(Source: ECI/ABP News/ABP Majha)
Kisi Ka Bhai Kisi Ki Jaan Movie: ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ ట్రైలర్ లో రైటర్ పేరు ఎందుకు వేయలేదు? సాజిద్ అసలు రచయిత కాదా?
సల్మాన్ ఖాన్ తాజా సినిమా ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’కు సంబంధించి తాజాగా విడుదలైన ట్రైలర్ తీవ్ర చర్చకు దారి తీసింది. ఇందులో కథా రచయిత పేరు పెట్టకపోవడం అందరినీ షాక్ కి గురి చేసింది.
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్'. ఫర్హాద్ సామ్జీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. సల్మాన్ ఖాన్ సొంత బ్యానర్ లో భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాలో, పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. విక్టరీ వెంకటేష్ కీలక పాత్ర పోషించగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ పాటలో గెస్ట్ అప్పీరెన్స్ ఇస్తున్నారు. రిలీజ్ కు రెడీ అయిన ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇందులో భాగంగానే రీసెంట్ గా మూవీ ట్రైలర్ ను మేకర్స్ ఆవిష్కరించారు.
తీవ్ర చర్చకు కారణమైన 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' ట్రైలర్!
ఈ ట్రైలర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నప్పటికీ, ఓ విషయంలో తీవ్ర చర్చకు దారి తీసింది. ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’కు సంబంధించిన ట్రైలర్ చివరలో సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్కరి పేరు ప్రస్తావించారు. కానీ, ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్‌లు రాసిన వారి పేర్లు లేకపోవడం అందరినీ షాక్ కు గురి చేసింది. సినిమాటోగ్రాఫర్, అసోసియేట్ ప్రొడ్యూసర్, సంగీత దర్శకుడు, ఎడిటర్, యాక్షన్ డైరెక్టర్, ప్రొడక్షన్ డిజైనర్, కాస్ట్యూమ్ డిజైనర్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కంపోజర్, మార్కెటింగ్, స్ట్రాటజీ కన్సల్టెంట్, క్రియేటివ్ సూపర్‌వైజర్లు, VFX, DI స్టూడియోలు, విజువల్ ప్రమోషన్స్ కంపెనీ, థియేట్రికల్ ట్రైలర్ కట్టర్లు, పబ్లిసిటీ డిజైనర్లు, డిజిటల్ మార్కెటింగ్ కన్సల్టెంట్, పోస్ట్ ప్రొడక్షన్ కంపెనీ పేరు కూడా ప్రస్తావించారు. కానీ, రచయిత పేరును వేయలేదు.
View this post on Instagram
రచయిత పేరు ఎందుకు వేయలేదంటే?
తాజాగా ఈ సినిమా కథా రచయిత పేరు వేయకపోవడానికి గల కారణం బయటకు వచ్చింది. ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ కథను సాజిద్ నడియాద్వాలా రాశారని అందరికీ తెలుసు. కానీ, ఆయనే పూర్తి కథ రాయలేదట. ప్రాథమిక కథాంశాన్ని మాత్రమే సాజిద్ సర్దుబాటు చేశారట. ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ నిజమైన రచయిత సల్మాన్ ఖాన్ అని సినిమా యూనిట్ లోని కొంత మంది అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమాలోని ప్రతి డైలాగ్, ప్రతి సన్నివేశం సల్మాన్ ఖాన్ పర్యవేక్షణలో రాయబడింది. నిజానికి ఈ సినిమాల్లోని కొన్ని డైలాగులు ఆయనే రాశారట. అయినప్పటికీ, ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ రచయితగా క్రెడిట్ తీసుకునేందుకు సల్మాన్ పెద్దగా ఆసక్తి చూపలేదట.
ఈద్ కానుకగా 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' విడుదల
ఇక తాజా ట్రైలర్ ను పరిశీలిస్తే, ఇది లవ్, కామెడీ, యాక్షన్ ప్రధానంగా తెరకెక్కిన సినిమా అని తెలుస్తోంది. ఇప్పటికే 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్, సాంగ్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. తెలంగాణ నేపథ్యంలో 'బతుకమ్మ' సాంగ్.. రామ్ చరణ్, వెంకీ, సల్మాన్ కలిసి చేసిన 'ఏంటమ్మా' సాంగ్ సౌత్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యాయి. లేటెస్టుగా వచ్చిన ట్రైలర్ కూడా సినీ అభిమానులను ఉత్సాహ పరుస్తోంది. ఈ సినిమా ఏప్రిల్ 21న రంజాన్ కానుకగా రిలీజ్ కాబోతుంది. ఏప్రిల్ 17 నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుకానున్నాయి.
Read Also: ఎప్పటికీ తిరిగిరాలేనని అనుకున్నారా? - కొత్త షోలో రియా చక్రవర్తి, సుశాంత్ మరణం తర్వాత తొలిసారి ఇలా!