అన్వేషించండి

Anil Ravipudi: హీరోగా మారబోతున్న సూపర్ హిట్ సినిమాల డైరెక్టర్ - లుక్ మార్చడం వెనుక కారణం అదేనా?

తెలుగు సినిమా పరిశ్రమలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న అనిల్ రావిపూడి, మరో కొత్త అవతారం ఎత్తబోతున్నారు. త్వరలోనే ఆయన హీరోగా వెండితెరపై అరంగేట్రం చేయబోతున్నట్లు తెలుస్తోంది.

Director Anil Ravipudi: టాలీవుడ్ డైరెక్టర్లలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు అనిల్ రావిపూడి. రచయితగా కెరీర్ ను మొదలు పెట్టిన ఆయన, నెమ్మదిగా దర్శకుడిగా మారారు. తెలుగు సినిమా పరిశ్రమలోని అగ్ర హీరోలతో సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా మారారు. ఇప్పుడు మరో కొత్త అవతారం ఎత్తబోతున్నారు అనిల్ రావిపూడి.

హీరోగా తెరంగేట్రం చేయబోతున్న అనిల్ రావిపూడి!

డైరెక్టర్ గా సక్సెస్ అయిన అనిల్ రావిపూడి హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇందుకోసం తన బాడీని పూర్తిగా మార్చుకుంటున్నారు. ఇప్పటికే బరువు తగ్గి ఫిట్ గా మారారు. తన లుక్ ను కూడా మార్చుకునే పనిలో పడ్డారు అనిల్. ఇప్పటికే తన సినిమాలో నటించాల్సిందిగా ఓ నిర్మాత ఆయనను ఆఫర్ ఇచ్చారట. అంతే కాదు, ఈ మూవీ కోసం రూ. 20 కోట్లు బడ్జెట్ పెట్టేందుకు ఓకే చెప్పారట. ఈ నేపథ్యంలో ఆ చిత్రంలో నటించేందుకు అనిల్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి పూర్తి విషయాలు అధికారికంగా బయటకు వచ్చే అవకాశం ఉంది.  

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Anil Ravipudi (@anilravipudi)

వెంకటేష్ తో సినిమా చేస్తున్న అనిల్ రావిపూడి

అటు అనిల్ రావిపూడి ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ తో కలిసి ఓ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. సుమారు రూ. 50 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తనకు బాగా కలిసి వచ్చే సంక్రాంతికి ఈ మూవీని బరిలోకి దించాలని దిల్ రాజు భావిస్తున్నారు. అందుకే ఈ క్రేజీ ప్రాజెక్టుకు ‘సంక్రాంతికి వొస్తున్నాము’ అనే పేరు పెట్టించారని తెలుస్తోంది.  ఇక ఈ చిత్రంలో ఇద్దరు స్టార్‌ హీరోలు గెస్ట్ రోల్స్ పోషించబోతున్నారట. వారిలో ఒకరు నటసింహం నందమూరి బాలయ్య కాగా, మరొకరు మాస్ మహారాజా రవితేజ. ఇప్పటికే వీరిద్దరిని సినిమాలో నటించేందుకు దర్శకుడు అనిల్ ఒప్పించినట్లు తెలుస్తోంది. 

అనిల్, వెంకీ కాంబోలో వస్తున్న మూడో చిత్రం

అటు వెంకటేష్ తో కలిసి అనిల్ రావిపూడి రెండు సినిమాలు చేశారు. అందులో ఒకటి ‘F2’ కాగా, మరొకటి ‘F3’. ఈ రెండు సినిమాలు కూడా సంక్రాంతి కానుకగానే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వీటిలో ‘F2’ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. వంద కోట్ల క్లబ్ లో చేరింది. ‘F3’ మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. వీరిద్దరి కాంబోలో వస్తున్న మూడో చిత్రంపై ప్రేక్షకలలో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఏమేరకు సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

Read Also: బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతున్న ‘కమిటీ కుర్రోళ్ళు’- రెండు రోజుల్లో ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే?

టాప్ హెడ్ లైన్స్

Agadha Trailer Review : అగధ అంటే ఏంటో తెలుసా? - ట్రైలర్ చూస్తే గూస్ బంప్స్ గ్యారెంటీ
అగధ అంటే ఏంటో తెలుసా? - ట్రైలర్ చూస్తే గూస్ బంప్స్ గ్యారెంటీ
Nindu Manasulu Serial Today August 3rd: నిండు మనసులు: ప్రేరణ, సిద్ధూలకు సాహితి ప్రాక్టీస్ ఇంటర్వ్యూలో ఊహించన ప్రశ్న! ఎమ్మెల్యేని రెచ్చగొట్టేసిన గణ!
నిండు మనసులు: ప్రేరణ, సిద్ధూలకు సాహితి ప్రాక్టీస్ ఇంటర్వ్యూలో ఊహించన ప్రశ్న! ఎమ్మెల్యేని రెచ్చగొట్టేసిన గణ!
Nithiin Nani : హీరో నితిన్... ప్రొడ్యూసర్ నాని - రోహిణి వైఫ్ ఆఫ్ కృష్ణ... వి'చిత్ర' ప్రేమ కథ
హీరో నితిన్... ప్రొడ్యూసర్ నాని - రోహిణి వైఫ్ ఆఫ్ కృష్ణ... వి'చిత్ర' ప్రేమ కథ
This Week OTT Movies : లెనిన్ To క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ - ఈ వారం ఓటీటీ మూవీస్ కంప్లీట్ లిస్ట్
లెనిన్ To క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ - ఈ వారం ఓటీటీ మూవీస్ కంప్లీట్ లిస్ట్

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Brij Bhushan Sharan Singh: రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
AP Voter List Deletions: ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
CWG India Analysis: గ్లాస్గో కామన్వెల్త్ లో తగ్గిన పతకాలు.. అయినా టాప్ 4 స్థానంలో ఇండియా సంచలనం
గ్లాస్గో కామన్వెల్త్ లో తగ్గిన పతకాలు.. అయినా టాప్ 4 స్థానంలో ఇండియా సంచలనం
HYDRA Commissioner Ranganath Removal Order: హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
West Bengal Industrial Revival: పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
Nithiin Nani : హీరో నితిన్... ప్రొడ్యూసర్ నాని - రోహిణి వైఫ్ ఆఫ్ కృష్ణ... వి'చిత్ర' ప్రేమ కథ
హీరో నితిన్... ప్రొడ్యూసర్ నాని - రోహిణి వైఫ్ ఆఫ్ కృష్ణ... వి'చిత్ర' ప్రేమ కథ
Breaking News: కుత్బుల్లాపూర్‌లో భారీ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలు కూల్చివేత!
కుత్బుల్లాపూర్‌లో భారీ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలు కూల్చివేత!
Embed widget