By: ABP Desam | Updated at : 20 Aug 2022 01:08 PM (IST)
Image Credit:
నటి, ‘బిగ్ బాస్’ బ్యూటీ తేజస్వి మదివాడ నటించిన తాజా మూవీ ‘కమిట్‌మెంట్’. లక్ష్మీ కాంత్ చెన్న దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తాజాగా(ఆగస్టు 19న) విడుదలైంది. ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ లో తేజస్వి బిజీ బిజీగా గడుపుతోంది. ఈ సందర్భగా ఆమె కొన్ని షాకింగ్ విషయాలను వెల్లడించింది. సినిమా పరిశ్రమలో తాను ఎదుర్కొన్న అత్యంత బాధాకరమైన సంఘటనల గురించి చెప్పింది. కాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇంతకీ తనకు ఎదురైన ఆ ఇబ్బందులు ఏమిటీ?
సినిమా పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో తానొక ఈవెంట్ కు వెళ్లినట్లు తేజస్వి చెప్పింది. అప్పుడు సుమారు 30 మంది బాగా తాగి వచ్చి రాత్రి సమయంలో తనపై దాడి చేశారని పేర్కొంది. వారి నుంచి ఎలాగోలా బయటపడి ఇంటికి వెళ్లినని తెలిపింది. జరిగిన ఘటన గురించి తలచుకుని ఇంట్లో వెక్కివెక్కి ఏడ్చానన్నది. సినిమా పరిశ్రమలో సందు దొరికితే అమ్మాయిలను వాడుకునేందుకు కొంతమంది చూస్తారని చెప్పింది. అలా తననూ చాలా మంది ‘కమిట్‌మెంట్’ అడిగారన్నది. ఈ విషయాన్ని కొంత మంది ఫోన్ చేసి అడిగేవారని.. మరికొంత మంది నేరుగానే అడిగేవారని చెప్పింది.
చాలా మంది సినిమా పరిశ్రమలోనే కమిట్‌మెంట్ అనేది ఉంటుదని భావిస్తారని.. అందులో వాస్తవం లేదని చెప్పింది. ప్రతి రంగంలోనూ కమిట్‌మెంట్ల కథలుంటాయన్నది. సినిమా పరిశ్రమలో కమిట్‌మెంట్లకు ఓకే అంటేనే అవకాశాలు ఇస్తారని వెల్లడించింది. ఇండస్ట్రీలో 90 శాతం కాస్టింగ్ కౌచ్ కొనసాగుతుందని చెప్పింది. కొత్తగా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టేవారిని కమిట్‌మెంట్ పేరుతో లైంగికంగా వాడుకుంటున్నారని చెప్పింది. వాస్తవానికి ఇండస్ట్రీలో అడవారిని సెక్సువల్ అవసరాల కోసం వాడుకునే వారు చాలా మంది ఉన్నట్లు చెప్పింది. వాళ్లను దాటుకుని ముందుకు వెళ్తేనే అసలు సినిమా వాళ్లు కనిపిస్తారన్నది.
తెలుగు హీరోయిన్లలా ముంబై హీరోయిన్లు ఉండరని.. వారు అన్నింటికీ రెడీ అయ్యే ఇండస్ట్రీలోకి వస్తారని చెప్పింది. అందుకే.. తెలుగు వారికంటే.. ముంబై వాళ్లకే ఎక్కువ అవకాశాలు వస్తున్నట్లు వెల్లడించింది. వారి మూలంగా తెలుగు వారికి అవకాశాలు దొరక్క పోగా.. క్యాస్టింగ్ కౌచ్ బారినపడుతున్నట్లు సంచలన వ్యాఖ్యాలు చేసింది. సినిమా పరిశ్రమలో తనకు తెలిసిన చాలా మంది తెలుగు హీరోయిన్లు లైంగిక వేధింపులకు గురైన వాళ్లే ఉన్నారన్నది. అయితే చాలా మంది ఈ విషయాలను బయటకు చెప్పలేకపోతున్నట్లు వెల్లడించింది. అలా చెప్తే పరువుపోవడంతో పాటు సినిమా అవకాశాలు రావేమోననే భయం వారిని వెంటాడుతున్నట్లు చెప్పింది. అటు తాను కూడా గతంలో ఓ అబ్బాయితో డేటింగ్ చేసినట్లు తేజస్వి వెల్లడించింది. కొన్నికారణాలతో తనతో విడిపోయినట్లు చెప్పింది.
ఇక తన తాజా మూవీ ‘కమిట్‌మెంట్’ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుందని తేజస్వి చెప్పింది. ఈ సినిమాలో తేజస్వితో పాటు పాటు అన్వేషి జైన్, సీమర్ సింగ్, తనిష్క్ రాజన్, అమిత్ తివారి, సూర్య శ్రీనివాస్, అభయ్ సింహా రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించారు.
Also Read : తీస్ మార్ ఖాన్ రివ్యూ : రేసుగుర్రంలా దూసుకు వెళ్ళాలనుకున్న ఆది సాయి కుమార్, సినిమా ఎలా ఉందంటే?
Priyanka Nalkari Wedding: గుడిలో రహస్య వివాహం చేసుకున్న ప్రియాంక నల్కారి, వరుడు ఎవరో తెలుసా?
ఆ సామాన్యుల చేతిలో ఆస్కార్ - పట్టరాని ఆనందంలో ‘ఎలిఫ్యాంట్ విష్పర్స్’ జంట
అలా చేయనన్నానని హీరోయిన్ పాత్ర నుంచి తొలగించారు: నటి సన
Mohan Babu on Manoj: కుక్కలు మొరుగుతూనే ఉంటాయి పట్టించుకోను - మనోజ్ రెండో పెళ్లిపై మోహన్ బాబు రియాక్షన్
Ravi Teja Brother Raghu Son : యూత్‌ఫుల్ సినిమాతో హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు
పేపర్ లీక్ పై తప్పుడు ఆరోపణలు - బండి సంజయ్, రేవంత్ రెడ్డికి కేటీఆర్ లీగల్ నోటీసులు
CM Jagan On Polavaram : పోలవరం ప్రాజెక్టును 45.7 మీటర్ల ఎత్తు వరకు నిర్మిస్తాం, అసెంబ్లీలో సీఎం జగన్ క్లారిటీ
Kavitha Supreme Court : ఈడీపై కవిత పిటిషన్‌పై విచారణ తేదీ మార్పు - మళ్లీ ఎప్పుడంటే ?
Hindenburg Research: అదానీ తర్వాత హిండెన్‌బర్గ్ టార్గెట్ చేసిన కంపెనీ ఇదే! వెంటనే 19% డౌనైన షేర్లు