేటాయించడం కష్టం అని కామెంట్స్ వినిపించాయి. వాటికి 'ఓజీ' యూనిట్ చెక్ పెట్టింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పేసిన అల్లు అర్జున్ - ఇంటికెళ్లాక పరిస్థితి ఏంటో?
అల్లు అర్జున్ (Allu Arjun) చాలా జోవియల్ అన్న సంగతి అనేక సందర్భాల్లో చూస్తూనే ఉంటాం. 'పుష్ప' (Pushpa Movie)తో ఆలిండియా రేంజ్ కు ఎదిగిన ఐకాన్ స్టార్... ఇప్పుడు మరింత మెచ్యూర్డ్ గా ఉంటూ వస్తున్నారు. అయితే హుందాగా ఉండటాన్ని నటిస్తున్నాని... తాను ఒరిజినల్‌గా సరదాగా ఉండటానికే ఇష్టపడతానని ఆయన చెప్పారు. ఆహాలో స్ట్రీమ్ అవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2' (Telugu Indian Idol Season 2 Finale)లో అలాంటి సంఘటనే ఒకటి జరిగింది. సీజన్ గ్రాండ్ ఫినాలేకి గెస్ట్‌గా వచ్చిన ఐకాన్ స్టార్ తన లైఫ్‌లో ఓ ముఖ్యమైన విషయాన్ని బయట పెట్టారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)