Nayanthara - Vignesh Shivan: నయనతారకు విఘ్నేష్ సర్ ప్రైజ్, యానివర్సరీ సందర్భంగా ఊహించని గిఫ్ట్!
అందాల తార నయనతార, విఘ్నేష్ శివన్ తొలి వెడ్డింగ్ యానివర్సరీని సంతోషంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా నయన్ కు విఘ్నేష్ మర్చిపోలేని బహుమతి ఇచ్చాడు. ఇంతకీ అదేంటో తెలుసా?
సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార, ప్రముఖ తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ గత ఏడాది పెళ్లి చేసుకున్నారు. చాలా కాలంగా లవ్ ట్రాక్ నడిపిన వీరిద్దరు.. 2023, జూన్ 9న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. చెన్నైకి సమీపంలోని మహాబలిపురంలో వీరి వివాహ వేడుక జరిగింది. రజనీకాంత్, షారుఖ్ ఖాన్, అజిత్ కుమార్, విజయ్ సేతుపతి, ఏఆర్ రెహమాన్, సూర్య, మణిరత్నం, జ్యోతిక సహా పలువురు టాప్ స్టార్స్ ఈ వివాహ వేడుకలో పాల్గొన్నారు.
నయనతారకు విఘ్నేస్ సర్ ప్రైజ్
వీరిద్దరి వివాహ బంధానికి ఏడాది పూర్తయ్యింది. ఈ సందర్భంగా కొద్ది మంది బంధు,మిత్రుల సమక్షంలో వీరి పెళ్లి రోజు వేడుక సింపుల్ గా జరిగింది. ఈ సందర్భంగా నయనతారకు విఘ్నేస్ సర్ ప్రైజ్ చేశారు. సీనియర్ ఫ్లూటిస్ట్, విఘ్నేష్ చిన్ననాటి స్నేహితుడు నవీన్ కుమార్ ద్వారా సంగీత కచేరీని ఏర్పాటు చేశారు. నవీన్ కుమార్ సంగీతాన్ని ఆస్వాదిస్తూ ఆనందంలో మునిగిపోయింది నయనతార. తన ఇద్దరు కుమారులు ఉయిర్, ఉలాగ్‌లతో కలిసి ఈ పార్టీలో సరదాగా గడిపారు. ఈ మేరకు బర్త్ డేకు సంబంధించిన వీడియోను విఘ్నేష్ రిలీజ్ చేశాడు. ఇందులో నవీన్ కుమార్ ఫ్లూట్ గానం అదరినీ ఆకట్టుకుంది.
సోషల్ మీడియా వేదికగా మిత్రుడికి ధన్యవాదాలు చెప్పిన విఘ్నేష్
అద్భుతమైన ఫ్లూట్ గానంతో అలరించిన నవీన్ కుమార్ కు విఘ్నేష్ ధన్యవాదాలు చెప్పాడు. “ఇది సంతోషకరమైన సమయం. ఎంతో ఆనందంతో కూడిన క్షణాలు. మా మొదటి వార్షికోత్సవం సన్నిహితులు, ప్రియమైన వారి మధ్యలో జరుపుకున్నాం. 12 సంవత్సరాల వయస్సు నుండి నా బెస్ట్ ఫ్రెండ్ నవీన్ కుమార్. ధన్యవాదాలు నవీన్! మా పెళ్లి రోజు సందర్భంగా చక్కటి గానం వినిపించినందుకు కృతజ్ఞతలు. మమ్మల్ని మీ వేణుగానంతో అలరించడం మర్చిపోలేను” అంటూ ఇన్ స్టాలో పోస్టు పెట్టాడు.
View this post on Instagram
విఘ్నేష్ శివన్, నయనతార లవ్ స్టోరీ
విఘ్నేష్ శివన్, నయనతార 2015లో ‘నానుమ్ రౌడీ ధాన్’ సెట్స్ లో మొదటిసారిగా ఒకరినొకరు కలిశారు. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది. ఆ తర్వాత ఇద్దరూ ప్రేమలో పడ్డారు. 2021లో, విఘ్నేష్, నయనతార ఎంగేజ్మెంట్ జరిగింది. ఒక సంవత్సరం తర్వాత, ఈ జంట జూన్ 9, 2022న వివాహం చేసుకున్నారు.
సరోగసి ద్వారా కవలలకు జననం
విఘ్నేష్ శివన్, నయనతార వివాహం జూన్ 9న జరిగింది. వీళ్ళిద్దరూ ఏడు అడుగులు వేసిన నాలుగు నెలలకు తమకు కవలలు పుట్టినట్లు ప్రకటించారు. దాంతో అప్పుడే పిల్లలు ఎలా పుట్టారు? అనే ప్రశ్న చాలా మందిలో ఎదురైంది. అప్పుడే తల్లిదండ్రులు కావడం ఏమిటి? అని చాలా మంది షాక్ తిన్నారు. అయితే, నయన్, విఘ్నేష్ దంపతులు సరోగసీ ద్వారా తల్లిదండ్రులు అయ్యారు. సరోగసీ ద్వారా షారూఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్, తెలుగులో లక్ష్మీ మంచు వంటి సెలబ్రిటీలు పిల్లల్ని కన్నారు. ఆ జాబితాలో నయనతార, విఘ్నేష్ శివన్ దంపతులు కూడా చేరారు.
సౌత్ లో లేడీ సూపర్ స్టార్ గా కొనసాగుతున్న నయనతా త్వరలో బాలీవుడ్ లోకి అడుగు పెట్టబోతోంది. అట్లీ, షారుఖ్ ఖాన్ కాంబోలో తెరకెక్కుతున్న ‘జవాన్’ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్టు ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read Also: అల్లు అరవింద్ మాటలను నిజం చేసిన లావణ్య, వైరల్ అవుతున్న ఓల్డ్ వీడియో!