By: ABP Desam | Updated at : 31 Oct 2022 05:08 PM (IST)
'థగ్స్' సినిమాలో ప్రధాన తారాగణం
ఇప్పుడు ప్రముఖ నృత్య దర్శకురాలు బృందా గోపాల్ (Brinda Gopal) పాటలతో పాటు సినిమాలకు కూడా దర్శకత్వం వహిస్తున్నారు. దుల్కర్ సల్మాన్, కాజల్ అగర్వాల్, అదితి రావు హైదరి హీరో హీరోయిన్లుగా నటించిన 'హే సినామికా'తో ఆమె దర్శకురాలిగా మారారు. అదొక న్యూఏజ్ అండ్ రొమాంటిక్ కామెడీ మూవీ. అయితే... ఇప్పుడు బృందా మాస్టర్ రూటు మార్చారు. రా అండ్ యాక్షన్ ఫిల్మ్ తీస్తున్నారు.
థగ్స్... బృందా పాన్ ఇండియా సినిమా!
Brinda Gopal New Movie As Director : బృందా మాస్టర్ దర్శకత్వం వహిస్తున్న తాజా సినిమా 'థగ్స్' (Thugs Movie 2022). ఇందులో బాబీ సింహ (Bobby Simha), ఆర్.కె. సురేష్, మునిష్కంత్, శరత్ అప్పనీ, అనస్వర రాజన్ ముఖ్య తారాగణం. హ్రిదు హరూన్ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఆయన వెండితెరకు పరిచయం అవుతున్న చిత్రమిది. అంటే... హీరోగా సిల్వర్ స్క్రీన్ మీద తొలి సినిమా. కానీ, నటుడిగా కాదు! అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చిన క్రాష్ కోర్స్ వెబ్ సీరీస్ (Crash Course Web Series) లో హ్రిదు హరూన్ నటించారు. అందులో సత్య శ్రీవత్సన్ పాత్రలో కనిపించారు. త్వరలో విడుదల కానున్న 'మంబైకర్'లో కూడా ఆయన నటించారు.
డిసెంబర్‌లో 'థగ్స్' రిలీజ్!
Thugs Movie Release Date : 'థగ్స్' సినిమాలో ఎక్కువ మంది తమిళ నటీనటులు ఉన్నారు. బాబీ సింహా, హ్రిదు హరూన్‌లకు నేషనల్ లెవల్‌లో రికగ్నైజేషన్ ఉంది. ఈ సినిమాను హిందీ సహా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఈ ఏడాది డిసెంబర్‌లో విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు.
'థగ్స్' మ్యూజిక్ హక్కులను సోనీ మ్యూజిక్ సంస్థ సొంతం చేసుకుంది. పాటలతో పాటు ప్రోమో కంటెంట్‌ను తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో మార్కెటింగ్ చేయడానికి థగ్స్ టీమ్, సోనీ మ్యూజిక్ మధ్య ఒప్పందం కుదిరింది.
'థగ్స్' చిత్రాన్ని రా అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించినట్టు నిర్మాత రియా షిబు తెలిపారు. హెచ్.ఆర్. పిక్చర్స్ పతాకంపై ఈ ఇసినిమా రూపొందుతోంది. విజయ్ 'పులి', విక్రమ్ 'ఇంకొక్కడు', 'సామి స్క్వేర్'తో పాటు హిందీ సినిమా 'ముంబైకర్' నిర్మించిన శిబు తమీన్స్ కుమార్తే రియా షిబు (Riya Shibu Producer). తమిళంలో 'ఆర్ఆర్ఆర్', 'విక్రమ్', 'డాన్' వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను హెచ్.ఆర్. పిక్చర్స్ డిస్ట్రిబ్యూట్ చేసింది.
Also Read : విడుదలకు ముందే 'దిల్' రాజుకు 30 కోట్లు లాభం?
కొన్ని రోజుల క్రితం 'థగ్స్' సినిమాలో మెయిన్ లీడ్స్ క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ వీడియో విడుదల చేశారు. దానికి మంచి స్పందన లభించిందని చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేసింది. ఆ వీడియో సినిమాపై అంచనాలు పెంచిందని పేర్కొంది. ఈ చిత్రానికి శామ్ సి.ఎస్ స్వరాలు, నేపథ్య సంగీతం అందిస్తుండగా... 'ఆర్ఆర్ఆర్' ప్రోమో ఎడిటర్‌గా పాపులర్ అయిన ప్రవీణ్ ఆంటోనీ ఎడిటింగ్ బాధ్యతలు చూస్తున్నారు. ప్రీయేష్ గురుస్వామి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇంకా ఈ చిత్రానికి ప్రాజెక్ట్ డిజైనర్ : జోసెఫ్ నెళ్లికల్, యాక్షన్ : ఫీనిక్స్ ప్రభు, రాజశేఖర్, క్రియేటివ్ ప్రొడ్యూసర్ : ముత్తు కురుప్పయ్య, కాస్ట్యూమ్స్ : మాలిని కార్తికేయన్.
Krishna Mukunda Murari December 9th Episode కృష్ణతో తాడోపేడో తేల్చుకోవడానికి వెళ్లిన మురారి.. ముకుంద పని ఇక అంతే!
Look Back 2023: భారీ సక్సెస్ కొట్టిన చిన్న సినిమాలు - ఈ ఏడాది టాలీవుడ్‌లో క్రేజీ సిక్సర్!
Namo Movie: నమో - నరేంద్ర మోడీ కాదండోయ్, సర్వైవల్ కామెడీ సినిమా!
Naga Panchami Serial December 9th Episode పంచమి చనిపోతుంది అని మోక్షకు తెలిస్తే.. కరాళి మాస్టర్ ప్లాన్!
Guntur Kaaram Song: మహేష్ బాబుకు శ్రీలీల ముద్దు - 'గుంటూరు కారం'లో రెండో పాట రెడీ!
Bhatti Vikramarka: లక్షల కోట్ల అప్పుల్లో తెలంగాణ, ఛాలెంజ్ గా ఆర్థికశాఖ తీసుకున్నాను: భట్టి విక్రమార్క
2024 TVS Apache RTR 160 4V: సూపర్ డిజైన్, అదిరిపోయే లుక్‌తో వచ్చిన కొత్త అపాచీ - ధర ఎంతో తెలుసా?
Mahalaxmi Scheme: రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం - ప్రభుత్వ నిర్ణయంపై మహిళల హర్షం
Telangana Ministers Portfolios: నాలుగు కేబినెట్‌లలో సభ్యుడిగా తుమ్మల రికార్డు- 11 మందికి కేటాయించిన శాఖల ప్రత్యేకతలు ఇవే
/body>