Hyderabad News: డిసెంబర్ 31న హైదరాబాదీలకు గ్రేప్స్ ఫాంటసీ- రొమాన్స్ కోసం కాదు సెంటిమెంట్ మేటర్
Hyderabad News: ద్రాక్ష పండ్లు తింటే అదృష్టం కలిసి వస్తుందా? లేకుంటే ఇంకా ఏమైనా కారణం ఉందా? డిసెంబర్ 31న ఎందుకు అంతలా గ్రేప్స్ కోసం ఆర్డర్ చేసినట్టు?
Hyderabad News డిసెంబర్ 31న తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో ద్రాక్ష పండ్లు, కండోమ్స్, కళ్లగంతలు, సంకేళ్లు భారీగా అమ్ముడయ్యాయి. అయితే మిగతావి ఓకే కానీ ద్రాక్ష పళ్లు ఎందుకు అంతలా అమ్ముడయ్యాయనే ఆరా తీస్తే చాలా ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ద్రాక్ష పండ్లు ఆర్డర్ ఇవ్వడంలో కథ వేరే ఉందని చెబుతున్నారు.
డిసెంబర్ 31 అర్థరాత్రి డేట్ మారిన తర్వాత ఒక నిమిషంలో 12 ద్రాక్ష పండ్లు తింటే అదృష్టం కలిసి వస్తుందని ఓ ప్రచారం ఉంది. అందుకే ఈ స్థాయిలో ద్రాక్ష పండ్లను ఆర్డర్ చేసినట్టు వెలుగులోకి వస్తోంది. ఈ విషయాన్ని అమెరికన్ టీవీ సీరియల్ మాడ్రోన్ ఫ్యామిలీలో చూసి తెలుసుకున్న జనం ఈ ఏడాది భారీగా గ్రేప్స్ ఆర్డర్ ఇచ్చారు.
ఇలా సంవత్సరం, డేట్ మారిన తర్వాత ఒక్క నిమిషంలో ఈ 12 ద్రాక్ష పండ్లను తినేయాలి. గడియారం 12:01కి మారకముందే 12 ద్రాక్షలను ఒక్కొక్కటిగా తినాలి. సంవత్సరంలో ఉండే నెలలు చొప్పున ద్రాక్షలను తీనాల్సి ఉంటుంది. ఇలా చేస్తే ఏడాది మొత్తం అదృష్టం కలిసి వస్తుందని వారి నమ్మకం.
స్పెయిన్ దేశస్థులు ఈ సంప్రదాయం కోసం ఎక్కవ ఆకుపచ్చ ద్రాక్షను వినియోగిస్తుంటారు. ఇలా చేయడం వల్ల బ్యాచిలర్ జీవితాలకు త్వరలోనే శుభం కార్డు పడబోతుందని త్వరగా పెళ్లి అవుతుందని వారి నమ్మకం. ఇలాంటి నమ్మకాలను వ్యాప్తి చేసేలా సోషల్ మీడియాలో కూడా రకరకాల పోస్టులు ఉంటున్నాయి.
ఈ సీజన్‌లో స్పెయిన్‌లో ద్రాక్ష పంట చాలా ఎక్కువగా ఉంటుంది. గతంలో ఈ స్థాయిలో ఎగుమతి సౌకర్యాలు ఉండేవి కావు. పండిన పంట త్వరగా చెడిపోయే ప్రమాదం ఉంది. అలాంటి పంటను సేల్ చేసేందుకు ఇలాంటి 12 ద్రాక్ష పండ్ల సెంటిమెంట్‌ను ప్రచారంలోకి తీసుకొచ్చారనే వాదన కూడా ఉంది.
ఇలా 12 ద్రాక్ష పండ్లను ఎక్కడ పడితే అక్కడ తింటే సరిపోదట. కేవలం టేబుల్ కింద కూర్చొని తినాలని మరికొందరు చెబుతున్నారు. ఇలా చేయడంలో ప్రేమ దొరుకుతుందని జీవితంలో ఆనందం వెల్లివిరిస్తుందని ఓ నమ్మకం. వీటికి ఎలాంటి శాస్త్రియ ఆధారాలు లేకపోయిన రకరకాల కథనాలు మాత్రం సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి.
Also Read: న్యూ ఇయర్ సందర్భంగా అమాంతం పెరిగిన కండోమ్ ఆర్డర్స్, ఇండియన్స్ ఇంకా ఏమేం కొన్నారంటే!