అన్వేషించండి
Advertisement
Tollywood : ''హీరోల కోసం వెయిట్ చేసే రోజులు పోయాయ్''
టాలీవుడ్ లో చాలా సినిమాలు ఒకరి కోసం అనుకొని మరొకరి దగ్గరకు వెళ్తున్నాయి.
సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ శాతం మంది యంగ్ హీరోలే ఉన్నారు. ఒక హీరోని దృష్టిలో పెట్టుకొని కథ రాసుకున్నా.. అది అందరికీ సూటైపోతుంది. కొన్ని మార్పులు చేసుకుంటే సరిపోతుంది. అందుకే ఇప్పుడు టాలీవుడ్ లో ఏ కథలు కూడా ఎవరి కోసం ఎదురుచూడడం లేదు. ఒక హీరో డేట్లు దొరకకపోతే మరో హీరో దగ్గరకు వెళ్లిపోతున్నారు. చాలా కాలంగా ఈ పద్ధతి టాలీవుడ్ లో ఉంది. కానీ ఈ మధ్యకాలంలో మెజారిటీ సినిమాల విషయంలో ఇదే జరుగుతోంది.
డేట్స్ అడ్జస్ట్ చేయలేకనో.. స్క్రిప్ట్ నచ్చకనో కారణం ఏదైనా కొందరు హీరోలు ప్రాజెక్ట్ లు వదులుకుంటున్నారు. అలా చేజార్చుకున్న సినిమాలు సూపర్ హిట్ అయిన సందర్భాలు ఉన్నాయి.. డిజాస్టర్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఈ మధ్యకాలంలో అలా తారుమారైన కథలు ఏమున్నాయో ఇప్పుడు చూద్దాం!
దర్శకుడు మారుతి 'ప్రతిరోజూ పండగే' సినిమా తరువాత రవితేజతో ఓ సినిమా చేయాలనుకున్నారు. రవితేజ కూడా సుముఖంగానే ఉండేవారు. కానీ ఆయన వేరే ప్రాజెక్ట్ లను ఒప్పుకోవడంతో మారుతికి కాల్షీట్స్ అడ్జస్ట్ చేయలేకపోయారు. దీంతో ఆయన గోపీచంద్ కు కథ చెప్పి ఓకే చేయించుకున్నారు. లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ త్వరలోనే పునః ప్రారంభం కానుంది.
'తొలిప్రేమ' సినిమాతో సక్సెస్ అందుకున్న వెంకీ అట్లూరి రీసెంట్ గా 'రంగ్ దే' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే చాలా కాలంగా నాగచైతన్యతో సినిమా చేయాలనుకుంటున్నారు వెంకీ అట్లూరి. కానీ ధనుష్ 'లవ్ స్టోరీ', 'థాంక్యూ' లాంటి సినిమాలతో బిజీగా ఉన్నారు. 'బంగార్రాజు' ప్రాజెక్ట్ కూడా ఉంది. దీంతో వెంకీ ప్రాజెక్ట్ ఒప్పుకోలేకపోయారు. దీంతో అతడు కోలీవుడ్ హీరో ధనుష్ దగ్గరకు వెళ్లిపోయాడు.
ఒక కొత్త దర్శకుడు నాని డేట్స్ కోసం ప్రయత్నించారు. కానీ ప్రస్తుతం హీరోగా, నిర్మాతగా బిజీగా ఉండడంతో అల్లరి నరేష్ దగ్గర సెటిల్ అయిపోయారు ఈ కొత్త డైరెక్టర్.
'ఆర్ఎక్స్ 100' లాంటి సెన్సేషనల్ సినిమా తీసిన అజయ్ భూపతి తన తదుపరి సినిమా రవితేజతో అనుకున్నారు. మొదట్లో ఆయన కూడా ఒప్పుకున్నారు. తరువాత ఏమైందో కానీ ఇద్దరికీ సెట్ కాలేదు. దీంతో శర్వానంద్ హీరోగా'మహాసముద్రం' ప్రాజెక్ట్ మొదలుపెట్టారు. ఈ కథ రవితేజ కోసం రాసుకున్నదే అట.
దర్శకుడు కిషోర్ తిరుమల.. వెంకీ హీరోగా 'ఆడాళ్లూ మీకు జోహార్లు' సినిమా అనౌన్స్ చేశారు. కానీ ఈ సినిమా ఆగిపోయింది. దీంతో అదే కథతో శర్వానంద్ హీరోగా సినిమా మొదలుపెట్టారు కిషోర్ తిరుమల.
ఇవి మాత్రమే కాదు.. టాలీవుడ్ లో చాలా సినిమాలు ఒకరి కోసం అనుకొని మరొకరి దగ్గరకు వెళ్తున్నాయి. మరి ఈ సినిమాకు ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి!
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఇండియా
ప్రపంచం
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion