అన్వేషించండి

Telangana Songs : సినిమాల్లో తెలంగాణ పాటలు.. బ్లాక్ బస్టర్.. బంపర్ హిట్స్

తెలంగాణ అంటే సంస్కృతి, సంప్రదాయాల సమ్మేళనం. తెలంగాణ అంటేనే ఆటలు, పాటలు, బంధాలు.అందరికీ నచ్చేలా ఉంటాయి. తెలంగాణ జానపద, యాస పాటలకు ఎంతో పేరొచ్చింది.ఎందులో చూసినా తెలంగాణ గొప్పతనం కచ్చితంగా కనిపిస్తోంది

Telangana Songs : తెలంగాణ అంటే సంస్కృతి, సంప్రదాయాల సమ్మేళనం. తెలంగాణ అంటేనే ఆటలు, పాటలు.. అలా అందరికీ నచ్చేలా ఉంటాయి కాబట్టే నేడు తెలంగాణ జానపద పాటలకు, తెలంగాణ యాస పాటలకు ఎంతో పేరొచ్చింది. ఇవన్నీ ముందు నుంచే ఉన్నా.. రీసెంట్ డేస్ లో వచ్చిన కొత్త దర్శకులు కొత్తగా సినిమాలు తీయడం, తెలంగాణలోని మనుషుల్ని, వారి ఆచార, సంప్రదాయాలను కొత్తగా చూపిస్తుండడంతో నేడు ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు వస్తోంది. తెలంగాణ పాటల్లో ముఖ్యంగా ప్రస్ఫుటంగా కనిపించేలా ఎమోషన్స్, సెంటిమెంటల్ ఈవెంట్స్ ను తీర్చిదిద్దడంలో తెలంగాణ పెట్టింది పేరు. ఆనాటి ఒసేయ్ రాములమ్మ నుంచి రీసెంట్ గా వచ్చిన ఊరు పల్లెటూరు వరకు ఎన్నో లక్షల పాటలు వచ్చాయి. లాలూ దర్వాజ దగ్గర్నుంచి నేటి చమ్కీల అంగీలేసి వరకు .. ఎందులో చూసినా తెలంగాణ గొప్పతనం కచ్చితంగా కనిపిస్తోంది. ఈ మధ్య వచ్చిన ఫోక్ సాంగ్స్ సైతం సోషల్ మీడియాలో తెగ వైరల్అవుతున్నాయి. అందులో బోనాలు, బతుకమ్మ లాంటి పండగలకు సంబంధించి కూడా పలు పాటలు నేటికీ ట్రెండింగ్ లో నిలుస్తున్నాయి.

తెలంగాణ పాటలు ఏ ఒక్క ప్రాంతానికో, దేశానికే పరిమితం కాకుండా విదేశాల్లోనూ పాపులర్ అవుతున్నాయి. అలాంటి విన్న ప్రతిసారి మళ్లీ మళ్లీ వినాలనిపించేలా ఉంటాయనడంలో ఏ మాత్రం సందేహం లేదు. అలాంటి పాటలు మనసును హత్తుకోవాలంటే రచయితలు, గాయకుల సహకారం తప్పనిసరి. ఆనాటి గద్దర్ నుంచి గోరేటి వెంకన్న వరకు, మధు ప్రియ నుంచి మంగ్లీ వరకు, వందే మాతరం శ్రీనివాస్ నుంచి రామ్ మిర్యాల వరకు.. ఇలా ఎంతో మంది తమ గాత్రంలో మిమిక్రీ చేసి, ఎన్నో గొప్ప సాంగ్స్ ను అందించారు. అలాంటి వాటిల్లో ది బెస్ట్ తెలంగాణ సాంగ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వీటిని ఇంతకుముందు విన్నా కూడా.. మరో సారి విని మీరు కూడా మరోసారి రీఫ్రెష్ అవ్వండి.

1. ఒసేయ్ రాములమ్మ నుంచి ఓ ముత్యాల రెమ్మ
ఓ ముత్యాల రెమ్మ ఓ మురిపాల కొమ్మ
ఓ పున్నమి బొమ్మ ఓ పుత్త్తడి గుమ్మా
ఓ రాములమ్మ రాములమ్మ.. అంటూ వందేమాతరం శ్రీనివాస్ తన గాత్రంతో అందర్నీ ఆకట్టుకున్నారు.

https://youtu.be/UFlfVpnixP8

2. ఛల్ మోహన్ రంగా నుంచి అరేయ్ ఇంకొర భాయ్ …
అరేయ్ ఇంకొర భాయ్ …
నీకు అమేరిక ఈస వచ్చిన…
జీ మంచి గడియాలో…. ఈ సాంగ్ లో తెలంగాణలోని బోనాల పండుగ సన్నివేశాలను అందంగా చిత్రీకరించారు.

https://youtu.be/6Um_Pkl8qiY

 3. బలగం నుంచి ఊరు పల్లెటూరు
కోలో నా పల్లే.. కోడి కూతల్లే
ఒల్లిరుసుకుందే.. కోడె లాగల్లే
యాప పుల్లల.. చేదు నమిలిందే
రామ రామ రామ రామా.. అంటూ సింగర్స్ మంగ్లీ, రామ్ మిరియాల తమ అందమైన గాత్రంతో తెలంగాణ పల్లె అందాలను చక్కగా చూపించారు.

https://youtu.be/wXeuECKDFcI

4. దసరా నుంచి చమ్కీల అంగీలేసి
చమ్కీల అంగీలేసి ఓ వదినే
చాకు లెక్కుండేటోడే ఓ వదినే
కండ్లకు ఐనా బెట్టి
కత్తోలే కన్నెట్ల కొడ్తుండెనే.. అంటూ ధీ, రామ్ మిరియాల మెస్మరైజ్ చేశారు.

https://youtu.be/9O-mBYAqM1c

5. మల్లేశం నుంచి ఓహో జంబియా
ఓహో జాంబియా ఓలంపల్లి జాంబియా
ఓహో జాంబియా ఓలంపల్లి జాంబియా
నాతోని మాట్లాడు నాంపల్లీ జాంబియా
నాతోని మాట్లాడు నాంపల్లీ జాంబియా.. అంటూ తెలంగాణలో జరిగే ఉర్సు లేదా సవారీ పండుగల నేపథ్యాలను చక్కగా చూపించారు.

https://youtu.be/tLcz5fyi3ik

6. ఫిదా నుంచి వచ్చిండే
వొచ్చిండె మెల్లా మెల్లగ వొచ్చిండె 
క్రీము బిస్కెటు ఏసిండె
గమ్ముగ కూసోనియ్యాడె కుదురుగ నిల్సోనియ్యాడె.. అంటూ వచ్చిన ఈ పాట ఇప్పటికీ పలు గ్రామాల్లో ఎక్కడో ఓ చోట వినిపిస్తూనే ఉంటుంది.

https://youtu.be/YFfEFbC9_XQ

7. ఎర్ర సైన్యం నుంచి ఊరు మనదిరా
ఊరు మనదిరా ఈ వాడ మనదిరా .. అంటూ ఆ రోజుల్లో విప్లవ గీతాన్ని వినిపించి, ఇప్పటికీ చైతన్య గీతంగా నిలుస్తోంది.

https://youtu.be/sbMDzPAAyBM

8. వీర తెలంగాణ నుంచి బండెనక బండి కట్టి
బండెనుక బండి గట్టి..
పదహారు బండ్లు గట్టి..
ఏ బండ్లే బోతవ్ కొడుకో..
నైజాము సర్కరోడా.. అంటూ నైజాంల అవినీతిని ప్రశ్నించేలా, తెలంగాణలో ఆనాటి పరిస్థితులను ఈ పాటలో చక్కగా వర్ణించారు.

https://youtu.be/6nyXSqfa8xI

9. జై బోలో తెలంగాణ నుంచి పొడుస్తున్న పొద్దు మీద
పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా
పోరు తెలంగాణమా.. ఈ సాంగ్ వింటే తెలంగాణ ఉద్యమ కాలంలో ఎదుర్కొన్న పరిస్థితులు ఇప్పటికీ సాక్ష్యాలుగా కనిపిస్తాయి.

https://youtu.be/Bn5XMi8HfrE

10. లవ్ స్టోరీ నుంచి సారగ ధరియా
దాని కుడీ భుజం మీద కడవా.. దాని గుత్తెపు రైకలు మెరియా... తెలంగాణలోని ఓ ప్రాంతానికి చెందిన యాస, భాషను స్పష్టంగా చూపించారు.

https://youtu.be/1ozmyl1ZEyY

11. మొండి మొగుడు పెంకి పెళ్లాం నుంచి లాలూ దర్వాజ
లలూ దర్వాజ లస్కర్ బోనాల్ పండగకస్తనని రాకపోతివి
లకిడీకాపూల్ పోరికి లబ్బర్ గాజుల్ తెస్తని తేకపోతివి.. ఈ పాట ఇప్పటికీ పాపులర్ లిస్ట్ లోనే ఉంటుంది. ఇందులోనూ తెలంగాణ యాసతో సాంగ్ ను మొత్తం నడిపించారు.

https://youtu.be/KsKBGsX8m9U

12. బంఫర్ ఆఫర్ నుంచి రవనమ్మ
ఎందుకె రవణమ్మా
పెళ్లేందుకే రవణమ్మా.. అంటూ అచ్చమైన తెలంగాణలో ఓ కొడుకు, తల్లితో సంభాషించే ఫన్నీ కాన్వర్జేషన్ ను పాట ద్వారా చక్కగా వ్యక్తం చేశారు.

https://youtu.be/quu8YZ1hw5Q

13. జాతి రత్నాలు నుంచి మన జాతి రత్నాలు
సూ… సూడు హీరోలు
ఒట్టి బుడ్డర ఖానులు… వాల్యూ లేని వజ్రాలు
మన జాతి రత్నాలు.. అంటూ అచ్చమైన తెలంగా భాషను ఉపయోగిస్తూ.. సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పాడగా.. కాసర్ల శ్యాం లిరిక్స్ రాశారు.

https://youtu.be/oyHasipretM

14. డీజే టిల్లు నుంచి టిల్లు అన్న
లాలగూడ అంబరుపేట
మల్లేపల్లి మలక్ పేట
టిల్లు అన్న డీజే పెడితే
టిల్ల టిల్ల ఆడాలా.. అంటూ రీసెంట్ డేస్ లో బిగ్గెస్ట్ హిట్ జాబితాలో నిలిచిన ఈ పాట.. ఇప్పటికీ ట్రెండింగ్ లో నిలుస్తోంది.

https://youtu.be/I8c0-NEBqL0

15. సీటీమార్ నుంచి జ్వాలా రెడ్డి
జ్వాలారెడ్డి జ్వాలారెడ్డి
తెలంగాణ బిడ్డరో కారా బూందీ లడ్డురో.. మంగ్లీ తన గాత్రంతో తెలంగాణతో పాటు.. అన్ని ప్రాంతాల వారినీ ఆకట్టుకున్నారు.

https://youtu.be/Oa_74dYLOPE

16. అల వైకుంఠపురములో నుంచి రాములో రాములా
రాములో రాములా
నన్ను ఆగం చేసిందిరో.. అంటూ తెలంగాణ స్టైల్లో వచ్చిన ఈ పాట.. హీరో బన్నీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్స్ ఆఫ్ బన్నీ సాంగ్స్ లిస్ట్ లో చేరిపోయింది.

https://youtu.be/Bg8Yb9zGYyA

17. సవారీ నుంచి నీ కన్నులు
నీ కన్నులు నా దిల్లులో నాటుకున్నయే .. అంటూ వచ్చిన ఈ పాట.. సవారీ సినిమాలోనిది. మూవీ అంతటా హిట్ కాకపోయినా పాట మాత్రం అందర్నీ చిందులేయించింది.

https://youtu.be/zU8TWtSU0uE

18. లై నుంచి బొంబాట్
బొమ్మోలే ఉన్నదిరా పోరీ... ఈ సాంగ్ ను రాహుల్ సిప్లిగంజ్, రమ్మ బెహరా పాడారు.

https://youtu.be/0fS9yi_h5bc

19. ఇస్మార్ట్ శంకర్ నుంచి బోనాలు
నీ ముక్కు పోగు మెరుపొలోన
పొద్దు పొడిసే తూరుప్పోలన
మైసమ్మ.. పూరీ డైరెక్షన్ లో పూర్తి తెలంగాణ యాసలో వచ్చిన ఈ సినిమాలోని ఈ పాట.. బోనాల పండగకు తెలంగాణలో ఉండే సందడిని ప్రత్యక్షంగా చూపించింది.

https://youtu.be/IB26C2Dc-Xg

20. ధమాకా నుంచి జింతాక్
నిన్ను చూడబుద్దయితాంది రాజిగో
మాటాడా బుద్దయితాంది రాజిగో
జింతాక్ జింతాక్ జింతాక్ జజ్జన
జింతాక్ జింతాక్ జింతాక్.. అంటూ మాస్ మహారాజ్ రవితేజ, శ్రీలీల తమ మాస్ స్టెప్పులతో మెస్మరైజ్ చేశారు. 

https://youtu.be/Hiiae2lRw9U

ఇలా చెప్పుకుంటూ పోతే ఇరవయ్యే కాదు.. చాలా పాటలు ఇప్పటికీ తెలంగాణలోని పల్లెలను, బతుకు దెరువును, పండుగలను, విశిష్టతను చాటుతున్నాయి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
TG Group 3 Exam: తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Kanguva Twitter Review: కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
Matka Twitter Review: 'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్వికారాబాద్ వివాదంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ట్రోఫీ మ్యాచ్‌లపై ఐసీసీకి లెటర్ రాసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్పెద్దపల్లిలో అదుపు తప్పిన గూడ్స్, 11 బోగీలు బోల్తా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
TG Group 3 Exam: తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Kanguva Twitter Review: కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
Matka Twitter Review: 'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
Sri Reddy Open Letter: మా అమ్మానాన్న టీడీపీకే ఓటు వేశారు, క్షమించి వదిలేయండి- లోకేష్‌, జగన్‌కు శ్రీరెడ్డి ఓపెన్ లెటర్
మా అమ్మానాన్న టీడీపీకే ఓటు వేశారు, క్షమించి వదిలేయండి- లోకేష్‌, జగన్‌కు శ్రీరెడ్డి ఓపెన్ లెటర్
Matka: అల్లు అర్జున్ మల్టీప్లెక్స్‌లో వరుణ్ తేజ్ 'మట్కా' షోస్ క్యాన్సిల్ - అసలు కారణం అదేనా?
అల్లు అర్జున్ మల్టీప్లెక్స్‌లో వరుణ్ తేజ్ 'మట్కా' షోస్ క్యాన్సిల్ - అసలు కారణం అదేనా?
Which OTT Platform Has Basic Instinct: మర్డర్లు చేస్తూ నవలలు రాసే హీరోయిన్- డిటెక్టివ్‌ ప్రేమ - బోల్డ్ సీన్లతో మతిపోగొట్టే బేసిక్ ఇన్‌స్టింక్ట్‌
మర్డర్లు చేస్తూ నవలలు రాసే హీరోయిన్- డిటెక్టివ్‌ ప్రేమ - బోల్డ్ సీన్లతో మతిపోగొట్టే బేసిక్ ఇన్‌స్టింక్ట్‌
Andhra News: అమరావతిలోనే లోకాయుక్త కమిషన్‌, హెచ్‌ఆర్‌సీ: హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం
అమరావతిలోనే లోకాయుక్త కమిషన్‌, హెచ్‌ఆర్‌సీ: హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం
Embed widget