అన్వేషించండి

‘స్కంద’ ఫస్ట్ సింగిల్ రిలీజ్, అనసూయ ‘వుల్ఫ్’ టీజర్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.

‘స్కంద’ ఫస్ట్ సింగిల్ సాంగ్ - డ్యాన్స్‌తో అదరగొట్టిన రామ్, శ్రీలీల!
టాలీవుడ్ లో రాబోతున్న మాస్ యాక్షన్ సినిమాల్లో బోయపాటి శ్రీను, హీరో రామ్ కాంబోలో వస్తున్న ‘స్కంద’ మూవీ ఒకటి. ఈ మూవీలో టాలీవుడ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత రామ్ కు సరైన హిట్ పడలేదు. మధ్యలో ‘వారియర్’ అంటూ వచ్చినా అది అంతగా ఆకట్టుకోలేదు. ఇప్పుడు ‘స్కంద’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు రామ్. ఇప్పుడు ఈ మూవీ నుంచి మరో లేటెస్ట్ అప్డేట్ వచ్చేసింది. మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘నీ చుట్టూ చుట్టూ’ అని సాగే ఈ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన రామ్, శ్రీలీల అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

‘భోళా శంకర్’ మూవీకి సెన్సార్ పూర్తి - ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా చిరు మూవీ!
యంగ్ హీరోల తాకిడికి సీనియర్ హీరోలు తట్టుకోలేరు అనేది ఒకప్పటి మాట. కానీ ఇప్పుడు సీనియర్ హీరోలు సైతం.. యంగ్ హీరోలకు పోటీ ఇచ్చే పాత్రలు చేస్తూ.. తమ ఏజ్‌కు సూట్ అయ్యే కథలను ఎంచుకుంటున్నారు. అంతే కాకుండా ఇప్పటికీ కొందరు సీనియర్ హీరోలు విభిన్న కథలను ఎంచుకుంటూ తాము ఎప్పుడూ బెస్ట్ అని నిరూపించుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఇప్పటికీ తన సక్సెస్ ట్రాక్‌ను కొనసాగిస్తూ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తున్నారు. సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన తర్వాత చిరుకు కమర్షియల్ ఎంటర్‌టైనర్స్ బాగా కలిసొచ్చాయి. అందుకే తనకు సక్సెస్‌ను తెచ్చిపెట్టిన కమర్షియల్ ఎంటర్‌టైనర్ల వైపు తన అడుగులు పడుతున్నాయి. అందులో భాగంగానే తన తరువాతి చిత్రం ‘భోళా శంకర్’ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు చిరు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

ప్ర‌భుదేవా, అనసూయల 'వూల్ఫ్' టీజర్ రిలీజ్: ఆకలితో ఉన్న తోడేలు వేట ప్రారంభం!
ఇండియన్ మైఖేల్ జాక్సన్ గా పేరు తెచ్చుకున్న డ్యాన్స్ మాస్టర్ ప్రభుదేవా.. హీరోగానూ సక్సెస్ అయ్యారు. ఈ క్రమంలో 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' సినిమాతో మెగా ఫోన్ పట్టుకొని, డైరెక్టర్ గానూ సత్తా చాటారు. ఇలా మల్టీ టాలెంటెడ్ అనిపించుకున్న ఆయన, ప్రస్తుతం డైరెక్ష‌న్‌ - కొరియోగ్ర‌ఫీ కంటే నటనకే ప్రాధాన్యత ఇస్తున్నారు. రిజల్ట్ తో సంబంధం లేకుండా వ‌రుస‌గా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు లేటెస్టుగా 'వూల్ఫ్' (Wolf) అనే పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేసారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

‘రూల్స్ రంజన్’ నుండి ఫ్రెండ్‌షిప్ డేకు స్పెషల్ అప్డేట్
ఒకప్పుడు బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి హీరో అవ్వాలంటే చాలా కష్టం అని అంటుండేవారు. అది పూర్తిగా నిజం కాదు అని ప్రూవ్ చేసినవారు కూడా ఉన్నారు. కానీ రోజులు మారిపోయాయి. సినిమాలో కంటెంట్ ఉంటే చాలు.. హీరో ఎవరు, దర్శకుడికి ఉన్న అనుభవం ఎంత అని ప్రేక్షకులు పట్టించుకోవడం మానేశారు. అందుకే చిన్న బడ్జెట్ చిత్రాలు, డెబ్యూ డైరెక్టర్స్ తెరకెక్కించిన సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్ అవుతున్నాయి. అంతే కాకుండా విభిన్న కథలను ఎంచుకుంటూ ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చిన హీరోలు కూడా చాలామందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు కొందరు. అందులో కిరణ్ అబ్బవరం ఒకరు. తాజాగా కిరణ్ అబ్బవరం అప్‌కమింగ్ మూవీ ‘రూల్స్ రంజన్’ నుంచి ఫ్రెండ్‌షిప్ డే స్పెషల్ సాంగ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

రీ రిలీజ్‌కు సిద్ధమవుతున్న క్లాసిక్ లవ్ స్టోరీ ‘7జీ బృందావన్ కాలనీ’ - ఎప్పుడంటే?
ఒకప్పుడు మనకు నచ్చిన ఫేవరెట్ సినిమాలను మళ్లీ మళ్లీ చూడాలంటే టీవీలో వచ్చేవరకు ఎదురుచూడాల్సి ఉండేది. కానీ ఓటీటీ వచ్చిన తర్వాత పరిస్థితులు చాలా మారిపోయాయి. కొత్త సినిమాలు సైతం మన ఇంట్లోకే వచ్చేస్తున్నాయి. అలాగే పాత సినిమాలను, మనకు నచ్చిన సినిమాలను కూడా మళ్లీ మళ్లీ చూసే అవకాశం వచ్చింది. కానీ ఎంతైనా ఒకప్పుడు చూసిన పాత సినిమాలను ఇప్పుడు థియేటర్లలో ఈలలు, గోలలు మధ్య చూస్తే ఆ కిక్కే వేరు. అందుకే టాలీవుడ్‌లో రీ రిలీజ్ ట్రెండ్ సాగుతోంది. ఇప్పటికే స్టార్ హీరోలకు సంబంధించిన ఎన్నో సినిమాలు రి రిలీజ్ అయ్యి ఫ్యాన్స్‌ను ఖుషీ చేశాయి. ఇప్పుడు ఒక క్లాసిక్ లవ్ స్టోరీ కూడా రీ రిలీజ్‌కు సిద్ధమవుతుందని టాక్ బయటికొచ్చింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: సంక్రాంతి సంబరాల్లో సీఎం చంద్రబాబు ఫ్యామిలీ - గ్రామ దేవతకు ప్రత్యేక పూజలు
సంక్రాంతి సంబరాల్లో సీఎం చంద్రబాబు ఫ్యామిలీ - గ్రామ దేవతకు ప్రత్యేక పూజలు
Turmeric Board: నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు - వర్చువల్‌గా ప్రారంభించిన కేంద్ర మంత్రి గోయల్, నెరవేరిన ఏళ్ల కల
నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు - వర్చువల్‌గా ప్రారంభించిన కేంద్ర మంత్రి గోయల్, నెరవేరిన ఏళ్ల కల
Sankranthiki Vasthunam Review - 'సంక్రాంతికి వస్తున్నాం' రివ్యూ: కామెడీ ఒక్కటేనా - కథతోనూ వెంకీ, అనిల్ రావిపూడి మేజిక్ చేశారా?
'సంక్రాంతికి వస్తున్నాం' రివ్యూ: కామెడీ ఒక్కటేనా - కథతోనూ వెంకీ, అనిల్ రావిపూడి మేజిక్ చేశారా?
Padi Kaushik Reddy: హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి ఊరట - బెయిల్ మంజూరు చేసిన న్యాయమూర్తి
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి ఊరట - బెయిల్ మంజూరు చేసిన న్యాయమూర్తి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Maha Kumbh Mela 2025 Day 1 Highlights | ప్రయాగలో కళ్లు చెదిరిపోయే విజువల్స్ | ABP DesamMahakumbh 2025 | 144ఏళ్లకు ఓసారి వచ్చే ముహూర్తంలో మహాకుంభమేళా | ABP DesamDanthapuri Fort | బుద్ధుడి దంతం దొరికిన ప్రాంతం..అశోకుడు నడయాడిన ప్రదేశం | ABP DesamNara Devansh Sack Run | నారావారిపల్లెలో గోనెసంచి పరుగుపందెంలో దేవాన్ష్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: సంక్రాంతి సంబరాల్లో సీఎం చంద్రబాబు ఫ్యామిలీ - గ్రామ దేవతకు ప్రత్యేక పూజలు
సంక్రాంతి సంబరాల్లో సీఎం చంద్రబాబు ఫ్యామిలీ - గ్రామ దేవతకు ప్రత్యేక పూజలు
Turmeric Board: నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు - వర్చువల్‌గా ప్రారంభించిన కేంద్ర మంత్రి గోయల్, నెరవేరిన ఏళ్ల కల
నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు - వర్చువల్‌గా ప్రారంభించిన కేంద్ర మంత్రి గోయల్, నెరవేరిన ఏళ్ల కల
Sankranthiki Vasthunam Review - 'సంక్రాంతికి వస్తున్నాం' రివ్యూ: కామెడీ ఒక్కటేనా - కథతోనూ వెంకీ, అనిల్ రావిపూడి మేజిక్ చేశారా?
'సంక్రాంతికి వస్తున్నాం' రివ్యూ: కామెడీ ఒక్కటేనా - కథతోనూ వెంకీ, అనిల్ రావిపూడి మేజిక్ చేశారా?
Padi Kaushik Reddy: హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి ఊరట - బెయిల్ మంజూరు చేసిన న్యాయమూర్తి
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి ఊరట - బెయిల్ మంజూరు చేసిన న్యాయమూర్తి
Viral Note: 'నగలు డబ్బు తీసుకెళ్తున్నాం, మా ఇంటికి రాకండి' - సంక్రాంతికి ఊరెళ్తూ ఇంటి డోర్‌పై యజమాని నోట్ వైరల్
'నగలు డబ్బు తీసుకెళ్తున్నాం, మా ఇంటికి రాకండి' - సంక్రాంతికి ఊరెళ్తూ ఇంటి డోర్‌పై యజమాని నోట్ వైరల్
Pigs Fighting: సంక్రాంతి వేళ పందుల పందేలు స్పెషల్ - రూ.కోట్లలో బెట్టింగులు, ఎక్కడో తెలుసా?
సంక్రాంతి వేళ పందుల పందేలు స్పెషల్ - రూ.కోట్లలో బెట్టింగులు, ఎక్కడో తెలుసా?
Sabarimala Makara Jyothi 2025: శబరిమల మకరజ్యోతి కనిపించే ప్రదేశం ఇదే .. ఆ జ్యోతి నిజమా కాదా .. దాని వెనుకున్న సైన్స్ గురించి తెలుసా!
శబరిమల మకరజ్యోతి కనిపించే ప్రదేశం ఇదే .. ఆ జ్యోతి నిజమా కాదా .. దాని వెనుకున్న సైన్స్ గురించి తెలుసా!
Nag Mark-2: భారత అమ్ముల పొదిలోకి మరో అస్త్రం - నాగ్‌మార్క్‌-2 క్షిపణి ప్రయోగం విజయవంతం
భారత అమ్ముల పొదిలోకి మరో అస్త్రం - నాగ్‌మార్క్‌-2 క్షిపణి ప్రయోగం విజయవంతం
Embed widget