అన్వేషించండి

Committee Kurrollu Collection: బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతున్న ‘కమిటీ కుర్రోళ్ళు’- రెండు రోజుల్లో ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే?

మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాణంలో రూపొందిన యూత్ ఫుల్ మూవీ ‘కమిటీ కుర్రోళ్లు’. ఆగష్టు 9న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతోంది. రెండు రోజుల్లో ఈ సినిమా ఎంత వసూళు చేసిందంటే..

Committee Kurrollu Movie 2nd Day Collections: కొత్త హీరోలు 11 మంది, హీరోయిన్లు నలుగురితో తెరకెక్కిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’. నిహారిక కొణిదెల నిర్మాణంలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌ పై రూపొందిన ఈ సినిమాకు యదు వంశీ దర్శకత్వం వహించారు. ఆగష్టు 9న ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం అట్టహాసంగా విడుదలైంది. డిఫరెంట్ కంటెంట్‌ తో ఫ్యామిలీ ఆడియెన్స్‌ తో పాటు యూత్‌ను ఆక‌ట్టుకుంటున్నది.  బాక్సాఫీస్ దగ్గర సూప‌ర్ హిట్ టాక్‌ తెచ్చుకుంది. వసూళ్ల పరంగానూ సత్తా చాటుతోంది. తొలి రోజు కంటే రెండో రోజు కలెక్షన్స్ మరింత పెరిగాయి.   

రెండు రోజుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ వసూళ్లు రూ. 3.69 కోట్లు

‘కమిటీ కుర్రోళ్లు’ సినిమా విడుదలకు ముందు నుంచే మంచి బజ్ క్రియేట్ అయ్యింది. మెగా డాటర్ నిర్మాణంలో వస్తున్న తొలి సినిమా కావడంతో ప్రేక్షకులలో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. అంచనాలకు అనుగుణంగానే రెండు రోజుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 3.69 కోట్ల‌ను రాబ‌ట్టింది. తొలి రోజు ఈ సినిమా 1.63 కోట్లు సాధించగా, రెండో రోజు వసూళ్లు పెరగడం విశేషం.

విలేజ్ బ్యాగ్రాఫ్ లో తెరకెక్కిన ఈ చిత్రం స్నేహం, ప్రేమ‌, కుటుంబంలోని భావోద్వేగాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రంలో సీనియ‌ర్ న‌టీన‌టుల‌తో పాటు 11 మంది హీరోలు, న‌లుగురు హీరోయిన్లు అద్భుత నటనతో ఆకట్టుకున్నారు. ప్రేక్షకులు ఈ 15 మందిలో  ఏదో ఒక క్యారెక్టర్ తో కనెక్ట్ కావడం విశేషం. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. అందులో భాగంగానే తొలి రోజుతో పోల్చితే, రెండో రోజు కలెక్షన్స్ పెరిగాయి. ఆదివారం నాడు ఈ వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మౌత్ టాక్ తోనే ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తోందని అభిప్రాయపడుతున్నారు. అటు దర్శకుడు సినిమా కథను తెరకెక్కించిన విధానంపై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. పల్లెటూరి ప్రేమలు, ఆప్యాయతలు, కోపాలను రియలిస్టిక్ గా చూపించాని అభిప్రాయపడుతున్నారు.   

‘కమిటీ కుర్రోళ్లు’ హిట్ కొట్టడంపై నిహారిక సంతోషం

‘కమిటీ కుర్రోళ్లు’ సినిమా హిట్ కొట్టడంపై నిర్మాత నిహారిక సంతోషం వ్యక్తం చేసింది. ఈ సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది. ఈ సినిమా కోసం కష్టపడిన ప్రతి ఒక్కరి శ్రమకు తగిన ఫలితం దక్కించిన చెప్పుకొచ్చింది. ఈ సినిమాలో భాగస్వామ్యం కావడం పట్ల  హ్యాపీగా ఫీలవుతున్నట్లు వెల్లడించింది.

‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంలో నటీనటులు వీళ్లే..  

‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంలో 15 మంది కొత్త నటులు ప్రధాన పాత్రలు పోషించారు. సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాద్ వర్మ, ప్రసాద్ బెహరా, మణికంఠ పరసు, లోకేష్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, రఘువరన్, శివకుమార్ మట్ట, అక్షయ్ శ్రీనివాస్, రాధ్య, తేజస్వి రావు, టీనా శ్రావ్య, విషిక అద్భుత నటన కనబరిచారు. ముఖ్య పాత్రల్లో సాయి కుమార్, గోపరాజు రమణ, బలగం జయరాం, శ్రీ లక్ష్మి , కంచెరపాలెం కిషోర్, కిట్టయ్య, రమణ భార్గవ్, జబర్దస్త్ సత్తిపండు తదితరులు నటించారు.

Also Readసమంతతో విడాకులకు ముందే శోభితతో నాగ చైతన్య ప్రేమ వ్యవహారం నడిపారా? లేదంటే విడాకుల తర్వాతా... అసలు నిజం ఏమిటంటే?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hey Balwanth OTT : తండ్రి బిజినెస్ చూసి కొడుకు షాక్ - ఓటీటీలోకి వచ్చేసిన 'హే బల్వంత్'... ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
తండ్రి బిజినెస్ చూసి కొడుకు షాక్ - ఓటీటీలోకి వచ్చేసిన 'హే బల్వంత్'... ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
Thaai Kizhavi OTT : ఓటీటీలోకి రాధిక హిట్ మూవీ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి రాధిక హిట్ మూవీ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
chinni serial today march 31st: చిన్ని సీరియల్: మ్యాడీ చిన్నికి దగ్గరవుతున్నాడా! మూడు జంటలకు మంగళస్నానాలు!
చిన్ని సీరియల్: మ్యాడీ చిన్నికి దగ్గరవుతున్నాడా! మూడు జంటలకు మంగళస్నానాలు!
Podharillu Serial Today March 31: పొదరిల్లు సీరియల్: తనకోసం ప్రాణాలిచ్చే మనుషులు ఉన్నారని మహా ఆ ఇంట్లోనే ఉండిపోతుందా.? చక్రిని భర్తగా అంగీకరిస్తుందా..?
పొదరిల్లు సీరియల్: తనకోసం ప్రాణాలిచ్చే మనుషులు ఉన్నారని మహా ఆ ఇంట్లోనే ఉండిపోతుందా.? చక్రిని భర్తగా అంగీకరిస్తుందా..?

వీడియోలు

Rohit Sharma Fastest Half Century IPL 2026 | ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ సాధించిన రోహిత్ | ABP Desam
Rohit Dance in Front of Injured Rahane | రహానే కింద పడిపోతే.. రోహిత్ డాన్స్ | ABP Desam
Rahane Innings KKR vs MI IPL 2026 | వాంఖడేలో కేకేఆర్ పరుగుల విధ్వంసం | ABP Desam
IPL 2026 Mumbai Indians Vs KKR IPL 2026 | ఐపీఎల్ 2026లో ముంబై రికార్డు ఛేజింగ్ | ABP Desam
Heinrich Klaasen Controversial Out vs RCB | థర్డ్ అంపైర్‌పై సునీల్ గవాస్కర్ ఫైర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Paadi Kaushik Reddy Controversy: కౌశిక్ రెడ్డికి వివాదాలు అలవాటుగా మారాయా? బీఆర్‌ఎస్‌కు నష్టమా? లాభమా?
కౌశిక్ రెడ్డికి వివాదాలు అలవాటుగా మారాయా? బీఆర్‌ఎస్‌కు నష్టమా? లాభమా?
Hyderabad- Vijayawada Toll Charges: హైదరాబాద్‌- విజయవాడ హైవేపై తగ్గిన టోల్ టాక్స్.. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి
హైదరాబాద్‌- విజయవాడ హైవేపై తగ్గిన టోల్ టాక్స్.. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి
Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్రం కీలక విమర్శలు- లక్షల కోట్ల ప్రజాధనం వృథా, ప్లానింగ్ లోపాలే కారణమని వెల్లడి!
కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్రం కీలక విమర్శలు- లక్షల కోట్ల ప్రజాధనం వృథా, ప్లానింగ్ లోపాలే కారణమని వెల్లడి!
Vaibhav Sooryavanshi: IPL 2026లో వైభవ్ సూర్యవంశి ఎదుర్కునే 10 సవాళ్లు.. ఎన్ని రికార్డులను బద్దలు కొట్టగలడు?
IPL 2026లో వైభవ్ సూర్యవంశి ఎదుర్కునే 10 సవాళ్లు.. ఎన్ని రికార్డులను బద్దలు కొట్టగలడు?
Crime News: స్కూల్ విద్యార్థినిపై పలుమార్లు లైంగిక దాడి.. 14 ఏళ్లకే తల్లయిన బాలిక- కర్నూలులో దారుణం
స్కూల్ విద్యార్థినిపై పలుమార్లు లైంగిక దాడి.. 14 ఏళ్లకే తల్లయిన బాలిక- కర్నూలులో దారుణం
Hyderabad Old Age Homes: హైదరాబాద్‌లో కట్టెల పొయ్యితో ఈ వృద్దులు బతికేదెట్టా..! వృద్దాశ్రమాల్లో LPG కష్టాలపై ABP దేశం ప్రత్యేక కథనం
హైదరాబాద్‌లో కట్టెల పొయ్యితో ఈ వృద్దులు బతికేదెట్టా..! వృద్దాశ్రమాల్లో LPG కష్టాలపై ABP దేశం ప్రత్యేక కథనం
Thalapathy Vijay Net Worth: రూ.624.74 కోట్ల ఆస్తులు, 1.20 కోట్ల విలువైన ఆభరణాలు, BMW i7 వంటి లగ్జరీ కార్లు! టీవీకే అధినేత విజయ్ నెట్‌వర్త్ ఇదే!
రూ.624.74 కోట్ల ఆస్తులు, 1.20 కోట్ల విలువైన ఆభరణాలు, BMW i7 వంటి లగ్జరీ కార్లు! టీవీకే అధినేత విజయ్ నెట్‌వర్త్ ఇదే!
Mahieka Sharma News: హార్దిక్ పాండ్యా కొడుకు గురించి మహికా శర్మ ఫైర్ :  ఇబ్బంది పెట్టొద్దంటూ ఫోటోగ్రాఫర్లకు వార్నింగ్.. 
హార్దిక్ పాండ్యా కొడుకు గురించి మహికా శర్మ ఫైర్ :  ఇబ్బంది పెట్టొద్దంటూ ఫోటోగ్రాఫర్లకు వార్నింగ్.. 
Embed widget