Matka Movie: ‘మట్కా’ గ్లింప్స్ - పీరియాడిక్ థ్రిల్లర్‌తో వస్తున్న వరుణ్ తేజ్, లుక్ అదుర్స్
Varun Tej Birthday: వరుణ్ తేజ్ ప్రస్తుతం భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్నాడు. అందులో ఒకటి ‘మట్కా’. తాజాగా హీరో బర్త్‌డే సందర్భంగా ‘మట్కా’ మూవీ గ్లింప్స్ విడుదలయ్యింది.
Happy Birthday Varun Tej: ఈరోజుల్లో తెలుగులో పీరియాడిక్ సినిమాలకు క్రేజ్ పెరుగుతోంది. పీరియాడిక్ కథలతో హిట్లు కూడా దక్కడంతో చాలామంది దర్శకులు ఇదే ట్రెండ్‌ను ఫాలో అవ్వడం మొదలుపెట్టారు. ఆ లిస్ట్‌లోకి ‘మట్కా’ సినిమా కూడా చేరింది. శుక్రవారం వరుణ్ తేజ్ పుట్టిన రోజు నేపథ్యంలో ‘మట్కా’ చిత్రం నుంచి గ్లింప్స్‌ను విడుదల చేశారు మేకర్స్. ఇప్పటివరకు ‘మట్కా’ మూవీ నుంచి విడుదలయిన పోస్టర్లలో సినిమా గురించి, కథ గురించి పెద్దగా రివీల్ అవ్వకపోయినా.. గ్లింప్స్ చూస్తుంటే మాత్రం ఇదొక పీరియాడిక్ థ్రిల్లర్ అని క్లారిటీ వస్తోంది.
మట్కా ‘ఓపెనింగ్ బ్రాకెట్’..
‘మట్కా’ గ్లింప్స్‌ను బట్టి చూస్తే.. ఇది స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జరిగిన కథ అని అర్థమవుతోంది. ఇందులో హీరో వరుణ్ తేజ్.. ఒక ఆఫీసర్‌గా కనిపిస్తున్నాడు. పాతకాలంలో ఉపయోగించే టెలిఫోన్లు, కరెన్సీ నోట్లు.. ఇలాంటివి ఎన్నో ఈ గ్లింప్స్‌లో చూపించారు. అసలు ‘మట్కా’ కథ దేని చుట్టూ తిరుగుతుంది అనే విషయాన్ని గ్లింప్స్‌లో కూడా పూర్తిస్థాయిలో రివీల్ చేయలేదు మేకర్స్. ‘ఓపెనింగ్ బ్రాకెట్’ అనే పేరుతో వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ‘మట్కా’ గ్లింప్స్ విడుదలయ్యింది. దర్శకుడు కరుణ కుమార్ తెరకెక్కించిన మునుపటి చిత్రాలతో పోలిస్తే.. ఈ సినిమా కాస్త భారీ ఎత్తులో తెరకెక్కిందని అర్థమవుతోంది. ఇప్పటికే వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా తన అప్‌కమింగ్ మూవీ ‘ఆపరేషన్ వాలెంటైన్’ నుంచి మొదటి పాట విడుదల కాగా.. ఇప్పుడు ‘మట్కా’ గ్లింప్స్ కూడా డబుల్ ఫీస్ట్ ఇస్తోంది.
ప్రొడక్షన్ వాల్యూ సూపర్..
‘మట్కా’లో వరుణ్ తేజ్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుండగా.. నోరా ఫతేహి ఐటెమ్ సాంగ్ చేయడంతో పాటు కీలక పాత్రలో కూడా కనిపించనుందని సమాచారం. వీరితో పాటు నవీన్ చంద్ర, రవిశంకర్ కూడా ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. వైరా ఎంటర్‌టైన్మెంట్స్, ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థలు కలిపి ‘మట్కా’ను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజినీ తాళ్లూరి కలిసి ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. జీవీ ప్రకాశ్.. ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. మామూలుగా పీరియాడిక్ డ్రామా చిత్రాలకు బడ్జెట్ భారీగానే కావాల్సి ఉంటుంది. అందుకే బడ్జెట్ ఎక్కువయినా కూడా ప్రొడక్షన్ వాల్యూ విషయంలో ‘మట్కా’ ఏ మాత్రం వెనక్కి తగ్గలేదని గ్లింప్స్ చూస్తుంటే అర్థమవుతోంది.
నిజమైన సంఘటనల ఆధారంగా..
24 ఏళ్ల క్రితం 1958 నుంచి 1982 మధ్యలో వైజాగ్‌లో జరిగిన నిజమైన సంఘటన ఆధారంగా ‘మట్కా’ తెరకెక్కిందని మేకర్స్ రివీల్ చేశారు. ఆ సంఘటన వల్ల దేశమంతా ఒక్కసారిగా ఉలిక్కి పడిందని చెప్తున్నారు. మెగా హీరో వరుణ్ తేజ్ ఎక్కువగా ప్రేమకథలతోనే హిట్లు అందుకున్నాడు. అయినా కూడా సినిమా, సినిమాకు వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ ప్రయోగాలు చేస్తున్నాడు. వరుణ్.. చివరిగా ‘గాంఢీవధారి అర్జున’ అనే చిత్రంలో కనిపించాడు. రా కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా తనకు ఆశించినంత విజయాన్ని తెచ్చిపెట్టలేకపోయింది. అయినా కూడా తన తరువాతి రెండు సినిమాలు ‘ఆపరేషన్ వాలెంటైన్’, ‘మట్కా’ కూడా ప్రయోగాత్మక కథలతోనే చేయడానికి వరుణ్ తేజ్ ముందుకొచ్చాడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ రెండు చిత్రాలు వరుణ్ తేజ్‌కు కావాల్సిన హిట్‌ను తెచ్చిపెట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
Also Read: హాలీవుడ్ హీరోలతో షారుఖ్ ఖాన్ పోటీ - ఇంటర్నేషన్ స్టంట్ అవార్డ్స్ రేసులో ‘పఠాన్’, ‘జవాన్’