Game Changer : ‘గేమ్ ఛేంజర్’కు షాకిచ్చిన తెలంగాణ ప్రభుత్వం.. స్పెషల్ షో, టికెట్ ధరల పెంపు రద్దు చేస్తు ఉత్తర్వులు
Game Changer : రామ్ చరణ్ హీరోగా దర్శకుడు శంకర్ తెరకెక్కించిన గేమ్ ఛేంజర్ చిత్ర బృందం విజ్ఞప్తి మేరకు సినిమా టికెట్ ధరల పెంపునకు తెలంగాణ సర్కార్ అనుమతి ఇచ్చింది.

Game Changer : మెగా అభిమానులకు సంక్రాంతి సంబరాలు జనవరి 10నాటి నుంచే మొదలయ్యాయి. నిన్న 'గేమ్ ఛేంజర్' మూవీతో ఈ సంబరాలు స్టార్ట్ అయ్యాయి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన పాన్ ఇండియా పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ 'గేమ్ ఛేంజర్' థియేటర్లలోకి వచ్చేసింది. ఊహించినట్టుగానే ఈ సినిమాకు భారీ కలెక్షన్లు వచ్చాయి. మొదటి రోజు ఈ సినిమా ఊహించిన విధంగానే మంచి ఓపెనింగ్ రాబట్టింది.
విడుదలైన ఒక రోజుకే తెలంగాణ ప్రభుత్వం ఈ మూవీకి షాక్ ఇచ్చింది. ‘గేమ్ ఛేంజర్’ టికెట్ ధరల పెంపు ఉత్తర్వులు తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఉపసంహరించుకుంది. టికెట్ ధరల పెంపు విషయంలో ఈ గేమ్ ఛేంజర్ సినిమాకు ఇచ్చిన వెసులుబాటును ఉపసంహరించుకుంటున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు ‘గేమ్ ఛేంజర్’ టికెట్ ధరలు, అదనపు షోలకు ఇచ్చిన అనుమతిని ప్రభుత్వం ఉపసంహరించుకుంది. తెలంగాణలో ఇక నుంచి తెల్లవారుజామున స్పెషల్ షోలకు అనుమతి లేదని ప్రభుత్వం తన ఉత్తర్వుల ద్వారా తెలిపింది. ప్రజల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా సినిమాల స్పెషల్ షోలకు అనుమతి ఇవ్వబోమని ఉత్తర్వుల్లో పేర్కొంది.
రామ్ చరణ్ హీరోగా దర్శకుడు శంకర్ తెరకెక్కించిన గేమ్ ఛేంజర్ చిత్ర బృందం విజ్ఞప్తి మేరకు సినిమా టికెట్ ధరల పెంపునకు తెలంగాణ సర్కార్ అనుమతి ఇచ్చింది. సినిమా విడుదల రోజు (శుక్రవారం) ఉదయం 4 గంటల నుంచి 6 షోలకు పర్మిషన్ ఇచ్చింది. రిలీజ్ రోజు సింగిల్ స్క్రీన్స్‌లో అదనంగా రూ.100, మల్టీప్లెక్సుల్లో రూ.150 రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. అలాగే జనవరి 11 నుంచి 19 వరకు 5 షోలకు సింగిల్ స్క్రీన్స్‌లో రూ.50, మల్టీప్లెక్సుల్లో రూ.100 పెంచుకునేందుకు వెసులు బాటు కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ ఉత్తర్వులను తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది.
గేమ్ ఛేంజర్ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ జంటగా నటించారు. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందించగా.. అంజలి, ఎస్జే సూర్య తదితరులు కీలకపాత్రలు పోషించారు. 'ఆర్ఆర్ఆర్', ఆచార్య సినిమాల తర్వాత రామ్ చరణ్ చేసిన సోలో మూవీ ఇదే కావడంతో భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చింది. అయితే మొదటి రోజు ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్లు మాత్రం అదిరిపోయాయి. మొదటి రోజు 'గేమ్ ఛేంజర్' మూవీ ప్రపంచవ్యాప్తంగా 186 గ్రాస్ వసూలు చేసి సంచలనం సృష్టించింది. 223 కోట్ల షేర్ వసూలు చేస్తే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అవుతుంది. ఇక ఈ శని, ఆదివారాలు వీకెండ్ కావడంతో మరింతగా కలెక్షన్లు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 'గేమ్ ఛేంజర్' మూవీలో రామ్ చరణ్ డ్యూయెల్ రోల్ లో అదరగొట్టాడు. ఈ పొలిటికల్ డ్రామాలో అప్పన్నగా ఆయన నటన అద్భుతం అంటూ అభిమానులు ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో ఎస్జె సూర్య పాత్ర కూడా బాగా పండింది. ఇంకా అంజలి నటన కూడా సినిమాకు హైలెట్గా నిలిచింది. ఈ పొలిటికల్ కమర్షియల్ మూవీలో రామ్ చరణ్ అభిమానులు ఆశించే అన్నీ అంశాలు ఉన్నాయి అంటున్నారు క్రిటిక్స్.
Also Read : Game Changer Review - 'గేమ్ చేంజర్' రివ్యూ: పవన్ 'జనసేన'కు ప్లస్సే - రామ్ చరణ్, శంకర్ సినిమా ఎలా ఉందంటే?





















