By: ABP Desam | Updated at : 06 Dec 2022 12:09 PM (IST)
త్రివిక్రమ్, తమన్, మహేష్ బాబు
సూపర్ స్టార్ మహేష్ బాబు (Superstar Mahesh Babu) కథానాయకుడిగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. దీని గురించి రోజుకు ఒక కొత్త గాసిప్ హల్ చల్ చేస్తోంది. ఓ అడుగు ముందుకు... రెండు అడుగులు వెనక్కి... అన్నట్టు షూటింగ్ జరుగుతోంది. దీనికి తోడు బోలెడు పుకార్లు! అసలు, ఇప్పుడు ఈ సినిమా స్టేటస్ ఏంటి? ఏం జరుగుతోంది? అనే వివరాల్లోకి వెళితే...
దుబాయ్‌లో SSMB 28 టీమ్!
మహేష్ బాబు, త్రివిక్రమ్ అండ్ టీమ్ ఇప్పుడు దుబాయ్‌లో ఉంది. సినిమాకు వర్క్ చేసే టాప్ టెక్నీషియన్స్, ప్రొడ్యూసర్స్ కూడా అక్కడకు వెళుతున్నారట. ఇప్పుడు మరోసారి టీమ్ అందరికీ త్రివిక్రమ్ ఫుల్ స్క్రిప్ట్ నేరేషన్ ఇస్తున్నారని సమాచారం. ముందుగా అనుకున్న కథలో మార్పులు చేర్పులు చేశారట. అందువల్ల, ఈ నేరేషన్ అని టాక్. మరోవైపు మహేష్ కథ మార్చమని అడిగినట్టు, షూటింగ్ ఆపేసినట్టు వార్తలు వచ్చాయి. వాటికి ఈ మీటింగ్‌తో ఫుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి.
నిజం చెప్పాలంటే... మహేష్, త్రివిక్రమ్ మధ్య కథ విషయంలో అభిప్రాయ భేదాల వల్ల షూటింగ్ ఆగలేదు. ఇటీవల మహేష్ తండ్రి కృష్ణ, కొన్ని రోజుల క్రితం తల్లి ఇందిరా దేవి మరణాల కారణంగా చిత్రీకరణకు అంతరాయం ఏర్పడింది. ఇప్పుడు పూజా హెగ్డే డేట్స్ అడ్జస్ట్ కావడం లేదని, అందువల్ల వాయిదా పడుతోందని వార్తలు వస్తున్నాయి.
సంక్రాంతి తర్వాత నుంచి మళ్ళీ షూటింగ్!
మహేష్, త్రివిక్రమ్ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఆల్రెడీ ఒక షెడ్యూల్ కంప్లీట్ చేశారు. అందులో బస్ ఫైట్ తీశారు. ఇప్పుడు సంక్రాంతి తర్వాత కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుందని సమాచారం. నలభై ఐదు రోజులు పాటి ఏకధాటిగా ఆ షెడ్యూల్ జరుగుతుందని, అందులో మెజారిటీ సీన్స్ అండ్ ఫైట్స్ కంప్లీట్ చేస్తారని టాక్.
మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా దుబాయ్‌లో!
తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. అయితే... అతడు వద్దని త్రివిక్రమ్ మీద మహేష్ బాబు ఒత్తిడి తీసుకు వచ్చినట్టు ఆ మధ్య సినిమా ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపించాయి. అప్పుడే పుకార్లకు చిత్ర బృందం చెక్ పెట్టింది. ఆల్రెడీ తమన్ మూడు ట్యూన్స్ ఫైనలైజ్ చేశారు. ఇప్పుడు ఆయన కూడా దుబాయ్ వెళ్ళారు. మిగతా పాటలు, నేపథ్య సంగీతం విషయంలో సిట్టింగ్స్ జరుగుతున్నాయట.
Also Read : బాలీవుడ్ స్టార్స్‌కు 'నో' చెప్పేసి మరీ పవన్‌తో సుజిత్ సినిమా - ఎగ్జైట్ అవుతున్న అకిరా
కృష్ణ మరణంతో SSMB 28కి బ్రేక్!
ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ చేస్తున్న సినిమా హీరోగా ఆయనకు 28వ సినిమా (SSMB 28). ఆల్రెడీ ఓ షెడ్యూల్ షూటింగ్ చేశారు. మొన్న ఫ్యామిలీతో కలిసి మహేష్ లండన్ వెళ్లి వచ్చిన తర్వాత సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేయాలని అనుకున్నారు. నవంబర్ నెలాఖరున లేదంటే డిసెంబర్ తొలి వారంలో షూటింగ్ పునః ప్రారంభించాలని అనుకున్నారు. కానీ, ఇప్పుడు కృష్ణ మరణంతో ఈ సినిమా షూటింగ్ మరింత ఆలస్యం అయ్యేలా ఉంది.
మహేష్ బాబు సరసన పూజా హెగ్డే (Pooja Hegde) కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో సినిమా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి కూర్పు: నవీన్ నూలి, కళా దర్శకత్వం: ఏ.ఎస్. ప్రకాష్, ఛాయాగ్రహణం: పి.ఎస్. వినోద్.
Dasara: ఒక ఆర్ఆర్ఆర్, ఒక కేజీయఫ్, ఒక దసరా - టీజర్ లాంచ్లో నాని ఏమన్నాడంటే?
Upcoming Movies This Week: ఈ వారం థియేటర్, ఓటీటీల్లో సందడి చేసే సినిమాలివే!
Thalapathy67: అందరికీ తెలిసిందే - అధికారికంగా ప్రకటించిన డైరెక్టర్!
Nikhil On SPY Movie: నిఖిల్ స్పై థ్రిల్లర్ మూవీ నుంచి బిగ్ అప్డేట్, రిలీజ్ ఎప్పుడంటే?
Sundeep Kishan: ‘విక్రమ్’ నుంచి అందుకే తప్పుకున్నా, లోకేష్ కనగరాజ్ ప్రపంచం మొదలైందే నాతో: సందీప్ కిషన్
MLA Kethireddy: ఆధిపత్యం కోసం జేసీ బ్రదర్స్ హత్యలు చేయించారు: ఎమ్మెల్యే కేతిరెడ్డి సంచలనం
Jagan Flight : జగన్ విమానం గాల్లోకి లేచిన కాసేపటికి వెనక్కి - సాంకేతిక లోపంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ !
TSPSC Group4 Application: 'గ్రూప్-4' ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్, దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
BJP Govt: మోడీ సర్కార్కు షాక్ ఇచ్చిన సర్వే, ఆరేళ్లలో పెరిగిన అసంతృప్తి!