Lata Mangeshkar Health: పుకార్లను నమ్మొద్దు.. లతా మంగేష్కర్ ఆరోగ్యంపై లేటెస్ట్ అప్డేట్..
ఇన్ని రోజులవుతున్నా.. లతా మంగేష్కర్ ని వైద్యులు డిశ్చార్జ్ చేయకపోవడంతో ఇంకా కోలుకోవాల్సి ఉందని తెలుస్తోంది
లెజెండరీ సింగర్, నైటింగేల్ ఆఫ్ ఇండియా, భారతరత్న లతా మంగేష్కర్(92) కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం ఆమెను ముంబైలోని బీచ్ క్యాండీ ఆస్పత్రిలో జాయిన్ చేశారు. అప్పటినుంచి ఐసీయూ (ఇంటెన్సివ్ కేర్ యూనిట్)లోనే ఉంచి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆమె ఆరోగ్యానికి సంబంధించిన అప్డేట్స్ ను హాస్పిటల్ యాజమాన్యం వెల్లడిస్తూనే ఉంది.
లతా మంగేష్కర్ కోలుకోవాలని అభిమానులు దేవుడ్ని వేడుకోవాలంటూ ఆమెకు వైద్యం చేస్తున్న డాక్టర్ ప్రతీత్ సందాని ఇటీవల వెల్లడించారు. ఇన్ని రోజులవుతున్నా.. ఆమె హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కాకపోవడంతో రూమర్లు మొదలయ్యాయి. సోషల్ మీడియాలో లతా ఆరోగ్యానికి సంబంధించి తప్పుడు ప్రచారం జరుగుతోంది. దీంతో లతా కుటుంబ సభ్యులు సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
లతా దీదీ ఆరోగ్యం ఇప్పుడిప్పుడే మెరుగుపడుతుందని.. ఐసీయూలోనే ట్రీట్మెంట్ కొనసాగుతుందని అన్నారు. దీదీ ఆరోగ్యం విషయంలో వినిపిస్తోన్న పుకార్లను నమ్మొద్దని చెప్పారు. ఈ పోస్ట్ చూసిన అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.
There is a marginal improvement in Lata Didi’s health and she continues to be in the ICU.
— Lata Mangeshkar (@mangeshkarlata) January 25, 2022
Kindly refrain from spreading disturbing rumours or falling prey to random messages regarding Didi’s health.
Thank you
View this post on Instagram
Also Read: మహేష్ మరదలిగా మలయాళ బ్యూటీ.. త్రివిక్రమ్ తెగ ప్రమోట్ చేస్తున్నారుగా..
Also Read: నన్ను సినిమా నుంచి తప్పించాలని ఇరిటేట్ చేశారు.. రాజశేఖర్, జీవితలపై దర్శకుడి వ్యాఖ్యలు..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి