Telugu Indian Idol Promo: తెలుగు ఇండియన్ ఐడల్ ప్రోమో - దుమ్మురేపిన తమన్, నిత్య మీనన్, కార్తీక్!
తెలుగు ఇండియన్ ఐడల్ ప్రోమో వచ్చేసింది. తమన్, నిత్యా మీనన్, కార్తీక్‌లు ఈ షోకు జడ్జ్‌లుగా వ్యవహరించనున్నారు.
‘ఇండియన్ ఐడల్’ ఇప్పుడు తెలుగులోనూ వచ్చేస్తుందనే సంగతి తెలిసిందే. అయితే, ఇది టీవీ చానల్‌లో కాకుండా.. ‘ఆహా’ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే ఈ షోకు ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్, ఇండియన్ ఐడల్ విన్నర్ శ్రీరామ చంద్రను హోస్ట్‌గా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి సంగీత దర్శకులు తమన్, కార్తిక్‌తోపాటు నటి, గాయని నిత్యా మీనన్‌లు జడ్జ్‌గా వ్యవహరించనున్నారు. ఈ సందర్భంగా ‘ఆహా’ టీమ్ శుక్రవారం తెలుగు ఇండియన్ ఐడల్ ప్రోమోను విడుదల చేశారు. తమన్ ‘భీమ్లా నాయక్’ పాటతో , ఉండిపోరాదే అంటూ నిత్యా మీనన్, ఇండియన్ ఐడల్ సిగ్నేచర్ గాత్రంతో కార్తిక్ స్టేజ్ మీదకు ఎంట్రీ ఇచ్చారు. ఈ షో ఫిబ్రవరి 25 నుంచి ప్రతి శుక్రవారం, శనివారం రాత్రి 9 గంటలకు స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. ఆ ప్రోమోను ఇక్కడ చూసేయండి.
View this post on Instagram
సంగీత దర్శకుడు తమన్ చాలా బిజీ. చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కల్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలతో పాటు పలువురు యంగ్ హీరోల చిత్రాలకు ఆయన సంగీతం అందిస్తున్నారు. ఇంత బిజీలోనూ ఆయన యంగ్ టాలెంటెడ్ సింగర్స్‌ను ఎంకరేజ్ చేయడం కోసం చేస్తున్న సింగింగ్ షోకు జడ్జ్‌గా వ్యవహరించడానికి ఆయన అంగీకరించడం గమనార్హం. హిందీలో పన్నెండు సీజన్లు కంప్లీట్ చేసుకున్న ఇండియన్ ఐడల్ షో ఇప్పటి వరకు తెలుగులోకి రాలేదు. తెలుగు సింగింగ్ టాలెంట్‌ను ప్రపంచానికి పరిచయం చేసే ఉద్దేశంతోనే ఆహా ఈ సరికొత్త రియాలిటీ షోను ప్లాన్ చేశారు.
Also Read: ‘డైరెక్టర్ ముద్దులు పెట్టించాడు, నాకు ఇష్టమే, విష్ణుకు ఇష్టంలేదు’ - మోహన్ బాబు
Also Read: 'సన్ ఆఫ్ ఇండియా' రివ్యూ: వికటించిన ప్రయోగం!