అన్వేషించండి

Tamannaah Interview : 'గుర్తుందా శీతాకాలం' ఇంటర్వ్యూలో పెళ్లి గురించి ఓపెన్ అయిన తమన్నా

సత్యదేవ్ (Satyadev) కు జోడీగా తమన్నా నటించిన సినిమా 'గుర్తుందా శీతాకాలం' (Gurthunda Seethakalam). శుక్రవారం సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా తమన్నా చెప్పిన సంగతులు... 

''రీమేక్ సినిమాలో నటించడం నాకు కొత్త కాదు. కానీ, ఒరిజినల్ సినిమాలో సోల్ మిస్ కాకూడదని ఛాలెంజ్‌గా తీసుకుని నటిస్తా. 'గుర్తుందా శీతాకాలం' విషయంలోనూ నాకు ఆ సవాల్ ఎదురైంది. ఆల్రెడీ ప్రేక్షకుల్లో కొందరు ఒరిజినల్ సినిమా చూసి ఉంటారు. వాళ్ళకు బోర్ కొట్టకుండా చేయడం చేయాలని నాకు నేను సవాల్ విసురుకున్నా'' అని పాన్ ఇండియా స్టార్ తమన్నా (Tamannaah) చెప్పారు. 

సత్యదేవ్ (Satyadev) కు జోడీగా తమన్నా నటించిన సినిమా 'గుర్తుందా శీతాకాలం' (Gurthunda Seethakalam). నాగ శేఖర్ దర్శకత్వం వహించారు. చినబాబు, ఎంఎస్ రెడ్డి సమర్పణలో చింతపల్లి రామారావు, భావన రవి, నాగ శేఖర్ సంయుక్తంగా నిర్మించారు. ఇందులో మేఘా ఆకాష్, కావ్యా శెట్టి ఇతర కథానాయికలు. ఈ శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా తమన్నా చెప్పిన సంగతులు... 

'గీతాంజలి'తో పోల్చడం సంతోషమే!
''మిగతా సినిమాలతో చూస్తే ప్రేమకథల్లో నటించి ప్రేక్షకులను మెప్పించడం కొంచెం కష్టమే. 'గుర్తుందా శీతాకాలం'లో క్యారెక్టర్, ఆ భావోద్వేగాలు అందరినీ ఆకట్టుకుంటాయి. సినిమాల మధ్య పోలికలు రావడం సహజమే. ప్రేమకథలో చాలా పోలికలు ఉంటాయి. అయితే... ప్రతి దాంట్లో ఏదో కొత్త పాయింట్ ఉంటుంది. ఈ సినిమాలో కూడా కొత్త ఎమోషన్స్, కొత్త పాయింట్ చెబుతున్నాం. సత్యదేవ్‌తో నటించడం సంతోషంగా ఉంది. 'ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య'లో అతడి నటన సహజంగా అనిపించింది. అతడితో సినిమా చేయాలనే ఆసక్తి కలిగింది. ఆ తర్వాత ఈ సినిమా అవకాశం రావడంతో ఓకే చెప్పేశా. నా ఆశ తీరింది. మేం ఇద్దరం కలసి మంచి ఎమోషనల్ ఫిల్మ్ చేసే అవకాశం దొరికింది. దర్శకుడు నాగ శేఖర్ నటులు కావడంతో ప్రతి సన్నివేశాన్ని బాగా వివరించారు. అందువల్ల, మా పని ఈజీ అయ్యింది. తొలిసారి నేను యాక్టర్ అండ్ డైరెక్టర్‌తో వర్క్ చేశా. '' అని తమన్నా చెప్పారు. తమ సినిమాను 'గీతాంజలి'తో పోల్చడం సంతోషంగా ఉందని, ఆ అంచనాలను తాము ఆదుకుంటామని తమన్నా ధీమా వ్యక్తం చేశారు.

Also Read : తెలుగులో ఈ ఏడాది రీమేక్ రాజాలు వీళ్ళే - హిట్టా? ఫట్టా?

''సినిమా చేసేటప్పుడు చిన్న హీరోనా? పెద్ద హీరోనా? అని తేడాలు చూడను. నాకు సినిమాను సినిమాగా చూడటం అలవాటు. కథ బాగుండాలని, ప్రేక్షకులకు సినిమా నచ్చాలని కోరుకుంటా. క్యారెక్టర్‌కు ఎంత వరకు న్యాయం చేయగలనో ఆలోచిస్తా. ఈ సినిమాలో నేను స్టార్, మిగతా వాళ్ళు కొత్త అని ఎప్పుడూ అనుకోలేదు'' అని తమన్నా వివరించారు.
  
ఓటీటీలు ఉన్నా... ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు!
కథానాయికగా కెరీర్ స్టార్ట్ చేసి 17 ఏళ్ళు అవుతోందని, తొలినాళ్ళలో సినిమాపై తనకు ఎంత ఫ్యాషన్ ఉందో? ఇప్పుడు కూడా అదే ఫ్యాషన్ ఉందని తమన్నా తెలిపారు. ఓటీటీల గురించి కూడా ఆమె మాట్లాడారు. ''ఓటీటీలు వచ్చిన తర్వాత రీమేక్ సినిమాల ప్రభావం తగ్గినా... మంచి సినిమా ఎప్పుడు వచ్చినా ప్రేక్షకులు చూడటానికి సిద్ధంగా ఉన్నారు'' అని తమన్నా చెప్పారు. '12త్ అవర్' అని 'ఆహా' కోసం వెబ్ సిరీస్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదలైన 'బబ్లీ బౌన్సర్' సినిమాల్లో తమన్నా నటించారు. ఇప్పుడు ఓటీటీకి మూడు ప్రాజెక్టులు చేస్తున్నారు. 

ఇంట్లో పెళ్లి గురించి అడుగుతున్నారు!
ముంబైకు చెందిన వ్యాపారవేత్తను తమన్నా పెళ్లి చేసుకోనున్నారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. వాటిని ఆమె ఖండించారు. సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్, అటువంటి రూమర్స్ గురించి ఆలోచించనని ఆమె చెప్పారు. ఇంట్లో పెళ్లి ఒత్తిడి గురించి తమన్నా మాట్లాడుతూ ''సాధారణంగా ప్రతి ఇంట్లో అమ్మాయిలను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసినట్టు... మా ఇంట్లో కూడా పెళ్లి ప్రెజర్ ఉంది. సంబంధాలు చూస్తున్నారు. అయితే... నేను ఏ నిర్ణయం తీసుకోలేదు'' అని చెప్పారు. 

Also Read : మహేష్, త్రివిక్రమ్ సినిమాలో ఏం జరుగుతోంది? ఇకనైనా పుకార్లకు ఫుల్ స్టాప్ పడుతుందా?

మెగాస్టార్ చిరంజీవి 'భోళా శంకర్'లో తమన్నా హీరోయిన్. అయితే, ఇంకా ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయలేదని... త్వరలో తన పార్ట్ స్టార్ట్ అవుతుందని తెలిపారు. వచ్చే ఏడాది ఆమె మలయాళ పరిశ్రమకు పరిచయం కానున్నారు. అక్కడ 'బాంద్రా' సినిమా చేస్తున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతారరివర్స్ గేర్‌లో కారు.. ఇంతలో భారీ ప్రమాదం సీసీటీవీ వీడియోరామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Posani : మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Crime News: ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
Casio launches first smart ring: స్మార్ట్ రింగ్ లేదా స్మార్ట్ వాచ్ కాదు రెండ ఒకే దాంట్లోే -  అబ్బురపరుస్తున్న కాసియో ఫస్ట్ రింగ్ విత్ స్మార్ట్ వాచ్
స్మార్ట్ రింగ్ లేదా స్మార్ట్ వాచ్ కాదు రెండు ఒకే దాంట్లోే - అబ్బురపరుస్తున్న కాసియో ఫస్ట్ రింగ్ విత్ స్మార్ట్ వాచ్
Embed widget