అన్వేషించండి
Tollywood: 'ఆర్ఆర్ఆర్'కి ఆస్కార్ గ్యారెంటీ - ఫైట్ మాస్టర్ కణల్ కన్నన్ అరెస్ట్!
ఈరోజు టాలీవుడ్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మీకోసం..
'ఆర్ఆర్ఆర్'కి ఆస్కార్ గ్యారెంటీ:
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల ప్రేక్షకులు ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టారు. అమెరికన్లు కూడా ఈ సినిమా చూసి ఫిదా అయ్యారు. ప్రేక్షకులతో పాటు హాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్, ఆర్టిస్ట్ లు కూడా ఈ సినిమా చూసి యూనిట్ పై ప్రశంసలు కురిపించారు. అయితే ఈ సినిమా ఆస్కార్ అవార్డ్స్ లో కూడా ప్రభావం చూపించొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రముఖ దర్శక నిర్మాత అనురాగ్ కశ్యప్ 'ఆర్ఆర్ఆర్'కి ఆస్కార్ గ్యారెంటీ అని కామెంట్స్ చేశారు. ఇండియా నుంచి 'ఆర్ఆర్ఆర్' నామినేట్ అయితే ఉత్తమ చిత్రంగా అవార్డు గెలిచే ఛాన్స్ ఉందని అన్నారు.
#AnuragKashyap:
— Roasters Hustle (@RoastersHustle) August 15, 2022
If #RRRMovie becomes India Selection 99% it might get Nomination for #Academy (Oscars) that is the impact RRR has had in the world of #Hollywood.
West: They have discovered a new film maker in #SSRajamouli
They find it better than any #Marvel movie.🥵🥵🥵 pic.twitter.com/0WSMbAl6DL
ఫైట్ మాస్టర్ కణల్ కన్నన్ అరెస్ట్:
ప్రముఖ ఫైట్ మాస్టర్ కణల్ కన్నన్‌ను చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సోమవారం పుదుచ్చేరిలో అరెస్ట్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. గత నెల 31న మదురవాయిల్‌లో హిందూ మున్నని సమాఖ్య హిందువుల పరిరక్షణ కోసం నిర్వహించిన కార్యక్రమంలో కణల్ కన్నన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన శ్రీరంగం ఆలయం ఎదురుగా.. దేవుడిపై నమ్మకం లేని పెరియార్ విగ్రహాన్ని బద్దలు కొట్టాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో అతడిపై ఫిర్యాదు నమోదైంది. దీంతో కణల్ కన్నన్ పరారయ్యారు. పదమూడు రోజుల తరువాత అతడి ఆచూకీ తెలియడంతో చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
ఆకుపచ్చని చీరలో అనసూయ అందాలు:
View this post on Instagram
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion