MAA Elections: ఎన్నికల ప్రక్రియలో మార్పు.. రిజల్ట్స్ ఎప్పుడంటే..?
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికల ప్రక్రియలో చిన్న మార్పు చోటుచేసుకుంది. అదేంటంటే..?
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికల ప్రక్రియలో చిన్న మార్పు చోటుచేసుకుంది. ముందుగా ప్రకటించిన విధంగా కాకుండా.. ఎన్నికల ఫలితాలను మరుసటిరోజు వెల్లడించనున్నారు. అక్టోబర్ 10న పోలింగ్ జరగనుండగా.. 11న వాటి ఫలితాలు వెల్లడవుతాయని తెలుస్తోంది. నిజానికి ఎన్నికల జరిగిన సాయంత్రానికే రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేసేవారు. కానీ ఇప్పుడు నెక్స్ట్ డే చేయబోతున్నారు. ఎన్నడూలేని విధంగా ఈసారి 'మా' ఎలెక్షన్స్ అటు సినిమా ఇండస్ట్రీలోనూ.. ఇటు ప్రజల్లోనూ హాట్ టాపిక్ గా మారింది.
Also Read: అతడి వల్లే 'మా'లో ఇన్ని గొడవలు.. శివాజీరాజా ఆరోపణలు..
ఒక ప్యానెల్ వారు మరొక ప్యానెల్ పై చేసిన విమర్శలతో అందరిలో ఆసక్తి పెరిగింది. మరి 'మా' అధ్యక్షుడు ఎవరనేది తెలియాలంటే సోమవారం వరకు ఎదురుచూడాల్సిందే. అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తోన్న ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ఒకరిపై మరొకరు చేసుకుంటున్న ఆరోపణలు శృతి మించిపోతున్నాయి. ఈ విషయంలో కొందరు పెద్దలు జోక్యం చేసుకుంటున్నా.. పరిస్థితి మాత్రం అదుపులోకి రావడం లేదు. ఒకరు కౌంటర్ వేస్తే.. ఇంకొకరు ఎన్ కౌంటర్ చేస్తూ హద్దులు లేకుండా ఆరోపణలు చేసుకుంటున్నారు.
ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తుంటే.. ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణంరాజు లాంటి పెద్దల సపోర్ట్ మంచు విష్ణుకే ఉన్నట్లు తెలుస్తోంది. ఈరోజు కోటా శ్రీనివాసరావు కూడా తన మద్దతు మంచు విష్ణుకే అని.. అందరూ అతడికే ఓటు వేయాలని చెప్పారు. ఇక నాగబాబు అలానే మెగాఫ్యామిలీ సపోర్ట్ ప్రకాష్ రాజ్ కి ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ ఎలెక్షన్స్ లో ఎవరి మద్దతు ఎవరిని గెలిపిస్తుందో చూడాలి!
Also Read: కొండ పొలం సమీక్ష: మట్టివాసన చూపించే సినిమా.. వైష్ణవ్ మళ్లీ కొట్టాడా?
Also Read: అతడు ఒక్క రోజు కూడా షూటింగ్‌కు సమయానికి రాలేదు.. ‘మా’ ఎన్నికలపై కోటా వ్యాఖ్యలు
Watch This : "నా ఓటు ఆ పానెల్ కే.." నగరి ఏమ్మెల్యే రోజా ప్రకటన
Also Read: విమానంలో పుట్టిన ‘మా’.. తొలి అధ్యక్షుడు ఆయనే.. ఇదే ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్’ చరిత్ర
Also Read: ‘మా’ బిడ్డల పోరు.. కళామతల్లి కన్నీరు.. పదవుల కోసం పంతాలు? పరువు తీస్తున్న పోట్లాటలు!
Also Read: పవన్‌తో విభేదాలు.. ఆయన మార్నింగ్ షో కలెక్షనంత ఉండదు మీ సినిమా: ప్రకాష్ రాజ్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి