అన్వేషించండి

‘డెవిల్’ రివ్యూ, బాలీవుడ్‌లో త్రిష ఎంట్రీ - నేటి టాప్ సినీ విశేషాలివే!

ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.

మహేష్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - అక్కడ 'గుంటూరు కారం' బుకింగ్స్ ఓపెన్!
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'గుంటూరు కారం'. ఇప్పటికే ఈ సినిమాపై ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో తెలిసిందే. అతడు, ఖలేజా వంటి కమర్షియల్ సినిమాల తర్వాత మహేష్‌బాబు-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా కావడంతో మహేష్ ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి ఇటీవల మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. అందులో భాగంగా రిలీజ్ అయిన ధమ్ మసాలా, ఓ మై బేబి వంటి సాంగ్స్ కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే సినిమాకి సంబంధించి యూఎస్‌ఏలో ఉన్న మహేశ్‌ బాబు ఫ్యాన్స్ కి ఓ గుడ్ న్యూస్ వచ్చింది. అదేంటంటే యూఎస్‌లో 'గుంటూరు కారం' అడ్వాన్స్ బుకింగ్స్ షురూ అయ్యాయి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

13 ఏళ్ల తర్వాత బాలీవుడ్‌కు త్రిష రీ ఎంట్రీ - అభిమాన హీరోతో నటించే ఛాన్స్!
కోలీవుడ్ స్టార్ హీరోయిన్ చెన్నై బ్యూటీ త్రిష తన సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లు అందుకుంది. దళపతి విజయ్ సరసన త్రిష నటించిన 'లియో' ఈ ఏడాది కోలీవుడ్లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. లియో సక్సెస్ తో త్రిష క్రేజ్ మరింత పెరిగిపోయింది. దీంతో ఈ ముద్దుగుమ్మకి ఇతర ఇండస్ట్రీల్లో అవకాశాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే త్రిషకి ఎవరూ ఊహించని విధంగా ఓ బాలీవుడ్ ఆఫర్ వచ్చింది. సుమారు 13 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత త్రిష మళ్లీ బాలీవుడ్ లో రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతుంది. తాజా సమాచారం ప్రకారం త్రిష ఓ హిందీ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

సినీ లవర్స్‌కు PVR బంఫర్ ఆఫర్ - రూ.700తో నెల మొత్తం సినిమాలు చూసేయొచ్చు
నీ లవర్స్ కి ప్రముఖ థియేటర్ సంస్థ PVR బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం తక్కువ మొత్తం తోనే నెల అంతా సినిమాలు చూసే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ మేరకు ఆడియన్స్ కోసం మూవీ పాస్ విధానాన్ని తీసుకొచ్చింది. అందుకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. ఒకప్పుడు ఓ సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు.. కుటుంబ సభ్యులంతా కలిసి సరదాగా థియేటర్‌కు వెళ్లి సినిమా చూసి వచ్చేశారు. జస్ట్ వంద రూపాయల్లో ఫ్యామిలీ మొత్తం సినిమా చూసి వచ్చేవారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడంతా మల్టీప్లెక్స్‌లుగా మారిపోయాయి థియేటర్లు. ఖర్చులు కూడా భారీగా పెరిగిపోయాయి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

డెవిల్ రివ్యూ: నందమూరి కళ్యాణ్ రామ్ సినిమా హిట్టా? ఫట్టా?
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన తాజా సినిమా 'డెవిల్'. ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్... అనేది ఉపశీర్షిక. విడుదలకు ముందు ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్ని ఆకర్షించాయి. అంచనాలు పెంచాయి. మరి, సినిమా ఎలా ఉంది? మిస్టరీ థ్రిల్లర్ మూవీ మెప్పిస్తుందా? లేదా? (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

‘హనుమాన్‌’లో 12 మంది సూపర్ హీరోస్, సీక్వెల్‌పై హింట్ - తేజ, ప్రశాంత్‌తో అడవి శేష్ ఇంటర్వ్యూ
టాలీవుడ్ లో వచ్చే సంక్రాంతి బరిలో అగ్ర హీరోల సినిమాలతో పాటు ఓ చిన్న సినిమా కూడా రిలీజ్ కాబోతోంది. ఆ సినిమా పేరే 'హనుమాన్'. టాలీవుడ్ లో తన ఫిలిం మేకింగ్ తో ఆకట్టుకున్న యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా నటిస్తున్న మూవీ ఇది. సంక్రాంతి కానుకగా ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు. రిలీజ్ టైం దగ్గర పడడంతో మేకర్స్ ప్రమోషన్స్ ని వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ తో ఇంటర్వ్యూ ని ప్లాన్ చేశారు మూవీ టీం. తేజ సజ్జ హనుమాన్ మూవీకి సంబంధించి షాకింగ్ అప్డేట్ రివీల్ చేశాడు. హనుమాన్ మూవీ అనేది సూపర్ హీరో యూనివర్స్ లో భాగంగా ఉంటుందని, ఇందులో వేరే సూపర్ హీరోస్ వస్తారని అంటే.. అవును, అది నిజమే సూపర్ హీరో యూనివర్స్ లో మొత్తం 12 మంది సూపర్ హీరోస్ ఉంటారని ప్రశాంత్ వర్మ చెప్పడంతో అడివి శేష్ ఎక్సైటింగ్ గా ఆ 12 సూపర్ హీరోస్ ఎవరెవరు? అని అడిగారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Traffic Restrictions: హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు, ఆ రూట్లో వెళ్లకండి
హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు, ఆ రూట్లో వెళ్లకండి
Bigg Boss 8 : అభయ్ సెల్ఫ్ నామినేషన్, 3వ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వీళ్లే, రిస్క్ ఎవరికంటే?
అభయ్ సెల్ఫ్ నామినేషన్, 3వ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వీళ్లే, రిస్క్ ఎవరికంటే?
Andhra News: ఏపీ ప్రభుత్వం ప్రపంచ రికార్డు - ఒకేరోజు 13,326 గ్రామసభలు, డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే..
ఏపీ ప్రభుత్వం ప్రపంచ రికార్డు - ఒకేరోజు 13,326 గ్రామసభలు, డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే..
Balapur Ganesh Laddu Auction: రూ. 450 నుంచి రూ. 27 లక్షల వరకు- బాలాపూర్ లడ్డూ వేలం విజేతల పూర్తి జాబితా
రూ. 450 నుంచి రూ. 27 లక్షల వరకు- బాలాపూర్ లడ్డూ వేలం విజేతల పూర్తి జాబితా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Operation Kagar Maoists Death Toll | ప్రాణాలు కోల్పోతున్న అడవిలో అన్నలు | ABP Desamసింపుల్‌గా గుడిలో పెళ్లి చేసుకున్న అదితి రావు, సిద్దార్థ - ఫొటోలు వైరల్ట్రాఫిక్ వాలంటీర్లుగా గౌరవంగా బతుకుతామంటున్న ట్రాన్స్‌జెండర్స్‌వేలంలో రూ.32 కోట్ల ధర పలికిన ఐన్‌స్టీన్‌ లెటర్‌, అందులో ఏముందో తెలుసా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Traffic Restrictions: హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు, ఆ రూట్లో వెళ్లకండి
హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు, ఆ రూట్లో వెళ్లకండి
Bigg Boss 8 : అభయ్ సెల్ఫ్ నామినేషన్, 3వ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వీళ్లే, రిస్క్ ఎవరికంటే?
అభయ్ సెల్ఫ్ నామినేషన్, 3వ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వీళ్లే, రిస్క్ ఎవరికంటే?
Andhra News: ఏపీ ప్రభుత్వం ప్రపంచ రికార్డు - ఒకేరోజు 13,326 గ్రామసభలు, డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే..
ఏపీ ప్రభుత్వం ప్రపంచ రికార్డు - ఒకేరోజు 13,326 గ్రామసభలు, డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే..
Balapur Ganesh Laddu Auction: రూ. 450 నుంచి రూ. 27 లక్షల వరకు- బాలాపూర్ లడ్డూ వేలం విజేతల పూర్తి జాబితా
రూ. 450 నుంచి రూ. 27 లక్షల వరకు- బాలాపూర్ లడ్డూ వేలం విజేతల పూర్తి జాబితా
YSRCP Merge With Congress: షర్మిల అడ్డుపడకపోతే కాంగ్రెస్‌లో వైసీపీ విలీనం అయ్యుండేది! సంచలనం రేపుతున్న పోస్ట్
YSRCP Merge With Congress: షర్మిల అడ్డుపడకపోతే కాంగ్రెస్‌లో వైసీపీ విలీనం అయ్యుండేది! సంచలనం రేపుతున్న పోస్ట్
Hyderabad News: లడ్డూ వేలంలో పాల్గొని వినాయకుని ముందు తీన్మార్ స్టెప్పులు - గుండెపోటుతో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి
లడ్డూ వేలంలో పాల్గొని వినాయకుని ముందు తీన్మార్ స్టెప్పులు - గుండెపోటుతో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి
Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ బోట్ల తొలగింపు - మరో ప్లాన్‌కు ఇంజినీర్లు సిద్ధం, ప్రయత్నాలు ఫలించేనా?
ప్రకాశం బ్యారేజీ బోట్ల తొలగింపు - మరో ప్లాన్‌కు ఇంజినీర్లు సిద్ధం, ప్రయత్నాలు ఫలించేనా?
Nipah virus: కేరళలో మళ్లీ నిఫా పంజా.. వైరస్‌తో యువకుడి మృతి..151 మందికి ఐసోలేషన్:
కేరళలో మళ్లీ నిఫా పంజా.. వైరస్‌తో యువకుడి మృతి..151 మందికి ఐసోలేషన్
Embed widget