అన్వేషించండి

Bholaa Shankar: ‘భోళా శంకర్’ మూవీకి సెన్సార్ పూర్తి - ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా చిరు మూవీ!

ఇటీవల ‘భోళా శంకర్’ ట్రైలర్‌ను విడుదల చేసింది మూవీ టీమ్. ట్రైలర్‌లో ఎప్పటిలాగానే మెగాస్టార్ కామెడీ టైమింగ్ అందరినీ ఆకట్టుకుంది.

యంగ్ హీరోల తాకిడికి సీనియర్ హీరోలు తట్టుకోలేరు అనేది ఒకప్పటి మాట. కానీ ఇప్పుడు సీనియర్ హీరోలు సైతం.. యంగ్ హీరోలకు పోటీ ఇచ్చే పాత్రలు చేస్తూ.. తమ ఏజ్‌కు సూట్ అయ్యే కథలను ఎంచుకుంటున్నారు. అంతే కాకుండా ఇప్పటికీ కొందరు సీనియర్ హీరోలు విభిన్న కథలను ఎంచుకుంటూ తాము ఎప్పుడూ బెస్ట్ అని నిరూపించుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఇప్పటికీ తన సక్సెస్ ట్రాక్‌ను కొనసాగిస్తూ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తున్నారు. సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన తర్వాత చిరుకు కమర్షియల్ ఎంటర్‌టైనర్స్ బాగా కలిసొచ్చాయి. అందుకే తనకు సక్సెస్‌ను తెచ్చిపెట్టిన కమర్షియల్ ఎంటర్‌టైనర్ల వైపు తన అడుగులు పడుతున్నాయి. అందులో భాగంగానే తన తరువాతి చిత్రం ‘భోళా శంకర్’ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు చిరు.

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘భోళా శంకర్’.. ఆగస్ట్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చిరుకు జోడీగా తమన్నా నటించింది. అంతే కాకుండా ఇందులో చిరంజీవికి చెల్లెలిగా కీర్తి సురేశ్ కనిపించనుంది. వీరితో పాటు సుశాంత్ లాంటి యంగ్ నటుడు కూడా ‘భోళా శంకర్’ క్యాస్టింగ్‌లో భాగమయ్యాడు. రఘుబాబు, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి, సురేఖా వాణి, శ్రీముఖి కూడా ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో మూవీ టీమ్ ప్రమోషన్ కార్యక్రమాలను షురూ చేసింది. ఇటీవల ‘భోళా శంకర్’ ట్రైలర్‌ను కూడా విడుదల చేసింది. ట్రైలర్‌లో ఎప్పటిలాగానే మెగాస్టార్ కామెడీ టైమింగ్ అందరినీ ఆకట్టుకుంది. ఇక యాక్షన్ సీన్స్, అందులో బీజీఎమ్ కూడా ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉన్నాయని ఫ్యాన్స్ అప్పుడే ఈ సినిమాపై భారీ అంచనాలను పెట్టేసుకున్నారు.

U/A ఖరారు

‘భోళా శంకర్’ నుంచి వచ్చిన తాజా అప్డేట్ ప్రకారం ఈ సినిమా సెన్సార్ ప్రక్రియను పూర్తి చేసుకుంది. సీబీఎఫ్‌సీ బోర్డ్ ‘భోళా శంకర్’కు U/A సర్టిఫికేట్‌ను అందజేసింది. చిరు సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన తర్వాత అన్ని చిత్రాలకు యూ/ఏ సర్టిఫికేటే అందింది. ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీలతో చిరంజీవి అందరివాడు అనిపించుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి చివరిగా ‘వాల్తేరు వీరయ్య’లో నటించారు. ఆ మూవీ కూడా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో సూపర్‌హిట్‌ను అందుకుంది. ఇప్పుడు‘భోళా శంకర్’ కూడా అలాగే అవుతుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.

‘వేదాళం’ రీమేక్‌గా

మెగాస్టార్ తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన తర్వాత ఎక్కువగా రీమేక్స్ వైపే మొగ్గుచూపుతున్నారు. ‘భోళా శంకర్’ను కూడా తమిళ చిత్రం ‘వేదాళం’కు రీమేక్‌గా తెరకెక్కించారు. తమిళ స్టార్ అజిత్ ఈ సినిమాలో లీడ్ రోల్‌లో నటించారు. చెల్లెలి సెంటిమెంట్, కమర్షియల్ ఎలిమెంట్స్ కలగలిపిన సినిమానే ‘వేదాళం’. అందుకే ఈ మూవీ కథ మెగాస్టార్‌కు బాగా నచ్చి రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ బాధ్యతను సీనియర్ దర్శకుడు మెహర్ రమేశ్ చేతిలో పెట్టాడు. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్.. ‘భోళా శంకర్’ను నిర్మించారు. రామబ్రహ్మం సుంకర.. ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. మహతి స్వర సాగర్‌కు తొలిసారిగా మెగాస్టార్ చిరంజీవిలాంటి స్టార్ హీరో సినిమాకు సంగీతం అందించే అవకాశం దక్కింది.

Also Read: ఆ శ్యాంబాబు.. రాంబాబు కాదు, ఆ పాత్రకు స్ఫూర్తి వేరుకొరు: సాయి ధరమ్ తేజ్!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vishnu Priya : నా ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్నారు - యూట్యూబర్‌పై విష్ణుప్రియ కంప్లైంట్
నా ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్నారు - యూట్యూబర్‌పై విష్ణుప్రియ కంప్లైంట్
Drishyam 3 Collection Day 2: 'దృశ్యం 3' కలెక్షన్స్ తగ్గాయ్... మోహన్ లాల్ మూవీకి రెండు రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?
'దృశ్యం 3' కలెక్షన్స్ తగ్గాయ్... మోహన్ లాల్ మూవీకి రెండు రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Kara OTT : ధనుష్ కర ఓటీటీ రిలీజ్ డేట్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ధనుష్ కర ఓటీటీ రిలీజ్ డేట్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Aishwarya Rai : కేన్స్ ఫెస్టివల్‌లో ఐశ్వర్యా రాయ్ - ట్రెండీ లుక్... డ్రెస్ స్పెషాలిటీస్ ఏంటో తెలుసా!
కేన్స్ ఫెస్టివల్‌లో ఐశ్వర్యా రాయ్ - ట్రెండీ లుక్... డ్రెస్ స్పెషాలిటీస్ ఏంటో తెలుసా!

వీడియోలు

CSK vs GT IPL 2026 Highlights | గుజరాత్ చేతిలో చెన్నై ఘోర పరాజయం
Ruturaj Comments on Dhoni Retirement | ధోని రిటైర్మెంట్‌పై రుతురాజ్ కామెంట్స్
Ram Charan at Uppal Stadium IPL 2026 | ఐపీఎల్ మ్యాచ్‌లో పెద్ది టీమ్ ప్రమోషన్స్
Hardik Pandya Match Fee Fined IPL 2026 | గ్రౌండ్ లో సహనం కోల్పోయిన హార్దిక్ పాండ్యా
Sai Sudharsan Creates History in IPL 2026 | సాయి సుదర్శన్ హిస్టారికల్ రికార్డ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bandi Bageerath POCSO case: బండి భగీరథ్‌ పోక్సో కేసులో పోలీస్ కస్టడీపై సస్పెన్స్‌! మే 26న కోర్టు తుది నిర్ణయం!
బండి భగీరథ్‌ పోక్సో కేసులో పోలీస్ కస్టడీపై సస్పెన్స్‌! మే 26న కోర్టు తుది నిర్ణయం!
Petrol Price Hike May 2026: పది రోజుల్లో మూడోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! మీ ప్రాంతంలో రేట్లు ఎంత?
పది రోజుల్లో మూడోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! మీ ప్రాంతంలో రేట్లు ఎంత?
Tesla Hyderabad Showroom: గ్లోబల్ సిటీలో గ్లోబల్ కార్: హైదరాబాద్‌కు టెస్లా రాక ఖరారు!
గ్లోబల్ సిటీలో గ్లోబల్ కార్: హైదరాబాద్‌కు టెస్లా రాక ఖరారు!
Aishwarya Rai : కేన్స్‌లో క్వీన్ ఐశ్వర్య - రెడ్ కార్పెట్‌పై దేవకన్యలా విశ్వ సుందరి
కేన్స్‌లో క్వీన్ ఐశ్వర్య - రెడ్ కార్పెట్‌పై దేవకన్యలా విశ్వ సుందరి
Prime Minister Narendra Modi warns Union Ministers బొద్దింక ఎఫెక్ట్‌! మంత్రులకు ప్రధానమంత్రి క్లాస్! రాబోయేది జెన్‌ జీ మంత్రివర్గమే! 
బొద్దింక ఎఫెక్ట్‌! మంత్రులకు ప్రధానమంత్రి క్లాస్! రాబోయేది జెన్‌ జీ మంత్రివర్గమే! 
Kara OTT : ధనుష్ కర ఓటీటీ రిలీజ్ డేట్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ధనుష్ కర ఓటీటీ రిలీజ్ డేట్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
USA Iran Peace Agreement:అమెరికా-ఇరాన్ మధ్య ముగిసిన పోరు! ప్రపంచానికి ఊరటనిచ్చిన శాంతి ఒప్పందం!
అమెరికా-ఇరాన్ మధ్య ముగిసిన పోరు! ప్రపంచానికి ఊరటనిచ్చిన శాంతి ఒప్పందం!
Aishwarya Rai : కేన్స్ ఫెస్టివల్‌లో ఐశ్వర్యా రాయ్ - ట్రెండీ లుక్... డ్రెస్ స్పెషాలిటీస్ ఏంటో తెలుసా!
కేన్స్ ఫెస్టివల్‌లో ఐశ్వర్యా రాయ్ - ట్రెండీ లుక్... డ్రెస్ స్పెషాలిటీస్ ఏంటో తెలుసా!
Embed widget