అన్వేషించండి

Vennela Kishore 'Chaari 111': 'వెన్నెల' కిషోర్‌ హీరో చారి 111 - రిలీజ్‌ డేట్‌ ప్రకటించిన మూవీ టీం

Chaari 111 Movie Release: వెండితెరపై కమెడియన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా తనదైన స్టైల్లో కామెడీ పండిస్తూ ఆడియన్స్‌ కడుపుబ్బా నవ్విస్తున్న వెన్నెల కిషోర్‌ హీరోగా పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే.

Chaari 111 Movie Release: వెండితెరపై కమెడియన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా తనదైన స్టైల్లో కామెడీ పండిస్తూ ఆడియన్స్‌ కడుపుబ్బా నవ్విస్తున్న వెన్నెల కిషోర్‌ హీరోగా పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. తొలిసారి ఆయన హీరోగా నటించిన చిత్రం 'చారి 111'. 'మళ్ళీ మొదలైంది' మూవీ డైరెక్టర్‌ టీజీ కీర్తి కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బర్కత్‌ స్టూడియోస్‌ పతాకంపై అదితి సోనీ నిర్మిస్తున్నారు. సంయుక్తా విశ్వనాథన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. మురళీ శర్మ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ సినిమా ప్రచార పోస్టర్స్‌ పాజిటివ్‌ రెస్పాన్స్‌ అందుకున్నాయి.

ముఖ్యంగా ఇటీవల రిలీజైన కాన్సెప్ట్ టీజర్‌కు విశేష స్పందన లభించింది. దీంతో మూవీ అంచనాలు నెలకొన్నాయి. కమెడియన్‌ వినోదాన్ని పండించిన వెన్నెల కిషోర్‌ హీరో ఎలా మెప్పించనున్నాడనే క్యూరియసిటీ నెలకొంది. దీంతో మూవీ అంచాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో తాజాగా చిత్ర యూనిట్‌ మూవీ రిలీజ్‌ డేట్‌ను ప్రకటించింది. చారి 111 మూవీని మార్చి 1వ తేదీన విడుదల చేయబోతున్నట్టు తాజాగా ఆఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ ఇచ్చారు మేకర్స్‌. ఈ సందర్భంగా రిలీజ్‌ చేసిన రిలీజ్‌ పోస్టర్‌ ఆకట్టుకుంటుంది. ప్రేక్షకుల్లో క్యూసియాసిటీ కలిగించే విధంగా ప్రత్యేకంగా డిజైన్ చేశారు.

థియేటర్లలోకి గూఢచారిగా ప్రేక్షకుల్ని నవ్వించడానికి 'వెన్నెల' కిశోర్ వస్తున్నట్లు ఉంది. ఈ జనరేషన్ కమెడియన్లలో తనకంటూ సపరేట్ కామెడీ స్టైల్ క్రియేట్ చేసుకున్న ఆయన.. ఈ సినిమాలో ఏ విధంగా నవ్విస్తారో థియేటర్లలో చూడాలి. రిలీజ్‌ డేట్‌ ప్రకటించిన సందర్భంగా మూవీ దర్శకుడు టీజీ కీర్తి కుమార్‌ మాట్లాడారు. "ఇదొక స్పై యాక్షన్ కామెడీ సినిమా. సిల్లీ మిస్టేక్స్ చేసే ఒక స్పై పెద్ద కేసును ఎలా సాల్వ్ చేశాడనేది సినిమా. వెన్నెల కిశోర్, సంయుక్తా విశ్వనాథన్ స్పై రోల్స్ చేశారు. వాళ్లకు బాస్ రోల్ మురళీ శర్మ చేశారు. కథలో ఆయనది కీలక పాత్ర" అని చెప్పారు.

Also Read: ఇంట్లో ఒత్తిడి.. మళ్లీ పెళ్లికి సిద్ధమైన సమంత? - బంధువుల అబ్బాయితో పెళ్లట!

ఆ తర్వాత నిర్మాత అదిఇ సోనీ మాట్లాడుతూ.. స్పై జానర్ సినిమాల్లో 'చారి 111' కొత్తగా ఉంటుంది. 'వెన్నెల' కిశోర్ గారి నటన, టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం సినిమాకు హైలైట్ అవుతాయి. మార్చి 1న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. అతి త్వరలో ట్రైలర్, పాటలు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం" అన్నారు.  కాగా ఈ మూవీ పాటలను ఆదిత్య మ్యూజిక్‌ విడుదల చేయనుంది. 'వెన్నెల' కిశోర్, సంయుక్తా విశ్వనాథన్, మురళీ శర్మ, బ్రహ్మాజీ, సత్య, రాహుల్ రవీంద్రన్, పావని రెడ్డి, 'తాగుబోతు' రమేష్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా.. సైమన్‌ కె కింగ సంగీతం అందిస్తున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Vishwanath And Sons Trailer: సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
Korean Kanakaraju : కొరియన్ కనకరాజులో NTR డైలాగ్ - ట్రోలింగ్స్‌పై వరుణ్ తేజ్ రియాక్షన్
కొరియన్ కనకరాజులో NTR డైలాగ్ - ట్రోలింగ్స్‌పై వరుణ్ తేజ్ రియాక్షన్
DC Movie Review - డీసీ రివ్యూ: హీరోగా లోకేష్ కనగరాజ్ డెబ్యూ హిట్టేనా... అనిరుధ్ మ్యూజిక్‌తో చేసిన మేజిక్ ఎలా ఉందంటే?
డీసీ రివ్యూ: హీరోగా లోకేష్ కనగరాజ్ డెబ్యూ హిట్టేనా... అనిరుధ్ మ్యూజిక్‌తో చేసిన మేజిక్ ఎలా ఉందంటే?
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Chalasani Anjaneyulu: విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
Medical Student Brain Dead: రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
PMFBY Last Date: రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
IPL Hardik Trade: హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
Vishwanath And Sons Trailer: సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Care Health Insurance: తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
Embed widget