Pushpa The Rule: 'పుష్ప2'లో తమన్నా - ఒక్క ఐటెం సాంగ్ మాత్రమే కాదు!
పుష్ప సినిమా ఫస్ట్ పార్ట్ లో సమంతను ఐటెం సాంగ్ కోసం తీసుకున్నట్లు.. ఈసారి తమన్నాను తీసుకోవాలని భావిస్తున్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన 'పుష్ప ది రైజ్' సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఇంటర్నేషనల్ రేంజ్ లో ఈ సినిమాకి రీచ్ దక్కింది. సినిమాలో బన్నీ మేనరిజమ్స్ ని ఇమిటేట్ చేస్తూ కొన్ని లక్షల రీల్స్ వచ్చాయి. క్రికెట్ మ్యాచ్ లలో, కిక్ బాక్సింగ్ లో 'తగ్గేదేలే' అంటూ రచ్చ చేశారు సెలబ్రిటీలు. 'పుష్ప' ఇంత పెద్ద హిట్ అవుతుందని మేకర్స్ కూడా ఊహించి ఉండరు. ఆ రేంజ్ లో సక్సెస్ అయింది. ఇప్పుడు ఈ సినిమాకి కొనసాగింపుగా 'పుష్ప ది రూల్' రాబోతుంది.
అల్లు స్టూడియోస్ లో తొలి సినిమా షూటింగ్ గా 'పుష్ప2' మొదలుకాబోతుంది. ఆ తరువాత సినిమాలో ఎక్కువ భాగం అడవుల్లో చిత్రీకరించాల్సి ఉంటుంది. మరి ఈసారి మారేడుమిల్లి వెళ్తారో లేక ఇతర అడవి లొకేషన్స్ ఏమైనా చూస్తారో తెలియాల్సివుంది. విదేశాల్లో కూడా అటవీ లొకేషన్స్ చూస్తున్నారని టాక్. అయితే ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తోందని వార్తలొచ్చాయి.
ఫస్ట్ పార్ట్ లో సమంతను ఐటెం సాంగ్ కోసం తీసుకున్నట్లు.. ఈసారి తమన్నాను తీసుకోవాలని భావిస్తున్నారు. సమంత కేవలం ఒక్క పాటలో మాత్రమే కనిపించింది. కానీ తమన్నాకి సినిమాలో రోల్ ఉంటుందట. కథ ప్రకారం.. ఆమె పుష్పరాజ్ సెకండ్ లవ్ ఇంట్రెస్ట్ గా కనిపించనుందట. నిజానికి పార్ట్ 1 ఎండింగ్ లో రష్మికతో పుష్పరాజ్ కి వివాహం జరుగుతుంది. సెకండ్ పార్ట్ లో తమన్నాపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు పుష్పరాజ్ పాత్ర ఉంటుందట. మరి దీనిలో ఎంతవరకు నిజముందో దర్శకుడు సుకుమార్ స్పందిస్తారేమో చూడాలి.
బన్నీకి విలన్ గా పవర్‌ఫుల్ పొలిటీషియన్:
మొదటి పార్ట్ లో బన్నీకి సపోర్ట్ గా ఉండే ఎంపీ రోల్ లో రావు రమేష్ కనిపించారు. ఎర్రచందనం సిండికేట్ మొత్తాన్ని పుష్ప చేతిలో పెట్టి వెనుక ఉంటూ కథ నడిపిస్తారు. ఇప్పుడు పార్ట్ 2లో పుష్పను ఇబ్బంది పెట్టే ఓ పొలిటీషియన్ రోల్ ఉంటుందట. ఫహద్ ఫాజిల్ తో కలిసి సదరు పొలిటీషియన్ బన్నీతో ఫైట్ కి దిగుతాడట. ఆ పాత్రలో పేరున్న నటుడిని తీసుకోవాలనుకుంటున్నారు. దీనికోసం ఆదిపినిశెట్టి లాంటి స్టార్స్ ను పరిశీలిస్తున్నారు. గతంలో బన్నీ నటించిన 'సరైనోడు' సినిమాలో ఆది పినిశెట్టి విలన్ గా కనిపించారు. ఇప్పుడు మరోసారి ఆయనకు ఛాన్స్ వస్తుందేమో చూడాలి.
2023లో 'పుష్ప' రిలీజ్:
2023లో 'పుష్ప' పార్ట్ 2ని విడుదల చేయాలని భావిస్తున్నారు. అందుకే వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలుపెట్టాలని చూస్తున్నారు. నిజానికి పార్ట్ 1 సమయంలో పోస్ట్ ప్రొడక్షన్ కి ఎక్కువ సమయం దొరకలేదు. దీంతో ఆ ఎఫెక్ట్ సీజీ వర్క్ పై పడింది. సినిమాలో గ్రాఫిక్స్ సరిగ్గా లేదనే విమర్శలు వచ్చాయి. ఈసారి అలాంటి కామెంట్స్ కి తావివ్వకుండా త్వరగా షూటింగ్ పూర్తి చేసి.. గ్రాఫిక్స్ అండ్ మిగిలిన వర్క్ పై ఎక్కువ ఫోకస్ చేయాలని చూస్తున్నారు.
Also Read : 'క్రేజీ ఫెలో' రివ్యూ : ఆది సాయి కుమార్ సినిమా క్రేజీగా ఉందా? బోర్ కొట్టించిందా?