Varisu First Single Promo: మాస్ స్టెప్పులతో అదరగొట్టిన దళపతి విజయ్, ఆకట్టుకుంటున్న ‘వారసుడు’ సాంగ్ ప్రోమో!
దళపతి విజయ్, రష్మిక మందన్నా హీరో హీరోయిన్లుగా వస్తున్న తాజా సినిమా ‘వరిసు‘. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరెక్కిన ఈ చిత్రానికి సంబంధించిన సాంగ్ ప్రోమో విడుదల అయ్యింది.
తమిళ టాప్ హీరో దళపతి విజయ్, టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబోలో వస్తున్న తాజా సినిమా ‘వరిసు’. ఈ చిత్రాన్ని తెలుగులో ‘వారసుడు’గా విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చినట్లు తెలుస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో విడుదల కాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకులు కూడా ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దళపతి ఫ్యాన్స్ కు సినిమా యూనిట్ అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది. గురువారం ‘వరిసు’ సాంగ్ ప్రోమోను విడుదల చేసింది.
#VarisuFirstSingle is #Ranjithame ❤️
— Sri Venkateswara Creations (@SVC_official) November 3, 2022
▶️ https://t.co/EZeUDGcHbl
#RanjithameFromNov5
🎙️ #Thalapathy @actorvijay sir & @manasimm
🎵 @MusicThaman
🖊️ @Lyricist_Vivek@directorvamshi @iamRashmika @AlwaysJani #BhushanKumar #KrishanKumar @TSeries #Varisu #VarisuPongal
‘రంజితమే..’ సాంగ్‌తో అదిరిపోయే ఎంట్రీ
‘రంజితమే.. రంజితమే..’ అంటూ సాగే ఈ పాట అభిమానులను ఆకట్టుకుంటోంది. పాటకు తగ్గట్లుగానే విజయ్ మాస్ స్టెప్పులతో దుమ్ములేపాడు. టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇచ్చిన మ్యూజిక్ అదుర్స్ అనిపిస్తోంది. తమన్ సంగీతం, విజయ్ డ్యాన్స్ కు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సాంగ్ ప్రోమో విడుదల కావడంతో అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.
The much-awaited #VarisuFirstSingle promo is releasing Today at 6:30 PM 💥
— Sri Venkateswara Creations (@SVC_official) November 3, 2022
Stay Tuned nanba 🥁#Thalapathy @actorvijay sir @directorvamshi @iamRashmika @MusicThaman #BhushanKumar #KrishanKumar #ShivChanana @TSeries#Varisu #VarisuPongal pic.twitter.com/uriUcF2vrn
వచ్చే ఏడాది జనవరి 12న విడుదల
ఇక ఈ సినిమాలో విజయ్ సరసన కన్నడ సోయగం రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తున్నది. శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్నట్లు సినిమా పరిశ్రమలో టాక్ వినిపిస్తున్నది. ఈ సినిమాకు వచ్చే ఏడాది జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read Also: బ్లాక్ బస్టర్ మూవీ ‘కాంతార’ను చూసిన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, రిషబ్ శెట్టికి అభినందనలు
View this post on Instagram