అన్వేషించండి
Advertisement
Tollywood Latest Updates : సంపత్ నందిపై ప్రశంసలు.. చిరంజీవి కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్న ఆది..
ఈరోజు టాలీవుడ్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మీకోసం..
సంపత్ నంది మంచి కథకుడు..
దర్శకుడు సంపత్ నందిపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు. ఆయన డైరెక్ట్ చేసిన 'సీటిమార్' సినిమా ట్రైలర్ వీక్షించిన చిరు సంపత్ నందిని తెగ పొగిడేశారు. దీనికి సంబంధించిన ఓ స్పెషల్ వీడియోను చిత్రబృందం సోషల్ మీడియాలో షేర్ చేసింది. 'సీటీమార్' ట్రైలర్ తనకు బాగా నచ్చిందని చిరు చెప్పారు. గ్రామీణ క్రీడగా చెప్పుకునే కబడ్డీ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కిందని అన్నారు. రామ్ చరణ్ నటించిన 'రచ్చ' సినిమా నుంచే సంపత్ నంది తనకు బాగా తెలుసని.. ఆయన మంచి కథకుడని చెప్పారు. తను అనుకున్న కథను సినిమా రూపంలో చాలా చక్కగా చెప్పగలడని.. 'రచ్చ' సినిమా సమయంలోనే ఆయన నేరేషన్ కి ఫిదా అయిపోయానని చెప్పారు. 'సీటీమార్' లాంటి మహిళా క్రీడా నేపథ్యంలో మరెన్నో సినిమా రావాలని అన్నారు.
ఆ స్పర్శలో థెరిసా ఉంది..
— Sampath Nandi (@IamSampathNandi) September 6, 2021
ఆ చూపులో భరోసా ఉంది..
మీ నీడ శ్రీరామరక్ష..
మీ జాడ తెలుగు సినిమాకి పెదబాలశిక్ష..
తీర్చుకోలేనిది మీ ఋణం..
వెలకట్టలేనివి మీ ఆశీస్సులు..
Always Grateful @KChiruTweets sir🙏🏾🙏🏾
- మీ సంపత్ నంది
& #Seetimaarr Team pic.twitter.com/VPh6FpIxWS
క్లాప్ టీజర్..
ఆదిపినిశెట్టి, ఆకాంక్ష సింగ్ జంటగా పృథ్వీ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'క్లాప్'. ఇళయరాజా ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్ కాసేపటి క్రితం మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని అభినందనలు తెలిపారు. ఈ సినిమాలో ఆది రన్నింగ్ రేసర్ గా కనిపించబోతున్నాడు. నేషనల్ లెవెల్ కాంపిటిషన్ లో పాల్గొని విజేతగా నిలవాలని పరితపించే కుర్రాడిగా కనిపిస్తున్నాడు. అయితే అతడికి ఆవేశం కూడా ఎక్కువే. అందరితో గొడవలు పడుతుంటాడు. టీజర్ చివర్లో ఆది.. ఒక కాలుతో మాత్రమే కనిపిస్తుండడం షాకిచ్చింది. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.
Glimpse of Mega🌟 @KChiruTweets garu launching @AadhiOfficial's thrilling #CLAP teaser🏃🏻#ClapTeaser ▶️https://t.co/7buX6LCSw0#ilaiyaraaja @aakanksha_s30 @actorbrahmaji @prakashraaj @KurupKrisha @prithivifilmist @BigPrintOffl @SRCOffl @SSSMOffl @pravethedop @LahariMusic pic.twitter.com/2zPNMWLgyd
— Shri Shiridi Sai Movies (@SSSMOffl) September 6, 2021
లోబోను ఆడేసుకుంటున్న నెటిజన్లు..
బిగ్ బాస్ సీజన్ 5 మొదలైన సంగతి తెలిసిందే. 19 మంది కంటెస్టెంట్ లతో మొదలైన ఈ షోలో ఆరో కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంటర్ అయిన లోబోకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'బిగ్ బాస్ షో చూస్తుంటారా..? మీ అభిప్రాయం ఏంటి..?' అని గతంలో ఓ యాంకర్ ప్రశ్నించగా.. 'బిగ్ బాస్ షోకి ఓ దండం. అది నా టేస్ట్ కాదు. షోలో ఛాన్స్ రాకపోవడమే మంచిది. నాకు ఆ అశౌ నచ్చదు' అంటూ లోబో చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఛాన్స్ రానంతవరకు బిగ్ బాస్ షోను తిట్టడం.. ఆ తరువాత ప్లేట్ మార్చడంతో లోబోపై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
#Lobo 😂#BiggBossTelugu5pic.twitter.com/htDetbYrY0
— Why that (@HeeZG0ne) September 6, 2021
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
హైదరాబాద్
ఆటో
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion