అన్వేషించండి

‘ఫైటర్’ రివ్యూ, ‘ఫ్యామిలీ స్టార్’పై మృణాల్ కామెంట్స్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.

'ఫైటర్' రివ్యూ: హృతిక్ రోషన్ సినిమా హిట్టా, ఫట్టా? 'వార్', 'పఠాన్' రేంజ్‌లో ఉందా?
హృతిక్ రోషన్, దీపికా పదుకోన్ జంటగా నటించిన సినిమా 'ఫైటర్'. 'వార్', 'పఠాన్' విజయాల తర్వాత దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన చిత్రమిది. ఇండో పాక్ మధ్య యుద్ధం, తీవ్రవాదం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూడండి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

"మాతో పెట్టుకోకండి, మేం భారతీయులం" గూస్‌బంప్స్‌ తెప్పిస్తున్న టీజర్‌
బాలీవుడ్‌ 'ఖిలాడీ' అక్షయ్‌ కుమార్‌, యంగ్‌ హీరో టైగర్‌ ష్రాఫ్‌ నటిస్తున్న సినిమా 'బడేమియా ఛోటేమియా'. ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు అలీ అబ్బాస్‌ జాఫర్‌ తెరకెక్కించాడు. 'బడేమియా ఛోటేమియా'లో మలయాళ స్టార్‌ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్‌ విలన్‌గా నటిస్తున్నారు. ఫుల్‌ యాక్షన్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌గా రూపొందుతున్న ఈ సినిమా ఈద్ సందర్భంగా ఏప్రిల్‌ నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా 'బడేమియా ఛోటేమియా' టీజర్‌‌ను టీమ్ రిలీజ్‌ చేసింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

జెట్ స్పీడ్‌లో 'మిస్టర్ బచ్చన్' షూటింగ్ - నయా షెడ్యూల్ కోసం అక్కడికెళ్లిన మూవీ టీమ్
మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఫిబ్రవరిలో 'ఈగల్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ హీరో ప్రస్తుతం 'మిస్టర్ బచ్చన్' షూటింగ్ లో ఉన్నాడు. టాలీవుడ్ కమర్షియల్ మాస్ చిత్రాల దర్శకుడు హరీష్ శంకర్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్‌కు సంబంధించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. సినిమాలోని ప్రధాన సన్నివేశాల చిత్రీకరణ కోసం మూవీ టీం తాజాగా కరైకుడికి వెళ్ళింది. అక్కడి పరిసర ప్రాంతాల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ హరీష్ శంకర్, రవితేజ కలిసి ఫ్లైట్ లో కర్తెకుడి కి వెళ్తున్న ఫోటోలను మూవీ టీం సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ సినిమాని హిందీలో అజయ్ దేవగన్ నటించిన 'రైడ్' సినిమా ఆధారంగా తెరకెక్కించబోతున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

ఈసారి ఏడిపించను, అంతా ఎంటర్‌టైన్మెంటే - ‘ఫ్యామిలీ స్టార్’పై మృణాల్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
మృణాల్‌ ఠాకూర్‌ తెలుగులో నటించిన రెండు సినిమాల్లో ఫ్యామిలీ ఆడియెన్స్‌ని ఆకట్టుకునే పాత్రలే చేశారు. 'సీతారామం'లో సీతగా, 'హాయ్‌నాన్న'లో యష్ణగా ఎమోషన్స్‌ని పండించి ఏడిపించేశారు. అయితే ఇప్పుడు 'ఫ్యామిలీ స్టార్‌'లో మాత్రం అలా కాదని చెప్పారు. ఇప్పటి వరకు అన్ని ఎమోషనల్‌ క్యారెక్టర్స్‌లో నటించానని అన్నారు. యష్ణ, సీత రెండు క్యారెక్టర్స్‌ అలాంటివేనని తెలిపారు. కానీ 'ఫ్యామిలీ స్టార్‌'లో మాత్రం డ్యాన్స్‌, పాటలు, ఫన్‌ అన్నీ కనిపిస్తాయని. ఒక్క మాటలో చెప్పాలంటే ఎంటర్‌టైన్మెంట్‌, ఎంటర్‌టైన్మెంట్‌, ఎంటర్‌టైన్మెంట్‌ అంతే అన్నారు. ఫ్యామిలీ స్టార్2లో విజయ్ దేవరకొండ సరసన మృణాల్ నటిస్తున్నారు. ఈ సినిమా 2024 సమ్మర్‌లో విడుదల కానుంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

బాక్సాఫీస్ దగ్గర తగ్గిన ‘హనుమాన్’ జోరు, 13వ రోజు ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే?
సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన విడుదలైన ‘హనుమాన్’ సినిమాకు అనుకున్న సంఖ్యలో థియేటర్లు లభించలేదు. తెలంగాణతో పాటు ఆంధ్రాలో కూడా పరిమిత స్క్రీన్లలో విడుదల అయ్యింది. తెలుగులో 450, హిందీలో 1500, ప్రపంచ వ్యాప్తంగా 2500 స్క్రీన్లలో ‘హనుమాన్’ రిలీజ్ అయ్యింది. తొలి షో నుంచే పాజిటివ్ టాక్ లభించడంతో థియేటర్ల సంఖ్య నెమ్మదిగా పెరిగింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సుమారు 5 వేల స్క్రీన్లలో రన్ అవుతోంది. 13వ రోజు ఈ సినిమా 3.46 కోట్లు వసూళు చేసింది. 12వ రోజు రూ. 4.65 కోట్లు వసూళు చేయగా 13వ రోజుకు వచ్చే సరికి 33 శాతం వసూళ్లు తగ్గాయి. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో ‘హనుమాన్’ సినిమా రూ. 101 కోట్లు, కర్ణాటకలో  రూ. 17 కోట్లు, తమిళనాడులో రూ. 3 కోట్లు,  కేరళలో రూ. కోటి, హిందీలో  రూ. 45 కోట్ల రూపాయలు వసూలు చేసింది. 13 రోజుల్లో  రూ. 165 కోట్ల నెట్ కలెక్షన్లను రాబట్టింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
Telangana News: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Social Media Ban: 16 ఏళ్లలోపు పిల్లలకు నో సోషల్ మీడియా - ఆస్ట్రేలియాలో కొత్త రూల్ - ఇండియాకు కూడా వస్తుందా?
16 ఏళ్లలోపు పిల్లలకు నో సోషల్ మీడియా - ఆస్ట్రేలియాలో కొత్త రూల్ - ఇండియాకు కూడా వస్తుందా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ISKCON Monk Chinmoy Krishna Das Arrest In Bangladesh | బంగ్లాదేశ్ లో మైనార్టీలపై హింసకు ఇదే నిదర్శనం | ABP DesamKCR Send off Madireddy Srinivas | ఆత్మీయుడిని అమెరికాకు పంపించిన కేసీఆర్ | ABP Desamతిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
Telangana News: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Social Media Ban: 16 ఏళ్లలోపు పిల్లలకు నో సోషల్ మీడియా - ఆస్ట్రేలియాలో కొత్త రూల్ - ఇండియాకు కూడా వస్తుందా?
16 ఏళ్లలోపు పిల్లలకు నో సోషల్ మీడియా - ఆస్ట్రేలియాలో కొత్త రూల్ - ఇండియాకు కూడా వస్తుందా?
Minister Konda Surekha: మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
Honda SP 125: ట్యాంక్ ఫుల్ చేస్తే 700 కిలోమీటర్లు - రూ.ఐదు వేలు కట్టి తీసుకెళ్లిపోవచ్చు - సూపర్ ఆఫర్!
ట్యాంక్ ఫుల్ చేస్తే 700 కిలోమీటర్లు - రూ.ఐదు వేలు కట్టి తీసుకెళ్లిపోవచ్చు - సూపర్ ఆఫర్!
Ram Gopal Varma: 'నా కోసం వెతుకుతున్నారని ఆనంద పడే వారికి ఓ బ్యాడ్ న్యూస్' - కేసులపై ఆర్జీవీ సంచలన ట్వీట్స్
'నా కోసం వెతుకుతున్నారని ఆనంద పడే వారికి ఓ బ్యాడ్ న్యూస్' - కేసులపై ఆర్జీవీ సంచలన ట్వీట్స్
Telangana News: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో కీలక మార్పులు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో కీలక మార్పులు
Embed widget