News
News
X

Tamannaah: మిల్కీబ్యూటీ మలయాళీ డెబ్యూ - వివాదాస్పద హీరోతో రొమాన్స్!

తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించిన తమన్నా ఇప్పుడు మలయాళంలో నటించడానికి రెడీ అవుతోంది.

FOLLOW US: 

తమన్నా భాటియా(Tamannaah Bhatia).. సౌత్ టు నార్త్ పరిచయం అవసరం లేదని ముద్దుగుమ్మ. అందం, అభినయంతో కలబోసిన అమ్మడు.. హిందీ సినిమాతో వెండి తెరకు పరిచయం అయినా.. తెలుగులో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయమై.. 15 ఏళ్ళు గడుస్తున్నా.. ఇప్పటికీ ఏమాత్రం క్రేజ్ తగ్గకుండా ముందుకు దూసుకెళ్తోంది. టాలీవుడ్ లోకి అడుగు పెట్టినప్పుడు ఎంత గ్లామర్ గా ఉందో.. ఇప్పటికీ అలాగే ఉంది. 

తన కెరీర్ లో 50కి పైగా సినిమాల్లో న‌టించింది త‌మ‌న్నా. తెలుగుతో పాటు త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ సినిమాల్లోనూ న‌టిస్తూ తన సత్తాను చాటుతోంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించిన ఆమె ఇప్పుడు మలయాళంలో నటించడానికి రెడీ అవుతోంది. ఒకప్పటితో పోలిస్తే తమన్నాకు స్టార్ డమ్ కాస్త తగ్గింది. స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు కూడా రావడం లేదు. ఈ క్రమంలో తన రెమ్యునరేషన్ తగ్గించుకున్నట్లు సమాచారం. 

అలానే హీరోయిన్ ఎలాంటి అవకాశం వస్తున్నా.. వదులుకోవడం లేదు. ఈ క్రమంలో మలయాళ వివాదాస్పద నటుడు దిలీప్ తో కలిసి నటించడానికి అంగీకరించింది. మలయాళీ సినిమాలకు ఇప్పుడు మంచి మార్కెట్ ఉంది. గతంతో పోలిస్తే అక్కడ రెమ్యునరేషన్స్ కూడా బాగానే పెరిగాయి. అయితే నటుడిగా దిలీప్ క్రేజ్ తగ్గింది. అతడిపై చాలా ఆరోపణలు ఉన్నాయి. వివాదాలు, జైలు జీవితంతో దిలీప్ స్థాయి బాగా తగ్గింది. 

ఒకప్పుడు స్టార్ హీరోనే అయినప్పటికీ.. ఇప్పుడు మాత్రం దిలీప్ కి పెద్దగా ఫాలోయింగ్ లేదు. ప్రేక్షకులు కూడా ఆయన సినిమాలను చూడడానికి ఆసక్తిగా అయితే లేరు. కేరళ దాటితే అతడిని పట్టించుకునేవారు కూడా లేరు. మార్కెట్ రేంజ్ చాలా తక్కువ. అయినప్పటికీ.. తమన్నా ఇలాంటి సినిమా చేయడానికి అంగీకరించడం ఆశ్చర్యంగా ఉంది. కొన్ని రోజుల్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. 

News Reels

'పుష్ప2'లో తమన్నా:

'పుష్ప2' సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తోందని వార్తలొచ్చాయి. ఫస్ట్ పార్ట్ లో సమంతను ఐటెం సాంగ్ కోసం తీసుకున్నట్లు.. ఈసారి తమన్నాను తీసుకోవాలని భావిస్తున్నారు. సమంత కేవలం ఒక్క పాటలో మాత్రమే కనిపించింది. కానీ తమన్నాకి సినిమాలో రోల్ ఉంటుందట. కథ ప్రకారం.. ఆమె పుష్పరాజ్ సెకండ్ లవ్ ఇంట్రెస్ట్ గా కనిపించనుందట. నిజానికి పార్ట్ 1 ఎండింగ్ లో రష్మికతో పుష్పరాజ్ కి వివాహం జరుగుతుంది. సెకండ్ పార్ట్ లో తమన్నాపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు పుష్పరాజ్ పాత్ర ఉంటుందట. మరి దీనిలో ఎంతవరకు నిజముందో దర్శకుడు సుకుమార్ స్పందిస్తారేమో చూడాలి. 

తమన్నా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్:
ప్రస్తుతం తమన్నా నటించిన 'గుర్తుందా శీతాకాలం' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో సత్యదేవ్ హీరోగా నటించారు. ఈపాటికే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా పలుమార్లు వాయిదా పడింది. ఇది కాకుండా.. మెగాస్టార్ తో కలిసి 'భోళా శంకర్' అనే సినిమా ఒప్పుకుంది తమన్నా. దీన్ని మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులో చిరు చెల్లెలిగా కీర్తి సురేష్ కనిపించనుంది. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Also Read: బాలయ్య వర్సెస్ చిరు - అల్టిమేటం జారీ చేసిన డిస్ట్రిబ్యూటర్లు?

Published at : 28 Oct 2022 03:31 PM (IST) Tags: Tamannaah Tamannaah malayalam debut dileep

సంబంధిత కథనాలు

Pawan Kalyan : పవన్ ఫ్యాన్స్‌ను డిజప్పాయింట్ చేస్తున్న దర్శకుడు - 'గబ్బర్ సింగ్'కు ముందు సీన్ రిపీట్!?

Pawan Kalyan : పవన్ ఫ్యాన్స్‌ను డిజప్పాయింట్ చేస్తున్న దర్శకుడు - 'గబ్బర్ సింగ్'కు ముందు సీన్ రిపీట్!?

Panchathantram Trailer : బ్రహ్మానందం థీమ్ పంచేంద్రియాలు - వీల్ ఛైర్‌లో స్వాతి

Panchathantram Trailer : బ్రహ్మానందం థీమ్ పంచేంద్రియాలు - వీల్ ఛైర్‌లో స్వాతి

Gurtunda Seetakalam : తమన్నాతో సత్యదేవ్ సినిమా గుర్తుందిగా? విడుదలకు రెడీ!

Gurtunda Seetakalam : తమన్నాతో సత్యదేవ్ సినిమా గుర్తుందిగా? విడుదలకు రెడీ!

Bigg Boss 6 Telugu: వేదికపై ఫ్యామిలీ మెంబర్స్, పాత కంటెస్టెంట్లు, టీవీ సెలెబ్రిటీలు - ప్రోమో అదిరిపోయింది

Bigg Boss 6 Telugu: వేదికపై ఫ్యామిలీ మెంబర్స్, పాత కంటెస్టెంట్లు, టీవీ సెలెబ్రిటీలు - ప్రోమో అదిరిపోయింది

Avatar 2 Advance Bookings : హాట్ కేకుల్లా 'అవతార్ 2' టికెట్స్ - మూడు రోజుల్లో హాంఫట్!

Avatar 2 Advance Bookings : హాట్ కేకుల్లా 'అవతార్ 2' టికెట్స్ - మూడు రోజుల్లో హాంఫట్!

టాప్ స్టోరీస్

AP New CS : ఏపీ నూతన సీఎస్ గా మరోపేరు తెరపైకి, ఇవాళ ఫైనల్ అయ్యే అవకాశం!

AP New CS : ఏపీ నూతన సీఎస్ గా మరోపేరు తెరపైకి, ఇవాళ ఫైనల్ అయ్యే అవకాశం!

Etala Rajendar : పరిమితికి మించి అప్పులు చేసి కేంద్రంపై దుష్ప్రచారం - టీఆర్ఎస్ సర్కార్‌పై ఈటల ఫైర్ !

Etala Rajendar : పరిమితికి మించి అప్పులు చేసి కేంద్రంపై దుష్ప్రచారం - టీఆర్ఎస్ సర్కార్‌పై ఈటల ఫైర్ !

Baba Ramdev: నోరు జారిన రామ్‌ దేవ్ బాబా, మహిళల వస్త్రధారణపై వివాదాస్పద వ్యాఖ్యలు,

Baba Ramdev: నోరు జారిన రామ్‌ దేవ్ బాబా, మహిళల వస్త్రధారణపై వివాదాస్పద వ్యాఖ్యలు,

House Hacking: హైదరాబాద్‌లో ఇల్లు కొనేందుకు డబ్బుల్లేవా? హౌజ్‌ హ్యాకింగ్‌తో కల నిజం చేసుకోండి!

House Hacking: హైదరాబాద్‌లో ఇల్లు కొనేందుకు డబ్బుల్లేవా? హౌజ్‌ హ్యాకింగ్‌తో కల నిజం చేసుకోండి!