Tollywood Updates: ఓటీటీలో మారుతి సినిమా.. వరద బాధితులకు గీతాఆర్ట్స్ సాయం..
ఈరోజు టాలీవుడ్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మీకోసం..
ఓటీటీలో 'మంచి రోజులు వచ్చాయి':
యంగ్ హీరో సంతోష్ శోభన్, మెహ్రీన్ జంటగా నటించిన సినిమా 'మంచి రోజులు వచ్చాయి'. దర్శకుడు మారుతి ఈ సినిమాను రూపొందించారు. ఇటీవల థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకి మంచి టాక్ వచ్చింది. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా త్వరలోనే ఓటీటీలో విడుదల కానుంది. ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ 'ఆహా'లో డిసెంబర్ 3 నుంచి స్ట్రీమింగ్ కానుంది. యూవీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్ సంస్థలు నిర్మించిన ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.
Manchi Rojulu Vacchesthunnayiiii! You're all going to be laughing your heart out with this one ♥️😄 Premieres Dec 3.#ManchiRojulochaie #MRVOnAHA@santoshshobhan @Mehreenpirzada @harshachemudu @DirectorMaruthi @vennelakishore @Satyamrajesh2 @IamSaptagiri @SKNonline @anuprubens pic.twitter.com/cUyqnMMv8H
— ahavideoIN (@ahavideoIN) November 24, 2021
వరద బాధితులకు గీతాఆర్ట్స్ సాయం..
కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ ని వరదలు ముంచెత్తుతున్నాయి. నెల్లూరు, తిరుపతి ప్రాంతాల్లో వరద ఉధృతికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వరద బాధితులను ఆదుకోవడం కోసం చాలా మంది ముందుకొస్తున్నారు. తాజాగా టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ గీతాఆర్ట్స్ తిరుపతి వరద బాధితులకు తమ వంతు సహాయం అందించింది. రూ.10 లక్షలను ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్ కి డొనేట్ చేసింది. ఈ విషయాన్ని గీతాఆర్ట్స్ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది.
We have made a humble donation of Rs 10 lakh to @AndhraPradeshCM relief fund to help with the relief measures in flood-affected areas of #TirupatiRains.
— Geetha Arts (@GeethaArts) November 24, 2021
Also Read:'నగలు తిరిగిచ్చేయ్'.. ఆ లెటర్ నిజంగానే ఉదయ్ కిరణ్ రాశాడా..?
Also Read: డిసెంబర్ బరిలో మరో యంగ్ హీరో.. డేట్ లాక్ చేసేసుకున్నాడు..
Also Read: 'సిద్ధ' వచ్చేది అప్పుడే.. మెగాపవర్ మాస్.. రెడీగా ఉండండి..
Also Read: 'రిపబ్లిక్' సినిమాను థియేటర్లో చూడని సాయితేజ్.. తొలిసారి ఓటీటీలోనే..
Also Read: పబ్ లో టేబుల్ పైకెక్కి డాన్స్ లు.. 'ఆర్మీ ఆఫీసర్ అనే విషయం మర్చిపోయిందా..?'
Also Read: స్కైలాబ్ పోస్టర్తో ఫోటో దిగి పంపిస్తే... బిగ్ సర్ప్రైజ్ ఇస్తానంటున్న నిత్యా మీనన్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి