అన్వేషించండి
Advertisement
Guntur Kaaram : మహేష్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - అక్కడ 'గుంటూరు కారం' బుకింగ్స్ ఓపెన్!
Guntur Kaaram : మహేష్ బాబు గుంటూరు కారం మూవీ యూఎస్ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. డల్లాస్ తో పాటూ ఇతర లొకేషన్స్ లో బుకింగ్స్ కొనసాగుతున్నాయి.
Guntur Kaaram Pre-sales begin in the USA :సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'గుంటూరు కారం'. ఇప్పటికే ఈ సినిమాపై ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో తెలిసిందే. అతడు, ఖలేజా వంటి కమర్షియల్ సినిమాల తర్వాత మహేష్‌బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా కావడంతో మహేష్ ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి ఇటీవల మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. అందులో భాగంగా రిలీజ్ అయిన ధమ్ మసాలా, ఓ మై బేబి వంటి సాంగ్స్ కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇక తాజాగా థర్డ్ సింగిల్ ప్రోమో కూడా రిలీజ్ అయింది. 'కుర్చీ మడతపెట్టి' అంటూ సాగే ఈ మాస్ సాంగ్ ఫుల్ లిరికల్ వీడియోని డిసెంబర్ 30న రిలీజ్ చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమాని గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు. రిలీజ్ టైం దగ్గర పడటంతో మూవీ టీం బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమాకి సంబంధించి యూఎస్‌ఏలో ఉన్న మహేశ్ బాబు ఫ్యాన్స్ కి ఓ గుడ్ న్యూస్ వచ్చింది. అదేంటంటే యూఎస్‌లో 'గుంటూరు కారం' అడ్వాన్స్ బుకింగ్స్ షురూ అయ్యాయి. డల్లాస్‌తోపాటు పలు ఇతర లొకేషన్లలో బుకింగ్స్ కొనసాగుతున్నాయి. ఫ్యాన్స్ ఇప్పటికే పోటీ పడి మరి ముందే టికెట్ బుక్ చేసుకునే పనిలో బిజీ అయిపోయారు.
అతి త్వరలోనే యుఎస్ లో మరికొన్ని ప్రాంతాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ని ఓపెన్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఓవర్సీస్ లో మహేష్ బాబుకి ఎలాంటి క్రేజ్ ఉందో తెలిసిందే. ఓవర్సీస్ మార్కెట్ వద్ద ఎక్కువసార్లు వన్ మిలియన్ మార్క్ అందుకున్న ఏకైక హీరో మహేష్ మాత్రమే కావడం విశేషం. మహేష్ బాబు నటించిన 12 సినిమాలు ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ వద్ద వన్ మిలియన్ మార్క్ ని అందుకుని సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాయి. ఓవర్సీస్ లో మహేష్ కి ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని మేకర్స్ అక్కడ వీలైనంత ఎక్కువ లొకేషన్స్ లో సినిమాని రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం.
మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్.రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. దాదాపు షూటింగ్ పూర్తయిన ఈ సినిమా నుండి జనవరి మొదటి వారంలో ట్రైలర్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. మహేష్ సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, జగపతిబాబు, వెన్నెల కిషోర్ ఈశ్వరీ రావ్, రఘుబాబు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా 2024 జనవరి 12 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
హైదరాబాద్
సినిమా
నిజామాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion