అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

‘యాత్ర 2’ రివ్యూ, ‘నా సామి రంగ’ ఓటీటీ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.

‘నా సామిరంగ’ ఓటీటీ అప్డేట్ - స్ట్రీమింగ్ ఎక్కడంటే?
2024 సంక్రాంతికి ఎన్నో సినిమాలు విడుదల అవ్వగా.. అందులో కింగ్ నాగార్జున నటించిన ‘నా సామిరంగ’ కూడా ఒకటి. మామూలుగా సీనియర్ హీరో నాగార్జునకు సంక్రాంతి అంటే సెంటిమెంట్ ఉంది. సంక్రాంతి పండగకు విడుదలయ్యే తన సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని నాగ్ ఫిక్స్ అయ్యారు. అందుకే మూడు సినిమాలు పోటీ ఉన్నా.. ‘నా సామిరంగ’ను కూడా విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. థియేటర్లలో ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకున్న నాగ్.. ఇప్పుడు ఓటీటీలోకి రావడానికి సిద్ధమయ్యారు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుందని ఈ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ అప్డేట్ ఇచ్చింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

యాత్ర 2 రివ్యూ: వైఎస్ జగన్ జైత్రయాత్ర - సినిమాగా చూస్తే ఎలా ఉందంటే?
వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా దర్శకుడు మహి వి రాఘవ్ 'యాత్ర' తీశారు. వైఎస్సార్ ప్రత్యర్థి రాజకీయ పార్టీ అభిమానులనూ మెప్పించారు. 'యాత్ర' చిత్రానికి కొనసాగింపుగా మహి వి రాఘవ్ తీసిన తాజా సినిమా 'యాత్ర 2'. తండ్రి మరణం నుంచి ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసే వరకు జరిగిన ఘటనలు, సంఘటనల సమాహారమే ఈ సినిమా. రాజకీయాలు పక్కన పెట్టి సినిమాగా చూస్తే ఎలా ఉంది? వైయస్సార్, జగన్ పాత్రల్లో మమ్ముట్టి, జీవా ఎలా చేశారు? మహి వి రాఘవ్ ఎలా తీశారు? అనేది రివ్యూలో తెలుసుకోండి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

'యాత్ర 2' థియేటర్‌లో పవన్, జగన్ ఫ్యాన్స్ మధ్య గొడవ - తర్వాత ఏం జరిగిందంటే?
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy), జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానుల మధ్య గొడవ జరిగింది. వైయస్సార్ మరణం నుంచి ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే వరకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితంలో జరిగిన పరిణామాల సమాహారమే 'యాత్ర 2'. ఈ సినిమాలో జనసేనాని పవన్ ప్రస్తావన లేదు. ఆయన క్యారెక్టర్ కూడా లేదు. కానీ, ఒక్క చోట పరోక్షంగా జనసేన పార్టీ గురించి ప్రస్తావించారు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత 'తలాతోకా లేని కొత్త పార్టీతో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తే ఒక్క శాతం ఓటు తేడాతో అధికారం వచ్చింది' అని మహేష్ మంజ్రేకర్ చెబుతారు. ఆ తలాతోకా లేని పార్టీ జనసేన పార్టీ అని థియేటర్లలో ప్రేక్షకుల నుంచి కామెంట్లు వినిపించాయి. ఆ కామెంట్స్ వల్ల గొడవ జరిగిందా? లేదంటే మరొక కారణం ఏమైనా ఉందా? అనేది తెలియదు. కానీ భాగ్య నగరం నడిబొడ్డున ఉన్న ప్రసాద్స్ మల్టీప్లెక్స్ స్క్రీన్ 2లో పవన్ కళ్యాణ్, వైఎస్ జగన్ అభిమానుల మధ్య గొడవ జరిగింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

ఓటీటీలోకి ‘అయలాన్’- తెలుగు ప్రేక్షకులు వెయిట్ చేయాల్సిందేనా?
తమిళ నటుడు శివ కార్తికేయన్‌ హీరోగా తెరకెక్కిన రీసెంట్ మూవీ ‘అయలాన్’. సైన్స్‌ ఫిక్షన్‌ మూవీగా రూపొందిన ఈ చిత్రంలో కార్తికేయన్ సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్ గా నటించింది. రవి కుమార్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సంక్రాంతి కానుకగా తమిళంలో విడుదలై.. మంచి విజయాన్ని అందుకుంది. వసూళ్ల పరంగానూ సత్తా చాటింది. ఈ మూవీ తాజాగా ఓటీటీలోకి అడుగు పెట్టబోతోంది. సన్‌ నెక్స్ట్‌ వేదికగా ఫిబ్రవరి 9 నుంచి స్ట్రీమింగ్‌ కాబోతోంది. ఇప్పటికే సదరు ఓటీటీ సంస్థ తన ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే, ‘అయలాన్’ సినిమా ఓటీటీలో ఎన్ని భాషల్లో విడుదల అవుతుంది? ఏ భాషలో ఈ సినిమా ఎప్పుడు స్ట్రీమింగ్ చేయబోతున్నారు? అనే విషయంలో మాత్రం సన్‌ నెక్స్ట్‌ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

వెన్నెల కిషోర్‌ హీరోగా ‘చారి 111’ - రిలీజ్‌ డేట్‌ ప్రకటించిన మూవీ టీం
వెండితెరపై కమెడియన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా తనదైన స్టైల్లో కామెడీ పండిస్తూ ఆడియన్స్‌‌ను కడుపుబ్బా నవ్విస్తున్న వెన్నెల కిషోర్‌ హీరోగా పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. తొలిసారి ఆయన హీరోగా నటించిన చిత్రం 'చారి 111'. 'మళ్ళీ మొదలైంది' మూవీ డైరెక్టర్‌ టీజీ కీర్తి కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బర్కత్‌ స్టూడియోస్‌ పతాకంపై అదితి సోనీ నిర్మిస్తున్నారు. సంయుక్తా విశ్వనాథన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. మురళీ శర్మ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ సినిమా ప్రచార పోస్టర్స్‌ పాజిటివ్‌ రెస్పాన్స్‌ అందుకున్నాయి. ‘చారి 111’ మూవీని మార్చి 1వ తేదీన విడుదల చేయబోతున్నట్టు తాజాగా ఆఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ ఇచ్చారు మేకర్స్‌. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana: పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Sonia Akula Engagement: ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సోనియా ఆకుల... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సోనియా ఆకుల... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీమహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana: పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Sonia Akula Engagement: ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సోనియా ఆకుల... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సోనియా ఆకుల... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
AR Rahman Legal Notice: వారికి ఏఆర్ రెహమాన్ లీగల్ నోటీసులు, కంటెంట్ తొలగించాలని 24 గంటలు డెడ్‌లైన్
వారికి ఏఆర్ రెహమాన్ లీగల్ నోటీసులు, కంటెంట్ తొలగించాలని 24 గంటలు డెడ్‌లైన్
Weather Update: బంగాళాఖాతంలో అల్ప పీడనం, ఏపీలో 3 రోజులు భారీ వర్షాలు - తెలంగాణలో చలికి గజగజ
బంగాళాఖాతంలో అల్ప పీడనం, ఏపీలో 3 రోజులు భారీ వర్షాలు - తెలంగాణలో చలికి గజగజ
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Embed widget