Rhea Chakraborty: ఎప్పటికీ తిరిగిరాలేనని అనుకున్నారా? - కొత్త షోలో రియా చక్రవర్తి, సుశాంత్ మరణం తర్వాత తొలిసారి ఇలా!
బాలీవుడు నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత.. తొలిసారి MTV రోడీస్ ద్వారా టెలివిజన్ రంగంలోకి ప్రవేశనించనుంది. ఈ విషయాన్ని ఓ టీజర్ ద్వారా తెలియజేస్తూ.. సోషల్ మీడియాలో పంచుకుంది.
Rhea Chakraborty: నటి రియా చక్రవర్తి ప్రముఖ రియాలిటీ షో MTV రోడీస్ కొత్త సీజన్‌తో మళ్లీ తెరపైకి వచ్చింది. MTV రోడీస్ సీజన్ 19లో గ్యాంగ్ లీడర్‌గా ప్రముఖ రియాలిటీ షోతో తన అనుబంధాన్ని ఈ సందర్భంగా రియా చక్రవర్తి ప్రకటించింది. ఈ షోను సోనూ సూద్ హోస్ట్ చేయగా, రియా గ్యాంగ్ లీడర్ లా నటిస్తుండగా.. ప్రిన్స్ నరులా, గౌతమ్ గులాటీ వంటి వారు ఆమెతో పాటు పాల్గొంటున్నారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
రోడీస్ ప్రపంచంలోకి తన ప్రవేశాన్ని పరిచయం చేసే ఓ వీడియోను రియా ఏప్రిల్ 10న సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. (ఆప్కో క్యా లగా, మై వాపస్ నహిం ఆవోంగి? Dar jaungi? ) ‘‘నేను ఎప్పటికీ తిరిగి రాలేనని మీరు అనుకున్నారా? లేదంటే భయపడ్డానని అనుకున్నారా?” అంటూ రియా నవ్వుతూ ఈ వీడియోలో తెలిపింది. అలా అప్పటివరకూ నవ్వుతూ ఉన్న రియా.. ఒక్కసారిగా నవ్వడం ఆపేసి “డర్నే కి బారీ కిసీ ఔర్ కి హై. Milte hai auditions pe’’ (ఇది తాను భయపడాల్సిన సమయం కాదని, తాను ఇతరులను భయపెట్టడానికే వచ్చానని, ఆడిషన్స్‌లో కలుసుకుందాం’’ అని పేర్కొంది. ఈ టీజర్ వీడియోలో రియా ఓ తాడు సాయంతో కిందకు దూకి ఈ తరహా వ్యాఖ్యలు చేస్తుండడం గమనించవచ్చు.
ఆమె మాజీ ప్రియుడు, నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత లైమ్‌లైట్‌కు దూరంగా ఉన్న రియా.. కాస్త గ్యాప్ తీసుకుని చేస్తున్న మొదటి టీవీ ప్రాజెక్ట్ ఇది. దీంతో రియా పోస్ట్ కు మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. కొంతమంది ఆమెకు మద్దతు తెలుపుతూ కామెంట్లు పెడుతున్నారు.
MTV రోడీస్ లో రియా చక్రవర్తి
గ్యాంగ్ లీడర్‌గా MTV రోడీస్ సీజన్ 19లో భాగం కావడంపై ఇటీవల రియా చక్రవర్తి మాట్లాడుతూ.. “MTV రోడీస్ సీజన్ 19లో భాగమైనందుకు నేను థ్రిల్‌గా ఉన్నాను. ఇది ఒక ఐకానిక్ సాంస్కృతిక దృగ్విషయం. MTVతో పని చేయడం అంటే మళ్లీ ఇంటికి వచ్చినట్లు అనిపిస్తుంది. ఈ ఉత్కంఠభరితమైన ప్రయాణంలో సోనూ సూద్ లాంటి తోటి నటులతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నాను. ఈ అద్భుతమైన కొత్త సాహసానికి అభిమానుల నుంచి ప్రేమ, మద్దతు లభిస్తుందని ఆశిస్తున్నాను! అంటూ రియా చెప్పుకొచ్చింది. ఇదిలా ఉండగా 'రోడీస్ సీజన్ 19' కోసం ఢిల్లీ ఆడిషన్స్ ఏప్రిల్ 19న జరగాల్సి ఉంది.
నటి రియా చక్రవర్తి ఎంటీవీ ఇండియాలో వీజేగా కెరీర్ ప్రారంభించింది. అ తర్వాత 2012లో వచ్చిన తెలుగు సినిమా 'తూనీగ తూనీగ', ఆ తర్వాత హిందీ చిత్రం 'మేరే డాడ్ కి మారుతి' (2013) లో కనిపించింది. ఇక ఆమె వ్యక్తిగత విషయానికొస్తే.. ఏప్రిల్ 2019 నుంచి నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో డేటింగ్ చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత రాజ్‌పుత్‌తో కలిసి సెప్టెంబర్ 2019లో 'వివిడ్రేజ్ రియాలిటిక్స్' అనే కృత్రిమ మేధస్సు సంస్థను స్థాపించింది. 14 జూన్ 2020న, రాజ్‌పుత్ ముంబైలోని బాంద్రాలోని తన ఇంటిలో ఆత్మహత్య చేసుకోవడం అప్పట్లో సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆ తర్వాత రియా అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. కోర్టు మెట్లు కూడా ఎక్కాల్సి వచ్చింది. అలా రాజ్ పుత్ మరణం తర్వాత మళ్లీ మొదటి సారి ఇలా టెలివిజన్ పై కనిపించేందుకు రియా సిద్ధమైంది.
Also Read : 'ఐ లవ్ యు ఇడియట్' రివ్యూ : తెలుగులో శ్రీలీల ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి రిలీజ్ చేశారా?