భగవంత్ కేసరి టీజర్, రజనీ, అమితాబ్ కాంబినేషన్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.
మారణాయుధాలతో పాటు మందు బాటిల్ - బాలకృష్ణతో బాబీ ప్లాన్ ఏంటి?
'వయలెన్స్ కి విజిటింగ్ కార్డ్' - ఇదీ గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కొత్త సినిమా గురించి చిత్ర బృందం ఒక్క వాక్యంలో చెప్పిన మాట! అంతే కాదు... కాన్సెప్ట్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.అది చూస్తే బాలకృష్ణతో బాబీ యాక్షన్ సీన్లు గట్టిగా ప్లాన్ చేసినట్టు ఉన్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
తమిళ సినిమాలో అమితాబ్ బచ్చన్ - 32 ఏళ్ళ తర్వాత రజనీతో!
రజనీకాంత్, అమితాబ్ బచ్చన్... ఇద్దరూ లెజెండ్స్! ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ అని చెప్పడానికి లేదు. భారతీయ చిత్ర పరిశ్రమలో ఇద్దరికీ సముచిత స్థానం ఉంది. రజనీకాంత్ తమిళ సినిమాలు ఎక్కువ చేశారు. మధ్య మధ్యలో తెలుగు, హిందీ సినిమాల్లో కనిపించారు. అయితే... ఆయనకు దేశమంతా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమాలు మిగతా భాషల్లో అనువాదం అవుతూ ఉన్నాయి. అమితాబ్ బచ్చన్ హిందీ సినిమాలు ఎక్కువ చేసినా ఆయనకూ నేషనల్ వైడ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఓ సినిమా చేస్తున్నారని కోలీవుడ్ టాక్. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
బాలకృష్ణ మాస్ విధ్వంసం - 'భగవంత్ కేసరి' టీజర్ వచ్చిందోచ్
గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా 'భగవంత్ కేసరి' (Bhagavanth Kesari Movie). షైన్ స్క్రీన్స్ పతాకంపై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్నారు. యువ దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు. విజయ దశమి సందర్భంగా సినిమా విడుదల కానుంది. ఈ రోజు బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా టీజర్ విడుదల చేశారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
నయనతారకు విఘ్నేష్ సర్ ప్రైజ్, యానివర్సరీ సందర్భంగా ఊహించని గిఫ్ట్!
సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార, ప్రముఖ తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ గత ఏడాది పెళ్లి చేసుకున్నారు. చాలా కాలంగా లవ్ ట్రాక్ నడిపిన వీరిద్దరు.. 2023, జూన్ 9న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. చెన్నైకి సమీపంలోని మహాబలిపురంలో వీరి వివాహ వేడుక జరిగింది. రజనీకాంత్, షారుఖ్ ఖాన్, అజిత్ కుమార్, విజయ్ సేతుపతి, ఏఆర్ రెహమాన్, సూర్య, మణిరత్నం, జ్యోతిక సహా పలువురు టాప్ స్టార్స్ ఈ వివాహ వేడుకలో పాల్గొన్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
ఎంగేజ్మెంట్ ఫోటోలను షేర్ చేస్తూ లావణ్య పెట్టిన క్యాప్షన్ వెనుక ఇంత కథ ఉందా?
టాలీవుడ్ లవ్ బర్డ్స్ వరుణ్ తేజ్, లావణ్య నిశ్చితార్థం శుక్రవారం ఘనంగా జరిగింది. మణికొండలోని నాగబాబు నివాసంలో ఈ వేడుక జరిగింది. అట్టహాసంగా నిర్వహించిన ఈ ఎగేజ్మెంట్ లో మెగా, అల్లు ఫ్యామిలీ సభ్యులంతా హాజరై సందడి చేశారు. ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో వరుణ్, లావణ్యలు ఉంగరాలు మార్చుకున్నారు. ఎంగేజ్మెంట్ తర్వాత వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీలు స్వయంగా తమ ఫొటోలను అభిమానులతో షేర్ చేసుకున్నారు. ‘Found my Lav’ అంటూ వరుణ్, ‘Found my Forever’ అంటూ వరుణ్, లావణ్యలు తమ ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చారు. మరోవైపు చిరంజీవి, రామ్ చరణ్, ఉపాసన, అల్లు అర్జున్ ఫ్యామిలీలు నాగబాబు ఇంటికి వెళ్తున్న ఫొటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అభిమానులు సోషల్ మీడియా ద్వారా వరుణ్, లావణ్యలకు శుభాకాంక్షలు చెప్తున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)