‘ఈగల్’కు రిలీజ్ కష్టాలు, ‘మట్కా’ గ్లింప్స్ రిలీజ్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.
ఆ సీన్ తర్వాత 'యానిమల్' సెట్‌లో నిజంగానే ఏడ్చాను - అసలేం జరిగిందో కూడా అర్థం కాలేదు
'అర్జున్ రెడ్డి' ఫేం సందీప్ రెడ్డి, బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బిర్ కపూర్ కాంబినేషన్‌లో వచ్చిన యానిమల్ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. గతేడాది డిసెంబర్ 1న రిలీజైన సినిమా రికార్డు వసూళ్లు రాబట్టింది. వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా దాదాపు రూ. 900 పైగా గ్రాస్ కలెక్షన్స్ చేసింది. ఈ సినిమాలోని రణ్‌బీర్ రఫ్ అండ్ రగ్గడ్ లుక్ యూత్‌ని బాగా ఆకట్టుకుంది. అంతేకాదు చాక్‌లేట్ బాయ్ అయిన రణ్‌బీర్‌తో వాయిలెన్స్ చేయించి భారీ హిట్ కోట్టాడు. ఇక ఈ సినిమాలో రణ్‌బీర్ సరసన నేషనల్ క్రష్ రష్మిక నటించింది. రణ్‌బీర్ రణ్‌విజయ్ పాత్ర పోషించగా.. రష్మిక గీతాంజలిగా అతడి భార్య పాత్రలో ఆకట్టుకుంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
రవితేజ 'ఈగల్' మూవీకి మళ్లీ రిలీజ్ కష్టాలు - ఫిలిం చాంబర్‌కు నిర్మాతల లేఖ
రవితేజ ఈగల్ మూవీకి మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. నిజానికి ఈ సంక్రాంతికి రావాల్సిన సినిమా థియేటర్ల సమస్య తలెత్తడంతో వాయిదా పడింది. నిర్మాతల మండలి కోరిక మేరకు నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా, రవితేజలు వెనక్కి తగ్గి సినిమాను పోస్ట్‌పోన్ చేశారు. అయితే ఓ కండిషన్ మీదే ఈగల్ వాయిదా పడింది. ఈ సంక్రాంతికి నాలుగు పెద్ద సినిమాలతో పాటు మరిన్ని చిత్రాలు ఉండటంతో థియేటర్లు సర్దుబాటు కాలేదు. ఈ సంక్రాంతికి తప్పుకుంటే తమ సినిమాకు సోలో రిలీజ్ డేట్ ఇస్తామని ‘ఈగిల్’ నిర్మాతలకు మాట కూడా ఇచ్చిందట ఫిలిం చాంబర్. దీంతో సినిమాను ఫిబ్రవరి 9కి వాయిదా వేశారు. అయితే ఇప్పుడు ఈగల్‌కు రిలీజ్ టైంలోనే ఫిబ్రవరి 8న యాత్ర 2, ఫిబ్రవరి 9న సందీప్ కిషన్ భైరవ కోన, లాల్ సలామ్ డబ్బింగ్ చిత్రాలు అదే రోజు రిలీజ్ కాబోతున్నాయి. దీంతో తమకు సోలో తేదీ ఇస్తామన్న ఫిలిం చాంబర్‌కు దీనిపై తాజాగా నిర్మాణ సంస్థ ఫిలిం చాంబర్‌కు లేఖ రాసింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
ఓటీటీలోకి వచ్చేసిన 'ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్' - స్ట్రీమింగ్ ఎక్కడంటే?
లవర్ బాయ్ నితిన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ ఇప్పుడు ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చింది జనవరి 19 అర్ధరాత్రి నుంచి ఈ సినిమా ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. డీటెయిల్స్ లోకి వెళ్తే.. ప్రముఖ రచయిత వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్, శ్రీలీల జంటగా నటించిన యాక్షన్ కామెడీ ఎంటర్టైలర్ 'ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్' డిసెంబర్ 8న థియేటర్స్ లో రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. గత కొన్నాళ్లుగా అటు నితిన్ ఇటు వక్కంతం వంశీ మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. 'భీష్మ' తర్వాత నితిన్ కి మళ్లీ ఆ రేంజ్ సక్సెస్ దక్కలేదు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
‘మట్కా’ గ్లింప్స్ - పీరియాడిక్ థ్రిల్లర్‌తో వస్తున్న వరుణ్ తేజ్, లుక్ అదుర్స్
ఈరోజుల్లో తెలుగులో పీరియాడిక్ సినిమాలకు క్రేజ్ పెరుగుతోంది. పీరియాడిక్ కథలతో హిట్లు కూడా దక్కడంతో చాలామంది దర్శకులు ఇదే ట్రెండ్‌ను ఫాలో అవ్వడం మొదలుపెట్టారు. ఆ లిస్ట్‌లోకి ‘మట్కా’ సినిమా కూడా చేరింది. శుక్రవారం వరుణ్ తేజ్ పుట్టిన రోజు నేపథ్యంలో ‘మట్కా’ చిత్రం నుంచి గ్లింప్స్‌ను విడుదల చేశారు మేకర్స్. ఇప్పటివరకు ‘మట్కా’ మూవీ నుంచి విడుదలయిన పోస్టర్లలో సినిమా గురించి, కథ గురించి పెద్దగా రివీల్ అవ్వకపోయినా.. గ్లింప్స్ చూస్తుంటే మాత్రం ఇదొక పీరియాడిక్ థ్రిల్లర్ అని క్లారిటీ వస్తోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
జర్మనీకి వెళ్లిన మహేష్ బాబు - ఈ సారి ఫ్యామిలీతో కాదు, ఎందుకంటే
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా ‘గుంటూరు కారం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ సినిమా, భారీ అంచనాల నడుమ విడుదలైనా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ కాలేకపోయింది. అయినప్పటికీ వసూళ్ల పరంగా ఫర్వాలేదు అనిపిస్తోంది. ఈ సినిమా విడుదలైన వారం రోజుల్లోనే రూ.200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఓ రీజినల్ మూవీ ఈ రేంజిలో వసూళ్లు సాధించడం ఇదే తొలిసారి అని చిత్రబృందం వెల్లడించింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)