Tollywood: పెళ్లి విషయంలో నవదీప్ పాలసీ ఇదే.. రెహ్మాన్ ప్లేస్ కొట్టేసిన కీరవాణి..
ఈరోజు టాలీవుడ్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మీకోసం..
పెళ్లి విషయంలో నవదీప్ పాలసీ ఇదే..
టాలీవుడ్ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా సినిమాలు చేసిన నవదీప్ చాలా మంది హీరోల్లానే బ్యాచిలర్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఆయన గడ్డం తెల్లబడుతుందని కొందరు నెటిజన్లు పెళ్లి చేసుకోమని సలహాలు ఇస్తున్నారు. ఈ విషయంపై స్పందించిన నవదీప్ ఓ వీడియోను షేర్ చేశారు. అందులో ఆయనేం చెప్పారంటే.. 'అన్నా గడ్డం తెల్లబడుతోంది త్వరగా పెళ్లి చేసుకోండి అంటూ కొందరు సలహాలు ఇస్తున్నారు. గడ్డం తెల్లబడితే చేసుకోవాల్సింది ట్రిమ్మింగ్ కానీ పెళ్లి కాదు. దురద పెడితే గోక్కుంటాం కానీ తోలు పీక్కోం కదా అలాగే' అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Oddhu ra sodhara :) pic.twitter.com/IYKSAGFDVE
— Navdeep (@pnavdeep26) January 23, 2022
రెహ్మాన్ ప్లేస్ కొట్టేసిన కీరవాణి..
టాలీవుడ్ సీనియర్ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి మరో క్రేజీ ప్రాజెక్ట్ లో భాగమయ్యారు. 1993లో అర్జున్ హీరోగా రూపొందిన చిత్రం 'జెంటిల్‌మేన్'. ఈ సినిమాతోనే శంకర్ దర్శకుడిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఈ సినిమా ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కె.టి.కుంజుమోన్ ఈ సినిమాను నిర్మించగా రెహ్మాన్ సంగీతం అందించారు. దాదాపు 29 ఏళ్ల తర్వాత ఈ సినిమాకి సీక్వెల్ గా 'జెంటిల్‌మేన్ 2' రూపొందనుంది. నిర్మాత కుంజుమోన్ తన టీమ్‌ను సిద్ధం చేసుకుంటున్నారు. అందులో భాగంగా ఎం.ఎం.కీరవాణిని మ్యూజిక్ డైరెక్టర్‌గా అనౌన్స్ చేశారు.
Here I proudly announce The iconic legend of Indian Cinema @mmkeeravani garu will be the music director of my #GentlemanFilmInternational's#Gentleman2
— K.T.Kunjumon (@KT_Kunjumon) January 23, 2022
Gold coin Winners will be announced 🔜 🔥 #ஜென்டில்மேன்2 #जेंटलमेन2#ജെന്റിൽമാൻ2 #ಜಂಟಲ್ಮನ್2#జెంటిల్మాన్2@ajay_64403 pic.twitter.com/Oe5cx6jKLt
Also Read: 'లైగర్' సినిమాలో సమంత ఐటెం సాంగ్.. నిజమెంత..?
Also Read: స్టార్ హీరో ఫాంహౌస్‌లో సెలబ్రిటీల శవాలు.. సంచలనంగా మారిన వ్యక్తి ఆరోపణలు..