శృంగారంపై తమన్నా హాట్ కామెంట్స్ - పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్, ఇవీ నేటి సినీవిశేషాలు
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యంగా ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.
ట్విట్టర్ అంకుల్స్‌కు ఇచ్చిపడేసిన తమన్నా - పెళ్ళికి ముందు శృంగారంపై షాకింగ్ కామెంట్స్
హైదరాబాదీ యువకుడు, హిందీ నటుడు విజయ్ వర్మతో తమన్నా భాటియా (Tamannaah Bhatia) ప్రేమ, 'లస్ట్ స్టోరీస్ 2' వెబ్ సిరీస్ (Lust Stories Season 2)లో అతనితో ఇచ్చిన ముద్దులు, ఆ సన్నివేశాలు... ఇప్పుడు మిల్కీ బ్యూటీ ఆన్ స్క్రీన్ & ఆఫ్ స్క్రీన్ రొమాన్స్ హాట్ హాట్ టాపిక్ అయ్యింది. సోషల్ మీడియాలో చర్చలకు అయితే హద్దు లేదు. ఈ నేపథ్యంలో తమన్నా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
'సామజవరగమన' రివ్యూ : శ్రీవిష్ణు సినిమా ఎలా ఉందంటే?
యువ కథానాయకులలో శ్రీ విష్ణు (Sree Vishnu)ది చాలా ప్రత్యేకమైన శైలి. ఆయన పాదరసం లాంటి నటుడు. భావోద్వేగభరిత పాత్రలు చేయగలరు. కామెడీతో బాగా నవ్వించగలరు. శ్రీ విష్ణు వినోదాత్మక చిత్రాలు చూస్తే... మెజారిటీ శాతం విజయాలే. మరి, 'సామజవరగమన' సినిమా (Samajavaragamana Movie) ఎలా ఉంది? 'వివాహ భోజనంబు' చిత్రంతో నవ్వించిన రచయిత, దర్శక ద్వయం భాను భోగవరపు, రామ్ అబ్బరాజు ఈసారి ఏం చేశారు? (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
‘ఆదిపురుష్’ ఎఫెక్ట్ - సెన్సార్ బోర్డ్ పై మండిపడిన హైకోర్ట్!
ఓం రౌత్ దర్శకత్వంలో వచ్చిన ‘ఆదిపురుష్’ సినిమా జూన్ 16 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. రిలీజ్ అయిన ఫస్ట్ డే నుంచే ఈ సినిమా ప్రజాదరణ పొందడంలో విఫలం అయింది. రామాయణ ఇతిహాసాల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా రామాయణానికి విరుద్దంగా ఉందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. సినిమాను బ్యాన్ చేయాలంటూ కొన్ని చోట్ల నిరసనలు కూడా చేశారు. ముఖ్యంగా మూవీలో డైలాగ్స్ పై ప్రజల్లో కొంత వ్యతిరేకత వచ్చింది. అలాగే సోషల్ మీడియాలో నెటిజన్స్ సినిమా గ్రాఫిక్స్ వర్క్స్ పై ఓ రేంజ్ లో ట్రోలింగ్ చేశారు. సినిమాను బ్యాన్ చేయాలంటూ కొంతమంది కోర్టులో ఫిటిషన్ లను దాఖలు చేశారు కూడా. అయితే ఆ పిటిషన్ లపై అలహాబాద్ హైకోర్ట్ విచారణ జరిపింది. ఈ సందర్భంగా ధర్మాసనం ‘ఆదిపురుష్’ మేకర్స్, సెన్సార్ బోర్డ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
డైరెక్టర్ కార్తీక్ వర్మకు బెంజ్ కారును బహుమతిగా ఇచ్చిన 'విరూపాక్ష' నిర్మాతలు
హీరో సాయిధరమ్ తేజ్, సంయుక్త నటించిన మిస్టిక్ థ్రిల్లర్ 'విరూపాక్ష' ఈ సంవత్సరం టాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్స్‌లో ఒకటిగా నిలిచింది. కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి OTT స్పేస్‌లో కూడా మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన మరో వార్త హల్ చల్ చేస్తోంది. ఈ చిత్ర నిర్మాతలు BVSN ప్రసాద్, సుకుమార్ కలిసి దర్శకుడు కార్తీక్ వర్మ దండుకు బ్లాక్ కలర్ మెర్సిడెస్ బెంజ్ కారును బహుమతిగా ఇచ్చారు. ఈ సందర్భంగా సాయి ధరమ్ తేజ్, సుకుమార్ కార్ కీస్‌ను కార్తీక్‌కు అందించారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను దర్శకుడు కార్తీక్ దండు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
ఇన్‌స్టాలో భర్త ఫోటోలు డిలీట్ చేసిన ఆసిన్, విడాకులకు రెడీ? - 'గజినీ' భామ స్పందన ఏంటంటే?
ఆసిన్ (Asin Thottumkal) గుర్తు ఉన్నారా? తమిళ, హిందీ ప్రేక్షకులు మాత్రమే కాదు... తెలుగు ప్రేక్షకులు సైతం ఆమెను మర్చిపోవడం కష్టమే! 'హృదయం ఎక్కడ ఉన్నది... హృదయం ఎక్కడ ఉన్నది...' పాట ఎప్పటి వరకు వినిపిస్తూ ఉంటుందో? అప్పటి వరకు ఆసిన్ గుర్తు ఉంటారు. 'గజినీ' సినిమా, అందులో పాట అంత పెద్ద హిట్ మరి! సూర్యకు జోడీగా తమిళం, ఆమిర్ ఖాన్ సరసన హిందీలో... 'గజినీ' చేశారు ఆసిన్. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)