అన్వేషించండి

Sivaji: నువ్వే అనవసరంగా గెలుక్కున్నావ్, పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడొద్దు: శోభాశెట్టిపై శివాజీ ఫైర్, బయటా అదే లొల్లి!

శివాజీ, శోభా శెట్టి.. బిగ్ బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్స్‌గా ఉన్నంతవరకు చాలాసార్లు గొడవపడ్డారు. అయితే మరోసారి శోభా ప్రవర్తనను గుర్తుచేసుకుంటూ శివాజీ.. ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

బిగ్ బాస్ సీజన్ 7లో తమ మధ్య జరిగిన గొడవలను ఇంకా కొందరు కంటెస్టెంట్స్ మర్చిపోలేదు. అందుకే బయటికి వచ్చిన తర్వాత కొంతమంది కంటెస్టెంట్స్.. తమ తోటి కంటెస్టెంట్స్‌లో కొంతమందిని మాత్రమే కలవడానికి ఇష్టపడుతున్నారు. ఇక శివాజీ కూడా ఇప్పటివరకు కంటెస్టెంట్స్ అందరినీ ఏమీ కలవలేదు. కేవలం తన ఫ్రెండ్స్ అయినా శివాజీ, యావర్‌లనే ఎక్కువసార్లు కలిశాడు. వారితో పాటు మరికొందరని కలిశాడు. ఇక హౌజ్‌లో ఉన్న సమయంలో శోభాతో జరిగిన గొడవపై శివాజీ స్పందించాడు.

అదే నాకు నచ్చని విషయం..
‘‘నాకు అర్థమయ్యింది ఏంటంటే వాళ్లంతా కావాలని గొడవలు పెట్టుకున్నారు. ఎంతోకొంత ఆర్టిస్ట్‌ను కదా.. ఎన్నో సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను. అటెన్షన్ వస్తుందనే అయ్యిండొచ్చు.. లేకపోతే అరిచి, గొడవ చేస్తే జనం అట్రాక్ట్ అవుతారు అని అయ్యిండొచ్చు.. ఏదైనా కానీ రకరకాల ఫీలింగ్స్‌తో ఉన్నారు. నాకు నచ్చని విషయం ఏంటంటే శోభా కన్ఫెషన్ రూమ్‌లో తను కన్నడ అమ్మాయి అని చెప్పింది. అలాంటి ఫీలింగ్ మీ మనసులో ఉంటే తెలుగువాళ్లు ఎవరూ మిమ్మల్ని ఆదరించేవారు కాదు. దయజేసి మెచ్యురిటీ లేకుండా అలాంటి పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడొద్దు. నీ నటన బాగుందని ఎంకరేజ్ చేశారు. తెలుగువాళ్లు ఎప్పుడూ అలాగే చేస్తారు. నువ్వే అనవసరంగా గెలుక్కున్నావు. నాకు చాలా చీప్‌గా అనిపించింది. అలాంటివి ఎప్పుడూ చేయకు. ఆరోజు తను చేసిన ఓవరాక్షన్ అంతా చూసిన తర్వాత ఎందుకు ఈ పిల్ల లైఫ్‌ను పాడుచేసుకుంటుంది అనుకున్నాను. మొదట్లో నాతో చాలా బాగుండేది. మా పిల్లలు కూడా మొదటి ఆరు వారాలు బాగుంది నాన్న నీతో అని’’ అంటూ శోభా గురించి, తనతో జరిగిన గొడవ గురించి చెప్తూ.. మధ్యలో తనకు సలహా కూడా ఇచ్చాడు శివాజీ.

నీ కెరీర్‌కు మంచిది కాదు..
‘‘మీరు ఇక్కడ చేసేదే మీ నిజ జీవితంలో క్యారెక్టర్ అని అందరికీ చెప్పేవాడిని. జాగ్రత్తగా మీ జీవితాన్ని మలచుకోండి అని హెచ్చరించేవాడిని. ఆ తర్వాత మన కలర్స్ ఇప్పటినుంచి బయటికొస్తాయని బాబుగారు అన్నారు. భగవంతుడు బిగ్ బాస్‌కు వచ్చిన తర్వాత మనల్ని మనం మార్చుకునే అవకాశం ఇచ్చాడు. మనిషికి ఓపిక చాలా ముఖ్యం, ఆ ఓపిక లేకపోతే జీవితాలు దెబ్బతింటాయి. శోభా తన జీవితాన్ని మార్చుకునే అవకాశం బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా దొరికింది. మీకు నచ్చినా నచ్చకపోయినా నేను ఎవడిని? నేను ఒక ఆర్టిస్ట్‌నే. నాకు నచ్చకపోయినంత మాత్రానా మిమ్మల్ని ప్రపంచమంతా వెలేస్తుందా? నువ్వు మాట్లాడిన మాటలు నీకు మంచివి కాదు, నీ కెరీర్‌కు మంచిది కాదు’’ అంటూ శోభాకు ఇన్‌డైరెక్ట్‌గా వార్నింగ్ ఇచ్చాడు శివాజీ. 

నా దగ్గర అంత డబ్బు లేదు..
ప్రశాంత్, యావర్ తనకు రెండు కళ్లులాంటి వాళ్లని మరోసారి తెలిపాడు శివాజీ. ‘‘ప్రశాంత్.. మనం తమిళ సినిమాల్లో చూసే ఆర్టిస్ట్‌లాంటివాడు. ధనుష్‌లాగా చేయగలిగిన కెపాసిటీ తన దగ్గర ఉంది. కాకపోతే వాడిని మలిచేవాడు కావాలి. మరి ధనుష్ అంతా అని నేను కానీ ఇంత కప్ కొట్టాడు, అంతమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఎందుకు కాకూడదు.. అవుతాడేమో. నేనుగా మిమ్మల్ని పెద్ద ఆర్టిస్టులను చేయలేను. నా దగ్గర అంత డబ్బు లేదు అని వాళ్లతో చెప్పాను. కానీ నాకు తెలిసిన దర్శకులను, నిర్మాతలను కలిపిస్తాను అనే మాట మాత్రం చెప్పాను. వాళ్లకు నా మీద ఎలాంటి ఆశలు లేవు. మనస్ఫూర్తిగా అభిమానించారు, గౌరవించారు’’ అంటూ ప్రశాంత్, యావర్‌లపైన ప్రేమను బయటపెట్టాడు శివాజీ. ఇక పల్లవి ప్రశాంత్ జైలుకు వెళ్లినప్పుడు తాను అందరి ముందుకు రాకపోయినా.. వెనక ఉండి నడిపించానని అన్నాడు.

Also Read: ప్రశాంత్ రోడ్డెక్కే పరిస్థితి వస్తుంది, అందరిలో అమర్‌దీప్ బెటర్ - శివాజీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy:  యంగ్ ఇండియా నా బ్రాండ్ - ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్‌పై రేవంత్ కీలక వ్యాఖ్యలు
యంగ్ ఇండియా నా బ్రాండ్ - ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్‌పై రేవంత్ కీలక వ్యాఖ్యలు
Itdp Arrest: గీత దాటితే ఏ పార్టీ అయినా ఒకటే - వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త అరెస్టు
గీత దాటితే ఏ పార్టీ అయినా ఒకటే - వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త అరెస్టు
Manchu Manoj: 'మాది ఆస్తి తగాదా కాదు' - అలా జరగకపోయి ఉంటే ఇంత దూరం వచ్చేవాడిని కాదన్న మంచు మనోజ్
'మాది ఆస్తి తగాదా కాదు' - అలా జరగకపోయి ఉంటే ఇంత దూరం వచ్చేవాడిని కాదన్న మంచు మనోజ్
Kakani Govardhan: కాకాణి గోవర్ధన్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు- అష్టదిగ్బంధం చేసిన పోలీసులు 
కాకాణి గోవర్ధన్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు- అష్టదిగ్బంధం చేసిన పోలీసులు 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

RCB vs DC Match Preview IPL 2025 | పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొదమ సింహాల ఢీSai Sudharsan Batting IPL 2025 | 30 మ్యాచులుగా వీడిని డకౌట్ చేసిన మగాడే లేడుShubman Gill vs Jofra Archer  | జోఫ్రా ఆర్చర్ ను ఆడలేకపోతున్న శుభ్ మన్ గిల్GT vs RR Match Highlights IPL 2025 | రాజస్థాన్ రాయల్స్ పై 58 పరుగుల తేడాతో రాజస్థాన్ ఘన విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy:  యంగ్ ఇండియా నా బ్రాండ్ - ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్‌పై రేవంత్ కీలక వ్యాఖ్యలు
యంగ్ ఇండియా నా బ్రాండ్ - ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్‌పై రేవంత్ కీలక వ్యాఖ్యలు
Itdp Arrest: గీత దాటితే ఏ పార్టీ అయినా ఒకటే - వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త అరెస్టు
గీత దాటితే ఏ పార్టీ అయినా ఒకటే - వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త అరెస్టు
Manchu Manoj: 'మాది ఆస్తి తగాదా కాదు' - అలా జరగకపోయి ఉంటే ఇంత దూరం వచ్చేవాడిని కాదన్న మంచు మనోజ్
'మాది ఆస్తి తగాదా కాదు' - అలా జరగకపోయి ఉంటే ఇంత దూరం వచ్చేవాడిని కాదన్న మంచు మనోజ్
Kakani Govardhan: కాకాణి గోవర్ధన్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు- అష్టదిగ్బంధం చేసిన పోలీసులు 
కాకాణి గోవర్ధన్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు- అష్టదిగ్బంధం చేసిన పోలీసులు 
Tahawwur rana: ముంబై దాడుల కీలక సూత్రధారి తహవూర్ రాణాను లాక్కొచ్చేశారు - ఇప్పుడేం చేయబోతున్నారంటే ?
ముంబై దాడుల కీలక సూత్రధారి తహవూర్ రాణాను లాక్కొచ్చేశారు - ఇప్పుడేం చేయబోతున్నారంటే ?
Good Bad Ugly Review - 'గుడ్ బ్యాడ్ అగ్లీ' రివ్యూ: అజిత్ వీరాభిమానులకు పండగ... మరి కామన్ ఆడియన్స్‌కు? గ్యాంగ్‌స్టర్‌ డ్రామా హిట్టా? ఫట్టా?
'గుడ్ బ్యాడ్ అగ్లీ' రివ్యూ: అజిత్ వీరాభిమానులకు పండగ... మరి కామన్ ఆడియన్స్‌కు? గ్యాంగ్‌స్టర్‌ డ్రామా హిట్టా? ఫట్టా?
Puri Jagannadh Vijay Sethupathi: పూరీ జగన్నాథ్ విజయ్ సేతుపతి సినిమాలో టబు - అధికారిక ప్రకటన వచ్చేసింది!
పూరీ జగన్నాథ్ విజయ్ సేతుపతి సినిమాలో టబు - అధికారిక ప్రకటన వచ్చేసింది!
Pet Into A Human: విఠలాచార్య మాయాజాలం, పెంపుడు జంతువులు మనుషుల్లా మారుతున్నాయ్!
విఠలాచార్య మాయాజాలం, పెంపుడు జంతువులు మనుషుల్లా మారుతున్నాయ్!
Embed widget