అన్వేషించండి

NBK 109 Movie : మారణాయుధాలతో పాటు మందు బాటిల్ - బాలకృష్ణతో బాబీ ప్లాన్ ఏంటి?

నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఈ రోజు పూజతో మొదలైంది. కాన్సెప్ట్ పోస్టర్, ఒక్క మాటతో సినిమాపై దర్శకుడు బాబీ అంచనాలు పెంచేశారు.

'వయలెన్స్‌ కి విజిటింగ్ కార్డ్' - ఇదీ గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కొత్త సినిమా గురించి చిత్ర బృందం ఒక్క వాక్యంలో చెప్పిన మాట! అంతే కాదు... కాన్సెప్ట్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.అది చూస్తే బాలకృష్ణతో బాబీ యాక్షన్ సీన్లు గట్టిగా ప్లాన్ చేసినట్టు ఉన్నారు. 

మారణాయుధాలు... మందు... సిగరెట్
గొడ్డలి, సుత్తి, కత్తి... ఒక్కటేమిటి? ఎన్‌బికె 109 కాన్సెప్ట్ పోస్టర్‌లో మారణాయుధాలు చాలా ఉన్నాయి. అసలే వయలెన్స్ కి విజిటింగ్ కార్డు అంటున్నారు. చూపించిన ఆయుధాలతో బాలకృష్ణతో డిఫరెంట్ యాక్షన్ సీన్లు తీయొచ్చు. కత్తులతో పాటు ఆ సూట్ కేసులో మందు బాటిల్ కూడా ఉంది. అది మ్యాన్షన్ హౌస్ బాటిల్ కావడం విశేషం. అలాగే... సిగరెట్, డబ్బులకూ చోటు కల్పించారు. 

వచ్చే ఏడాది NBK 109 విడుదల
బాలకృష్ణ కథానాయకుడిగా బాబీ కొల్లి (కె.ఎస్. రవీంద్ర) దర్శకత్వంలో సినిమా ఈ రోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు తెరకెక్కిస్తున్న చిత్రమిది. త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య, సూర్యదేవర నాగవంశీ నిర్మాతలు. వచ్చే ఏడాది ప్రథమార్థంలో చిత్రాన్ని విడుదల చేస్తామని వెల్లడించారు. 

నాగవంశీకి థాంక్స్ చెప్పిన బాబీ
బాలకృష్ణ గారితో పని చేసే అవకాశం రావడం, అదీ ఆయన పుట్టినరోజున సినిమా ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని దర్శకుడు బాబీ ట్వీట్ చేశారు. ఈ రోజు పూజ జరిగిందని తెలిపారు. ఈ సినిమా మొదలు కావడానికి కారణమైన ఎస్. నాగవంశీతో పాటు నిర్మాణ సంస్థలకు ఆయన థాంక్స్ చెప్పారు. బాలకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు.

Also Read : తమిళ సినిమాలో అమితాబ్ బచ్చన్ - 32 ఏళ్ళ తర్వాత రజనీతో!


బాలకృష్ణతో త్రివిక్రమ్ సందడి!
కథానాయకుడిగా బాలకృష్ణ 109వ చిత్రమిది (nbk 109). ప్రారంభోత్సవంలో నట సింహంతో మాటల మాంత్రికుడు సందడి చేశారు. ఇద్దరూ మాట్లాడుకుంటున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎన్‌బికె ప్రారంభోత్సవానికి ఎన్టీఆర్ కుమారులలో ఒకరైన నందమూరి రామకృష్ణ, మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలలో ఒకరైన వై. రవి శంకర్ తదితరులు హాజరయ్యారు. 

Also Read శర్వా రిసెప్షన్‌లో రామ్ చరణ్ వేసుకున్న షర్ట్ రేటు ఎంతో తెలుసా?

సంక్రాంతి బరిలో... మొన్న జనవరి నెలలో విడుదలైన తెలుగు సినిమాల్లో 'వీర సింహా రెడ్డి', 'వాల్తేరు వీరయ్య' ఉన్నాయి. మొదటి సినిమాలో హీరో బాలకృష్ణ కాగా... రెండో సినిమాకు బాబీ కొల్లి దర్శకుడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి సినిమా చేస్తుండటం విశేషం. బాలకృష్ణ మాస్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని బాబీ మంచి కథ రెడీ చేశారట. 'వాల్తేరు వీరయ్య'లో మెగాస్టార్ చిరంజీవిని బాబీ ప్రజెంట్ చేసిన తీరు అభిమానులకు నచ్చింది. ఇప్పుడు బాలకృష్ణను సైతం అభిమానులు కోరుకునే విధంగా చూపించాలని డిసైడ్ అయ్యారట.

'భగవంత్ కేసరి'గా వచ్చిన బాలకృష్ణ
బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా నేడు 'భగవంత్ కేసరి' టీజర్ కూడా విడుదల అయ్యింది. ఆ సినిమాలో హీరో ఇంటి పేరు నేలకొండ. హీరో పేరు భగవంత్ కేసరి. మొత్తంగా పలికితే నేలకొండ భగవంత్ కేసరి. షార్ట్‌గా ఎన్‌బికె. ఒరిజినల్ బాలకృష్ణ పేరు వచ్చేలా దర్శకుడు అనిల్ రావిపూడి హీరో పాత్రకు పేరు పెట్టారు. ఇప్పుడీ సినిమా టీజర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun Vs Revanth: సినిమాలో మార్చేసినట్లు సీఎంను మార్చేసేయ్ పుష్ప - సోషల్ మీడియాలో ఫ్యాన్స్ డిమాండ్
సినిమాలో మార్చేసినట్లు సీఎంను మార్చేసేయ్ పుష్ప - సోషల్ మీడియాలో ఫ్యాన్స్ డిమాండ్
Vaikunta Dwara Darshanam: వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయాలు, 10 రోజులపాటు ప్రత్యేక దర్శనాలు రద్దు
వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయాలు, 10 రోజులపాటు ప్రత్యేక దర్శనాలు రద్దు
Suchir Balaji: మన సుచిర్ బాలాజీని అమెరికాలో చంపేశారా ? - మస్క్‌కీ డౌటే - ఎవరిపని ?
మన సుచిర్ బాలాజీని అమెరికాలో చంపేశారా ? - మస్క్‌కీ డౌటే - ఎవరిపని ?
Allu Arjun - Shilpa Ravi Reddy: అల్లు అర్జున్ ఫ్రెండ్ మిస్సింగ్... నంద్యాల శిల్పా రవి రెడ్డి ఎక్కడ?
అల్లు అర్జున్ ఫ్రెండ్ మిస్సింగ్... నంద్యాల శిల్పా రవి రెడ్డి ఎక్కడ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటాప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, అల్లు అర్జున్ అరెస్ట్చంపుతరా.. చంపండి.. బన్నీ కోసం జైల్లోకి దూకిన ఫ్యాన్చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun Vs Revanth: సినిమాలో మార్చేసినట్లు సీఎంను మార్చేసేయ్ పుష్ప - సోషల్ మీడియాలో ఫ్యాన్స్ డిమాండ్
సినిమాలో మార్చేసినట్లు సీఎంను మార్చేసేయ్ పుష్ప - సోషల్ మీడియాలో ఫ్యాన్స్ డిమాండ్
Vaikunta Dwara Darshanam: వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయాలు, 10 రోజులపాటు ప్రత్యేక దర్శనాలు రద్దు
వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయాలు, 10 రోజులపాటు ప్రత్యేక దర్శనాలు రద్దు
Suchir Balaji: మన సుచిర్ బాలాజీని అమెరికాలో చంపేశారా ? - మస్క్‌కీ డౌటే - ఎవరిపని ?
మన సుచిర్ బాలాజీని అమెరికాలో చంపేశారా ? - మస్క్‌కీ డౌటే - ఎవరిపని ?
Allu Arjun - Shilpa Ravi Reddy: అల్లు అర్జున్ ఫ్రెండ్ మిస్సింగ్... నంద్యాల శిల్పా రవి రెడ్డి ఎక్కడ?
అల్లు అర్జున్ ఫ్రెండ్ మిస్సింగ్... నంద్యాల శిల్పా రవి రెడ్డి ఎక్కడ?
Revanth Reddy: రాహుల్ గాంధీ మాట ప్రకారం మాదిగలకు న్యాయం చేసి తీరుతాం- రేవంత్ రెడ్డి
రాహుల్ గాంధీ మాట ప్రకారం మాదిగలకు న్యాయం చేసి తీరుతాం- రేవంత్ రెడ్డి
Allu Arjun Issue: అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Allu Arjun: భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
Embed widget