PVR Cinimas : సినీ లవర్స్‌కు PVR బంఫర్ ఆఫర్ - రూ.700తో నెల మొత్తం సినిమాలు చూసేయొచ్చు
PVR Offer: సినీ లవర్స్ కి PVR బంపర్ ఆఫర్ ప్రకటించింది కేవలం 700 రూపాయలతోనే నెలంతా సినిమాలు చూసే అవకాశాన్ని కల్పిస్తోంది.
PVR INOX launches monthly pass at Rs.699: సినీ లవర్స్ కి ప్రముఖ థియేటర్ సంస్థ PVR బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం తక్కువ మొత్తం తోనే నెల అంతా సినిమాలు చూసే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ మేరకు ఆడియన్స్ కోసం మూవీ పాస్ విధానాన్ని తీసుకొచ్చింది. అందుకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. ఒకప్పుడు ఓ సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు.. కుటుంబ సభ్యులంతా కలిసి సరదాగా థియేటర్‌కు వెళ్లి సినిమా చూసి వచ్చేశారు. జస్ట్ వంద రూపాయల్లో ఫ్యామిలీ మొత్తం సినిమా చూసి వచ్చేవారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడంతా మల్టీప్లెక్స్‌లుగా మారిపోయాయి థియేటర్లు. ఖర్చులు కూడా భారీగా పెరిగిపోయాయి.
సినిమా టికెట్ల రేట్స్ కూడా భారీగా పెరిగిపోయాయి. ఒక వ్యక్తి సినిమా థియేటర్‌కు వెళ్లి సినిమా చూడాలంటే.. కనీసం రూ. 500 చేతిలో ఉండాల్సిందే. ఇక ఫ్యామిలీతో వెళ్తే రూ. 3 వేలకు పైగానే ఖర్చు అవుతుంది. అందుకే.. చాలా మంది ఇంత డబ్బు పెట్టి సినిమా చూడాలా? అని ఆలోచిస్తుంటారు. ఇంట్లోనే ఓటిటి ప్లాట్‌ఫామ్‌లో చూస్తుంటారు. ఫలితంగా థియేటర్లకు వచ్చే వారి సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలోనే.. ప్రేక్షకులను థియేటర్ల వైపు ఆకర్షించేందుకు PVR సంస్థ ఓ సర్ప్రైజింగ్ ఆఫర్ ను ప్రకటించింది. కేవలం రూ.700 లకే నెలంతా సినిమాలు చేసే అవకాశాన్ని కలిపిస్తున్నారు. ప్రేక్షకుల కోసం మూవీ పాస్ విధానాన్ని తీసుకురానున్నారు.
ఈ విధానం నార్త్ లో చాలా కాలంగా ఉన్నప్పటికీ.. సౌత్ లో ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేయనున్నారు. ఈ విధానంలో రూ.699 కే మూవీ పాస్ అందించనున్నారు. ఈ పాస్ తో నెలకు 10 సినిమాలు చూసే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఒక కండీషన్ ఉంది. అదేంటంటే.. ఈ పాస్ సోమవారం నుండి గురువారం రోజుల్లో మాత్రమే సినిమా చూసే అవకాశం ఉంటుంది. వీకెండ్స్ లో ఈ పాస్ చెల్లదు. ఇప్పటికే పాస్ రిజిస్ట్రేషన్ కి సంబంధించిన పనులు మొదలైనట్లు తెలుస్తోంది. అయితే ఈ పాస్ లు ఎప్పటినుంచి అందుబాటులోకి వస్తాయనే దానిపై PVR సంస్థ క్లారిటీ ఇవ్వలేదు.
PVR థియేటర్స్ లో ఓ సినిమా చూడాలంటే టికెట్ కి మినిమం 250 రూపాయలు ఖర్చవుతుంది. ఆ లెక్కన పది సినిమాలంటే సుమారు 2500 రూపాయలు అవుతుంది. అది ఈ పాస్ ద్వారా సినిమా చూస్తే దాదాపు 1800 రూపాయలు సేవ్ చేయొచ్చు. కాగా ఈ సబ్స్క్రిప్షన్ ప్లాన్‌ను PVR సంస్థ ద్వారా లేదా వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేయొచ్చు. ఈ పాస్ పోర్ట్ కు సంబంధించిన సబ్స్క్రిప్షన్ పీరియడ్ కేవలం మూడు నెలల వ్యవధి మాత్రమే కలిగి ఉంటుంది
Also Read : ‘హనుమాన్’లో 12 మంది సూపర్ హీరోస్, సీక్వెల్‌పై హింట్ - తేజ, ప్రశాంత్‌తో అడవి శేష్ ఇంటర్వ్యూ