News
News
X

Ajith Bike Trip: రష్యాలో అజీత్ కుమార్.. బైకుపై 5 వేల కిమీలు జర్నీ, ఫొటోలు వైరల్

హీరో అజీత్ కుమార్ రష్యాలో ప్రత్యక్షమయ్యారు. సుమారు 5 వేల బైక్ ట్రిప్ చేశారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

FOLLOW US: 

తమిళ హీరో అజీత్ కుమార్‌ సినిమాలే కాదు.. కార్, బైక్ రేసులను సైతం చాలా ఇష్టపడతారు. అయితే, ఓ ప్రమాదం తర్వాత ఆయన కార్ రేసులకు దూరంగా ఉన్నారు. కానీ, బైకులపై ఉన్న ఇష్టాన్ని మాత్రం ఆయన చంపుకులేక పోతున్నారు. ఇటీవల ఇండియాలోని ఈశాన్య రాష్ట్రాల్లో బైకులో పర్యటించిన అజీత్.. అకస్మాత్తుగా రష్యాలో ప్రత్యక్షమయ్యారు. బైకు మీద చక్కర్లు కొడుతూ.. తన అభిమానులను ఆశ్చర్యపరిచారు. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతున్నాయి. 

‘వాలీమై’ షూటింగ్‌లో అజీత్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. దివంగత నటి శ్రీదేవి భర్త బోనీకపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హెచ్.వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్‌లో ఈ సినిమా షెడ్యూల్ పూర్తయ్యింది. అనంతరం చిత్రయూనిట్ మరికొన్ని పతాక సన్నివేశాల చిత్రీకరణ కోసం రష్యా వెళ్లారు. అక్కడ షూటింగ్ పూర్తయిన తర్వాత అజీత్.. తన స్నేహితుడితో కలిసి బైక్ ట్రిప్‌కు వెళ్లారు. రష్యాలో సుమారు 5 వేల కిలోమీటర్లు ఆయన చుట్టివచ్చారని తెలిసింది. అలాగే, అజీత్ బైకు మీద ప్రపంచయాత్రకు కూడా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. 

రష్యాలో అజీత్ బైకు మీద షికారు చేస్తున్న ఫొటోలను ఆయన అభిమానులు సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటున్నారు. అజీత్ నటనలోకి రావడానికి ముందు బైక్ రేసర్ కావాలని అనుకున్నారు. అయితే, సినిమాల్లో వరసు అవకాశాలతో అజీత్ బిజీగా మారిపోయారు. అయితే, ఎప్పుడు సమయం దొరికినా కార్, బైక్ రేసుల్లో పాల్గొనేవారు. ఏరో మోడలింగ్, కార్ రేస్, బైక్ రేస్‌పై అజీత్ పట్టు సాధించారు. కొన్ని నెలల కిందట అజీత్ ఇండియాలో సుమారు 10,800 కిమీలు ప్రయాణించారు. అజీత్ కొన్ని ఇటీవల రాష్ట్ర స్థాయి షూటింగ్ పోటీల్లో పాల్గొని బంగారు పతకం సాధించారు. జాతీయ స్థాయి పోటీలకు సైతం అర్హత సాదించడం గమనార్హం.

Also Read: ఈడీ ముందుకు రకుల్ ప్రీత్ సింగ్.. నాడు బాలీవుడ్.. నేడు టాలీవుడ్ కేసులో!

Also Read: మత్తులో మాణిక్యాలు.. ఎఫ్-క్లబ్ చుట్టూ తిరుగుతున్న డ్రగ్స్ కథ, ఆ పార్టీయే కొంప ముంచిందా?

Also Read: ‘బిగ్‌బాస్’ విన్నర్ మృతిపై సందేహాలు.. ఆ రాత్రి ఏం జరిగింది? పోలీసులు ఏమన్నారంటే..

Also Read: ఆర్జీవీ చెంప పగలగొట్టిన అషూ రెడ్డి.. పవన్ కళ్యాణ్‌కు గిఫ్ట్.. వర్మ మళ్లీ తెగించారు

Also Read: బొమ్మరిల్లు సిద్ధార్థ్ చనిపోయాడంటూ ప్రచారం.. కావాలనే చేస్తున్నారంటూ ఆవేదన

Published at : 03 Sep 2021 04:32 PM (IST) Tags: Ajith Kumar Thala Ajith Ajith bike trip in Russia Valimaim Valimaim Shooting అజీత్ కుమార్

సంబంధిత కథనాలు

Bigg Boss 6 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లో గజిని, టాస్క్ ఏ టీమ్ గెలిచిందో తెలుసా?

Bigg Boss 6 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లో గజిని, టాస్క్ ఏ టీమ్ గెలిచిందో తెలుసా?

Mahesh Babu : పగ వాళ్ళకు సైతం మహేష్ బాబుకు వచ్చిన కష్టం రాకూడదు - కంటతడి పెట్టిస్తున్న సితార భావోద్వేగం

Mahesh Babu : పగ వాళ్ళకు సైతం మహేష్ బాబుకు వచ్చిన కష్టం రాకూడదు - కంటతడి పెట్టిస్తున్న సితార భావోద్వేగం

Chiranjeevi : చిరు పుత్రోత్సాహం - రామ్ చరణ్ 15 ఇయర్స్ కెరీర్‌పై ట్వీట్

Chiranjeevi : చిరు పుత్రోత్సాహం - రామ్ చరణ్ 15 ఇయర్స్ కెరీర్‌పై ట్వీట్

Coffee With A Killer : గ్యాప్ తర్వాత మెగాఫోన్ పట్టిన ఆర్పీ పట్నాయక్ - కిల్లర్ కథతో ఎంట‌ర్‌టైనింగ్ థ్రిల్ల‌ర్‌

Coffee With A Killer : గ్యాప్ తర్వాత మెగాఫోన్ పట్టిన ఆర్పీ పట్నాయక్ - కిల్లర్ కథతో ఎంట‌ర్‌టైనింగ్ థ్రిల్ల‌ర్‌

Vishnu Manchu - Ginna Title Song : నాతో పెట్టుకుంటే ఊరుకోను, నాకు ఎవరు సాటి లేరు - వచ్చిండు చూడు మన 'జిన్నా' భాయ్

Vishnu Manchu - Ginna Title Song : నాతో పెట్టుకుంటే ఊరుకోను, నాకు ఎవరు సాటి లేరు - వచ్చిండు చూడు మన 'జిన్నా' భాయ్

టాప్ స్టోరీస్

AP Vs Telangana : విద్యుత్ బకాయిలపై తెలంగాణకు ఊరట - కేంద్రానికి హైకోర్టు ఆదేశాలు ఏమిటంటే ?

AP Vs Telangana :  విద్యుత్ బకాయిలపై తెలంగాణకు ఊరట - కేంద్రానికి హైకోర్టు ఆదేశాలు ఏమిటంటే ?

నంద్యాల జిల్లాలో రామ్‌కో పరిశ్రమను ప్రారంభించిన సీఎం జగన్

నంద్యాల జిల్లాలో రామ్‌కో పరిశ్రమను ప్రారంభించిన సీఎం జగన్

Raiway Zone Issdue : రైల్వే జోన్‌పై అసలు కేంద్రం ప్రకటన ఇదిగో - అనుమానాలన్నీ తీరిపోయినట్లేనా ?

Raiway Zone Issdue : రైల్వే జోన్‌పై అసలు కేంద్రం ప్రకటన ఇదిగో - అనుమానాలన్నీ తీరిపోయినట్లేనా ?

Viral Video: వీడెవడండి బాబు, హైటెన్షన్ వైర్లపై సర్కస్ ఫీట్లు - చూసిన వారికి ముచ్చెమటలు

Viral Video: వీడెవడండి బాబు, హైటెన్షన్ వైర్లపై సర్కస్ ఫీట్లు - చూసిన వారికి ముచ్చెమటలు