అన్వేషించండి

Ravi Teja: 'రైడ్' రీమేక్ ఆఫర్‌కు 'నో' చెప్పిన రవితేజ - హరీష్ శంకర్‌ ఎంట్రీతో మారిన సీన్, కారణం ఏంటో తెలుసా?

Mr Bachchan Movie | హరీష్ శంకర్, రవితేజ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం ‘మిస్టర్ బచ్చన్‘. త్వరలో ఈ సినిమా విడుదలకానున్న నేపథ్యంలో అసలు ఈ మూవీని ఎందుకు ఒప్పుకోవాల్సి వచ్చిందో చెప్పారు మాస్ మహారాజా..

Ravi Teja About 'Ride' Remake: మాస్ మహారాజా రవితేజ హీరోగా, దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ‘మిస్టర్ బచ్చన్‘. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమా ఆగష్టు 15న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా హిందీ మూవీ ‘రైడ్‘కు రీమేక్ గా తెరకెక్కింది. త్వరలో ఈ మూవీ విడుదలకానున్న సందర్భంగా చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు, పాటలు, ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. తాజాగా యాంకర్ సుమకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరో, హీరోయిన్లు రవితేజ, భాగ్యశ్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘మిస్టర్ బచ్చన్‘ సినిమా అసలు ఎందుకు ఒప్పుకోవాల్సి వచ్చిందో రవితేజ వెల్లడించారు.

హరీష్ శంకర్ ఎంటర్ కాగానే ఓకే చెప్పాను- రవితేజ

గతంలో ‘రైడ్’ సినిమా రీమేక్ కు సంబంధించిన ఆఫర్ వచ్చినా చేయలేదని చెప్పారు రవితేజ. హరీష్ శంకర్ ఎంటర్ కావడంతో ఓకే చెప్పానన్నారు. “’మిస్టర్ బచ్చన్’ సినిమాను ఒప్పుకోవడానికి కారణం ఉంది. హరీష్ శంకర్ డైరెక్టర్ అని, స్టోరీ నచ్చి అని కాదు,  ‘రైడ్‘ అనే రీమేక్ ఫిల్మ్ చేయాలని గతంలోనే ఒక ఆఫర్ వచ్చింది. అప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదు. నచ్చింది కానీ, చేయాలి అనిపించలేదు. ఎప్పుడైతే హరీష్ శంకర్ ఎంటర్ అయ్యాడో అప్పుడు చేయాలి అనిపించింది. ఎందుకంటే తను అసలు కథను పూర్తిగా మార్చేయగలడు. ఆ విషయాన్ని తను ఫ్రూవ్ చేసుకున్నాడు. సినిమా విడుదలయ్యాక చూస్తే, అసలు ‘రైడ్‘కు దీనికి సంబంధమే ఉండదు. ఈ సినిమాను మళ్లీ రీమేక్ చేస్తారు” అని చెప్పుకొచ్చారు.

ఓ రేంజిలో ఆకట్టుకోనున్న రవితేజ, జగపతి బాబు మధ్య సీన్లు

ఇక ‘మిస్టర్ బచ్చన్’ సినిమాలో సీనియర్ నటుడు జగపతి బాబు నెగెటివ్ రోల్ పోషిస్తున్నారు. రవితేజ, జగపతి బాబు మధ్య సీన్లు ప్రేక్షకులను ఓ రేంజిలో ఆకట్టుకోనున్నట్లు తెలుస్తోంది. పవర్ ఫుల్ ఇన్ కమ్ టాక్స్ ఆఫీసర్ గా రవితేజ దుమ్మురేపనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇద్దరి మధ్య సన్నివేశాలు ప్రేక్షకులలో గూస్ బంప్స్ తెప్పించనున్నాయట. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి సెన్సార్ పనులు పూర్తి అయ్యాయి. యు/ఎ సర్టిఫికేట్ ను జారీ చేశారు.  సినిమా డ్యురేషన్ 2.38 నిమిషాలుగా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. కామెడీ, రొమాన్స్, యాక్షన్ తో రవితేజ ఆకట్టుకోబోతున్నారట.  

అటు ‘మిస్టర్ బచ్చన్’ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. అయనంకా బోస్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజకు జోడీగా భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది. 

Read Also: ‘డబుల్ ఇస్మార్ట్’ కోసం ఆ మూవీని వదులుకున్న సంజయ్ దత్, అసలు విషయం చెప్పిన రామ్ పోతినేని

Read Also: హీరోగా మారబోతున్న సూపర్ హిట్ సినిమాల డైరెక్టర్ - లుక్ మార్చడం వెనుక కారణం అదేనా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
KCR News: ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
Game Changer Teaser: ‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
AP Cabinet: ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నడి సంద్రంలో ఇద్దరే మహిళలు, భూగోళాన్ని చుట్టే్సే అద్భుత యాత్రట్రంప్ ఎన్నికతో మస్క్ ఫుల్ హ్యాపీ! మరి కూతురికి భయమెందుకు?ఉడ్‌బీ సీఎం అని  లోకేశ్ ప్రచారం - అంబటి రాంబాబుఅధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
KCR News: ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
Game Changer Teaser: ‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
AP Cabinet: ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
Hyderabad News: భాగ్యనగర వాసులకు అలర్ట్ - ఈ నెల 11న ఈ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా బంద్
భాగ్యనగర వాసులకు అలర్ట్ - ఈ నెల 11న ఈ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా బంద్
Royal Enfield Flying Flea C6: మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను పరిచయం చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ - లాంచ్ ఎప్పుడంటే?
మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను పరిచయం చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ - లాంచ్ ఎప్పుడంటే?
Pawan Kalyan: ఆ కుటుంబాలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ, సొంత ట్రస్ట్ నుంచి రూ. 2 లక్షల సాయం
ఆ కుటుంబాలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ, సొంత ట్రస్ట్ నుంచి రూ. 2 లక్షల సాయం
Lucky Car: 1500 మంది అతిథులు, రూ.4 లక్షల ఖర్చు - అదృష్టం తెచ్చిన కారుకు అంత్యక్రియలు
1500 మంది అతిథులు, రూ.4 లక్షల ఖర్చు - అదృష్టం తెచ్చిన కారుకు అంత్యక్రియలు
Embed widget