Sivaji: ప్రశాంత్ రోడ్డెక్కే పరిస్థితి వస్తుంది, అందరిలో అమర్‌దీప్ బెటర్ - శివాజీ
Bigg Boss 7 Telugu Sivaji: బిగ్ బాస్ సీజన్ 7 పూర్తయిన ఇంతకాలం తర్వాత కంటెస్టెంట్స్ గురించి, హౌజ్‌లో తను ఎదుర్కున్న పరిస్థితుల గురించి మాట్లాడడానికి శివాజీ ముందుకొచ్చాడు.
Shivaji: మామూలుగా బిగ్ బాస్ రియాలిటీ షో పూర్తవ్వగానే అందులో పాల్గొన్న కంటెస్టెంట్స్ అందరూ తెగ ఇంటర్వ్యూలలో పాల్గొంటూ.. బిగ్ బాస్ హౌజ్‌లో జరిగిన విశేషాలను చర్చిస్తూ ఉంటారు. కానీ బిగ్ బాస్ సీజన్ 7 పూర్తవ్వగానే జరిగిన గొడవల వల్ల కంటెస్టెంట్స్ ఇంటర్వ్యూలు ఇవ్వడానికి కుదరలేదు. అందుకే ఇన్నిరోజుల తర్వాత ఇంటర్వ్యూ ఇవ్వడానికి శివాజీ ముందుకొచ్చాడు. బిగ్ బాస్ అనేది లైఫ్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ అని, దాని వల్ల తనకు చాలా ఓపిక వచ్చిందని చెప్పాడు. అంతే కాకుండా హౌజ్‌లో పల్లవి ప్రశాంత్, యావర్ బాగా కనెక్ట్ అయ్యారని చెప్తూ.. ఇతర కంటెస్టెంట్స్ గురించి, హౌజ్‌లో జరిగిన సంఘటనల గురించి గుర్తుచేసుకున్నాడు.
వాళ్లంతా ఇప్పుడు ఇబ్బందిపడుతున్నారు..
బిగ్ బాస్ సీజన్ 7 విజేతగా నిలిచిన పల్లవి ప్రశాంత్ వెంటనే జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. దానిపై శివాజీ స్పందించాడు. కొందరు ఆకతాయిల చేసిన పని వల్ల ప్రశాంత్ శిక్ష అనుభవించాడని, ఇందులో అతడి తప్పేం లేదని అందరికీ తెలుసని అన్నాడు. ఫ్యాన్స్ ఇలా చేస్తే ప్రశాంత్ రోడ్డెక్కే పరిస్థితి వస్తుందని, దయజేసి అలా చేయొద్దని రిక్వెస్ట్ చేశాడు. అంతే కాకుండా ‘స్పై’ అనే పేరుతో తమ ఫ్రెండ్‌షిప్ పాపులర్ అయ్యింది కాబట్టి దానిపై ఒక షార్ట్ ఫిల్మ్ తీద్దామని పనులు కూడా మొదలుపెట్టానని, దానికి సంబంధించిన వివరాలు త్వరలో రివీల్ చేస్తానని అన్నాడు. ‘స్పా’ బ్యాచ్‌లో అందరికంటే అమర్‌దీప్ కాస్త బెటర్ అని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. తన కుటుంబంతో సహా చాలామంది తనకే కప్ రావాలని ఆశ్చర్యపోయారని బయటపెట్టాడు శివాజీ. తనకు రాకపోయినా తన బిడ్డకు వచ్చిందని సంతోషించాడు. తనను వెన్నుపోటు పొడిచిన వాళ్లంతా ఇప్పుడు ఇబ్బందిపడుతున్నారని అన్నాడు.
తనే సరైన కంటెస్టెంట్..
నయని పావని గురించి ప్రత్యేకంగా చెప్పుకొచ్చాడు శివాజీ. ‘‘నయని పావని ఉంటే నాకు ప్రెజర్ తగ్గిస్తుందని అనుకున్నాను. బిగ్ బాస్ గేమ్‌కు నయని పావని సరైన కంటెస్టెంట్. తరువాత సీజన్‌కు తనను తీసుకోవాలనే కోరుకుంటున్నాను. ఎందుకంటే తను ఎంటర్‌టైన్ చేయగలదు, గేమ్స్ బాగా ఆడుతుంది, ధైర్యంగా మాట్లాడుతుంది’’ అంటూ నయని పావనిని తెగ పొగిడేశాడు శివాజీ. భోలే షావలి బాగానే ఆడాడు. కానీ ఎందుకు ఎలిమినేట్ అయ్యాడో భగవంతుడే తెలియాలి అన్నాడు. సందీప్ చేసిన చిన్న తప్పు వల్ల ఎలిమినేట్ అయిపోయాడని తెలిపాడు. షకీలా ఎప్పుడూ అన్న అంటూ ఉండేదని గుర్తుచేసుకున్నాడు. నిజ జీవితంలో తను చాలా గొప్ప మనిషి అని ప్రశంసించాడు. దామిని మంచి అమ్మాయే అయినా ఇన్‌ఫ్లుయెన్స్ అవ్వడం వల్ల ఎలిమినేట్ అయిపోయిందని అన్నాడు. తేజ చాలా తెలివైనవాడు, కొంచెం వేషాలు ఉన్నాయి తగ్గించాలి అని సలహా ఇచ్చాడు. శుభశ్రీకి చాలా తపన ఉందని ఆల్ ది బెస్ట్ చెప్పాడు శివాజీ.
క్లారిటీ తీసుకుంటాను..
అమ్మాయిలపై ఇచ్చిన స్టేట్‌మెంట్ విషయంలో నాగార్జున, శివాజీపై జరిగిన వాగ్వాదాన్ని గుర్తుచేసుకున్నాడు శివాజీ. నాగార్జున వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని మరోసారి గుర్తుచేసుకున్నాడు. ‘‘ఆయనపై గౌరవం నా గుండెల్లో ఉండిపోయింది. నా క్యారెక్టర్ పోతున్నప్పుడు భగవంతుడు ఉన్నా తలదించుకొని ప్రశ్నిస్తాను. బయటికి వచ్చిన తర్వాత నన్ను విలన్ చేయడానికి ప్రయత్నించారని నాకు అర్థమయ్యింది. కొంతమందిని హీరో చేయడానికి ప్రయత్నించారు. ఎందుకలా అని నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. నేను ప్రశ్నించింది బిగ్ బాస్‌ను. నేను బ్రతికి ఉన్నంతవరకు బాబుగారిని ప్రశ్నించే ధైర్యం నేను చేయను. నాకు అక్కడ కనిపించింది బాబుగారు కాదు.. బిగ్ బాస్ కనిపించాడు. ఎవరైనా వేరేవాళ్లను హింసిస్తున్నప్పుడు మాటలు మారొచ్చేమో, కానీ కంటెంట్ ఇలాగే ఉంటుంది దానినే నేను ఎక్స్‌ప్రెస్ చేశాను. ఈ విషయంపై ఎవరి దగ్గర క్లారిటీ తీసుకోవాలో వారి దగ్గరే తీసుకుంటాను’’ అని శివాజీ క్లారిటీ ఇచ్చాడు. సినిమాల్లో మళ్లీ రీఎంట్రీ ఇవ్వడానికి సిద్దంగా ఉన్నానని ఫైనల్‌గా స్టేట్‌మెంట్ ఇచ్చాడు.
Also Read: జగన్ ప్రభుత్వం మాట తప్పింది - జానీ మాస్టర్ వ్యాఖ్యలు