అన్వేషించండి

Por Thozhi: ఓటీటీలోకి తమిళ్ బ్లాక్ బస్టర్ మూవీ ‘పోర్ థోజిల్’ - తెలుగులోనూ స్ట్రీమింగ్, ఎక్కడంటే..

తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది ‘పోర్ థోజిల్’ సినిమా. క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన ఈ మూవీ తమిళ్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. తెలుగులో కూడా..

Por Thozhi: తమిళ్ దర్శకుడు విఘ్నేష్ రాజా దర్శకత్వంలో వచ్చిన మూవీ ‘పోర్ థోజిల్’. ఈ సినిమాలో శరత్ కుమార్, అశోక్ సెల్వన్ లీడ్ రోల్స్ లో నటించారు. నిఖిలా విమల్ కూడా ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ తమిళ్ లో జూన్ 9 న విడుదల అయింది. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ అక్కడ భారీ సక్సెస్ ను అందుకుంది. క్రైమ్ థ్రిల్లర్ కథను కొత్తగా చూపించడంతో మూవీను ప్రేక్షకులు ఆదరించారు. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి రానుంది. 

సినిమా కథేంటంటే..

ఓటీటీలు వచ్చిన తర్వాత ముఖ్యంగా కరోనా తర్వాత డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ లో క్రైమ్, థ్రిల్లర్ సినిమాలకు క్రేజ్ బాగా పెరిగింది. తాజాగా తమిళ్ లో భారీ హిట్ అందుకున్న క్రైమ్ థ్రిల్లర్ సినిమా ‘పోర్ థోజిల్’ సినిమా ఓటీటీలోకి విడుదల కానుంది. ఈ మేరకు మేకర్స్ ఓ అధికారిక ప్రకటన చేశారు. ఈ సినిమా కథ మొత్తం ఒక సీరియల్ మర్డర్ కేసు చుట్టూ తిరుగుతుంది. శరత్ కుమార్ ఎస్పీగా అశోక్ సెల్వన్ డిఎస్పీగా కనిపిస్తారు. సినిమా ఒక హత్య కేసు ఇన్వెస్టిగేషన్ తో ప్రారంభం అవుతుంది.  అయితే అలాంటి హత్యలు అదే పోలికలతో వరుసగా జరగుతూ ఉండటంతో దీని వెనక సైకో కిల్లర్ ఉన్నాడని భావిస్తారు. అక్కడ నుంచి సినిమా కథ మలుపు తిరుగుతుంది. మూవీ స్టోరీ, స్కీన్ ప్లే ను చాలా చక్కగా తీర్చిదిద్దారు దర్శకుడు. ప్రతీ సీన్ కూడా ఎంతో ఆసక్తికరంగా సాగుతుంది. అదే సస్పెన్స్ మూవీ చివరి వరకూ కొనసాగుతోంది. ఈ మూవీ సాధారణ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుంది. అందుకే ఈ మూవీను తమిళ ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. 

బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు..

క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు తీయడం అంత ఈజీ ఏమ్ కాదు. చెప్పాలనుకున్న విషయంలో ఏమాత్రం తడబడినా ప్రేక్షకులకు చివరి వరకూ సస్పెన్స్ లో ఉంచకపోయినా మూవీ రిజల్ట్ గాడి తప్పుతుంది. ‘పోర్ థోజిల్’ సినిమా విషయంలో దర్శకుడు విఘ్నేష్ రాజా వాటన్నిటినీ చక్కగా బ్యాలెన్స్ చేశాడు. అందుకే ఈ సినిమా రెగ్యులర్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లా కాకుండా కొత్తగా కనిపిస్తుంది. అందుకే ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. జూన్ 9 న థియేటర్లలో విడుదల అయిన ఈ సినిమా ఓవరాల్ గా సుమారు రూ.50 కోట్లకు పైగానే వసూళ్లు సాధించి రికార్డు సృష్టించింది. 

వివిధ భాషల్లో అందుబాటులోకి..

ఈ మధ్య కాలంలో సినిమాల మధ్యలో భాషాబేధాలు బాగా తగ్గిపోయాయి. ఏదైనా సినిమా బాగుంటే ఇతర భాషల్లో ఉన్నా కూడా ప్రేక్షకులు చూడటానికి ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా ఓటీటీ ప్రేక్షకులు. అందుకే మేకర్స్ కూడా హిట్ అయిన సినిమాలను ఇతర భాషల్లోకి కూడా విడుదల చేస్తున్నారు. ఇప్పుడీ ‘పోర్ థోజిల్’ సినిమాను కూడా ఓటీటీలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇక ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లీవ్ లో ఆగస్టు 11 నుంచి ఈ మూవీ అందుబాటులో ఉండనుంది. 

Also Read: ‘కొటేషన్ గ్యాంగ్’ ట్రైలర్ - ‘దండుపాళ్యం’ గ్యాంగ్‌‌ను మించిపోయిన ప్రియమణి, సన్నీలియోన్ ముఠా

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Tiktok: అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Kolam Adivasi Agitation in Adilabad | కోలాం ఆదివాసీల మహాధర్నా..వాళ్ల ఆగ్రహానికి కారణాలేంటీ.? | ABP DesamPushpa 2 Overall Collections Day 11 | రాజమౌళిని కొట్టేటోడు కూడా తెలుగోడే..సుకుమార్ | ABP Desamఅద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Tiktok: అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
Pushpa 2 Collections: రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
Group 2 Exam: గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
Rolls Royce: కారుకు కాదు నంబర్‌కు రూ.76 కోట్లు - ఖర్చు పెట్టింది ఎవరో తెలుసా?
కారుకు కాదు నంబర్‌కు రూ.76 కోట్లు - ఖర్చు పెట్టింది ఎవరో తెలుసా?
Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
Embed widget