‘భోళా శంకర్’ రివ్యూ, ‘చంద్రముఖి 2’ ఫస్ట్ సింగిల్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.
'భోళా శంకర్' రివ్యూ : మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి నటించిన సినిమా - ఎలా ఉందంటే?
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన 'భోళా శంకర్' సినిమా నేడు థియేటర్లలో విడుదలైంది. తమిళ హిట్, అజిత్ 'వేదాళం' స్ఫూర్తితో తీసిన చిత్రమిది. మెహర్ రమేష్ దర్శకత్వం వహించారు. అన్నా చెల్లెళ్ళ అనుబంధం, భావోద్వేగాల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో చిరు చెల్లెలుగా కీర్తీ సురేష్ నటించారు. తమన్నా కథానాయికగా కనిపించారు. సుశాంత్ కీలక పాత్ర చేశారు. ఈ సినిమా ఎలా ఉందంటే? (పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
‘చంద్రముఖి 2’ మొదటి పాట వచ్చేసింది - ‘స్వాగతాంజలి’తో సంగీత ప్రయాణం ప్రారంభం!
‘ముని/కాంచన’ సిరీస్‌తో హర్రర్ సినిమాల్లో తనదంటూ ఒక ముద్ర వేసిన నటుడు రాఘవ లారెన్స్. ఆయన నటిస్తున్న తాజా హర్రర్ సినిమా ‘చంద్రముఖి 2’. 2005లో విడుదలై ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన ‘చంద్రముఖి’కి ఈ సినిమా సీక్వెల్. మొదటి భాగంలో రజనీ హీరోగా నటించారు. రెండో భాగంలో రాఘవ లారెన్స్ కథానాయకుడిగా కనిపించనున్నారు. ఈ సినిమాపై అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇఫ్పుడు ఫస్ట్ సింగిల్ ‘స్వాగతాంజలి’ ద్వారా ప్రమోషన్లకు శ్రీకారం చుట్టారు. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
హైదరాబాద్‌లో ల్యాండిస్తానంటే నవ్వా - మాఫియా వల్లే అక్కడికి వెళ్లలేదు: ఏఆర్ రెహమాన్ కామెంట్స్
మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. భారతీయ సంగీతాన్ని ప్రపంచవ్యాప్తం చేసిన సంగీత దర్శకుడాయన. తన ప్రతిభతో ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డును అందుకొని మన దేశానికే గర్వకారణంగా నిలిచారు. అంతటి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న రెహ్మాన్.. బాలీవుడ్‌లో చాలా తక్కువ సినిమాలకు సంగీతం సమకూరుస్తున్నారు. ఏ ఇండస్త్రీలోనైనా ఫేమ్ వచ్చిన తర్వాత బాంబే వెళ్లి సెటిల్ అవ్వాలని అనుకుంటారు. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు రెహమాన్ కు కూడా అలాంటి అవకాశమే వచ్చిందట. కానీ ముంబైలో స్థిరపడటానికి సంకోచించారట. దీనికి గల కారణాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
‘ఇండియా డే’ పరేడ్‌కు రండి! అందాల తార సమంతకు అరుదైన గౌరవం
కొంత కాలం పాటు సినిమాలకు విరామం ప్రకటించిన అందాల తార సమంత, ప్రస్తుతం వెకేషన్ లో సరదాగా గడుపుతోంది. తన ఫ్రెండ్ తో కలిసి హ్యాపీగా, జాలీగా ఎంజాయ్ చేస్తోంది. కొద్ది రోజుల క్రితం ఇండోనేషియాకు వెళ్లిన సమంత, ప్రస్తుతం బాలిలో ప్రకృతి అందాలను తిలకిస్తోంది. అక్కడి అద్భుత దృశ్యాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటోంది. తాజాగా సమంతకు ఓ అరుదైన గౌరవం దక్కింది. భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతి ఏటా న్యూయార్క్ లో నిర్వహించే వేడుకల్లో పాల్గొనే అవకాశం లభించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఇండియా డే పరేడ్ లో పాల్గొనాల్సిందిగా నిర్వాహకులుగా ఆమెకు ఆహ్వానం పంపించారు. సమంతతో పాటు మరికొంత మంది నటీనటులకు ఇన్వెటేషన్ లభించింది. వీరిలో నటుడు రవికిషన్, నటి జాక్వైలిన్ ఫెర్నాండేజ్ ఉన్నారు. ఇప్పటికే ఈ వేడుకలో పలువురు భారతీయ నటీనటులు పాల్గొన్నారు. అభిషేక్ బచ్చన్, రానా, అల్లు అర్జున్, అర్జున్ రాంపాల్, సన్నీ డియోల్, రవీనా టాండన్, తమన్నా హాజరయ్యారు. ప్రవాస భారతీయులతో కలిసి ఇండిపెండెన్స్ డే జరుపుకున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన 'ఆదిపురుష్' - ఈ సినిమా చూడాలంటే ఆ కండీషన్ తప్పనిసరి?
పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన రీసెంట్ మూవీ 'ఆదిపురుష్' ఎటువంటి గుట్టు చప్పుడు కాకుండా ఓటిటిలోకి వచ్చేసింది. మేకర్స్ దీనిపై ఎటువంటి ముందస్తు సమాచారం గానీ, ప్రమోషన్స్ కానీ చేయకుండా అర్ధరాత్రి నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ లో 'ఆదిపురుష్' సినిమాని రిలీజ్ చేశారు. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో 'ఆదిపురుష్' తెలుగుతోపాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే హిందీ భాషలో స్ట్రీమింగ్ పై ఇంకా ఎటువంటి అప్డేట్ లేదు. హిందీ తప్ప మిగతా అన్ని భాషల్లో ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి తీసుకొచ్చింది. మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే, సినిమా ఫ్రీగా కాకుండా రెంటల్ విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)