News
News
X

Swathimuthyam Trailer: మా వాడు ‘స్వాతిముత్యం’ - కితకితలు పెడుతున్న ట్రైలర్, వర్ష బొలమ్మ, బెల్లంకొండ గణేష్‌ల స్వీట్ లవ్!

బెల్లంకొండ శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ గణేష్ హీరోగా పరిచయం అవుతోన్న సినిమా స్వాతిముత్యం. మరి ట్రైలర్ ఎలా ఉందో చూసేయండి.

FOLLOW US: 

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ రెండో కుమారుడు, హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ గణేష్ ని హీరోగా పరిచయం చేస్తున్న సినిమా స్వాతిముత్యం. ఈ సినిమా ట్రైలర్ ని చిత్ర బృందం విడుదల చేసింది. ఎంతో అమాయకంగా కనిపిస్తున్నారు గణేష్. ఓవరాల్ గా క్యారెక్టర్ లో ‘‘మా వాడు స్వాతిముత్యం అని హీరోయిన్ చెప్పడం’’ హీరోకి సరిగ్గా సరిపోయింది. ఇందులో వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటించింది. కన్ఫ్యూజన్ గా కనిపిస్తున్న అమాయకుడిగా గణేష్ చక్కటి అభినయం ప్రదర్శించారు. ప్రేమ, ఎమోషన్స్, కామెడీ అన్నింటినీ ఇందులో చక్కగా చూపించారు. ఈ సినిమాలో వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషించారు. 

‘‘మిమ్మల్ని చూడగానే నచ్చేశారు, అది ఎంతగా అంటే మిమ్మల్ని చూశాక ఇంకెవరిని చూడకూడదని ఫిక్స్ అయ్యేంతగా’’ అని బిడియంగా హీరోయిన్ కి తన ప్రేమ విషయం చెప్పడం చాలా క్యూట్ గా ఉంది. ఈ సినిమాలో వర్ష బొల్లమ్మని అందంగా చూపించారు. సాఫీగా సాగిపోతున్న వారి ప్రేమకి చిన్న సమస్య అడ్డు వస్తుంది. హీరో ఎలా పరిష్కరించాడు, తన ప్రేయసిని ఎలా దక్కించుకున్నాడు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

హీరో తండ్రిగా రావు రమేష్ నటించారు. తన ప్రేమ దక్కించుకోవడానికి హీరో పడే పాట్లు నవ్వులు పూయిస్తున్నాయి. 'నేను నిన్ను ఏం అననులే వెళ్ళి పిల్లని తీసుకొచ్చేయ్'’ అని తండ్రి అంటే ‘‘ఏ పిల్ల’’ అని హీరో అమాయకంగా అడగటం బాగుంది. ‘‘చేసిన తప్పులు కప్పి పుచ్చుకోవడం కోసం మళ్ళీ మునులు, దేవుళ్ళని అడ్డం పెట్టుకోవడం, కళ్ళు పోతాయిరా ఎదవల్లారా’’ అని రావు రమేష్ హీరోని తిట్టడం వంటి సీన్స్ బాగున్నాయి.

Also read: రేవంత్ వల్లే ఎలిమినేట్ అయ్యాను, దమ్మున్న కంటెస్టెంట్స్ వాళ్లే - నేహా కామెంట్స్!

News Reels

ఈ సినిమాకు సూర్య దేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరించారు. లక్ష్మణ్ కె కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సంక్రాంతి పండుగ రోజు ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ విడుదల చేశారు. దసరా కానుకగా అక్టోబర్ 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది. జీవితం, ప్రేమ, పెళ్లి వంటి వాటిపై యువత ఆలోచనలు, అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? వాటి మధ్య య్ యువకుడి జీవిత ప్రయాణం ఎలా సాగిందనేది ఇందులో చూపించారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ మీద ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ‘చూసి చూడంగానే’ సినిమాతో వర్ష బొల్లమ్మ తెలుగు తెరకి పరిచయం అయ్యింది. ఇటీవల ఆమె నటించిన ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  

Also read: ఇంట్లో ఎవరు గాడిద? ఎవరు పాము? ఎవరు ఊసరవెల్లి? ఇదిగో మీరే చూడండి

Published at : 26 Sep 2022 01:02 PM (IST) Tags: Varsha Bollamma Bellamkonda Ganesh Swatimutyam Movie Swatimutyam Movie Teaser Bellamkonda Ganesh First MOvie

సంబంధిత కథనాలు

YS Jagan: అలీ కూతురు మ్యారేజ్ రిసెప్షన్‌ - నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్‌

YS Jagan: అలీ కూతురు మ్యారేజ్ రిసెప్షన్‌ - నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్‌

Ram Gopal Varma Tweet పుట్టినరోజు ఆయనదైతే నాకు దండేశారేంటి : వైరల్ అవుతోన్న ఆర్జీవి ట్వీట్

Ram Gopal Varma Tweet పుట్టినరోజు ఆయనదైతే నాకు దండేశారేంటి : వైరల్ అవుతోన్న ఆర్జీవి ట్వీట్

Bigg Boss 6 Telugu: ఇనయాతో శ్రీహాన్ రొమాన్స్, శ్రీసత్యకు ఊహించని షాక్ - టాస్క్ ఇలా కూడా ఆడొచ్చా?

Bigg Boss 6 Telugu: ఇనయాతో శ్రీహాన్ రొమాన్స్, శ్రీసత్యకు ఊహించని షాక్ - టాస్క్ ఇలా కూడా ఆడొచ్చా?

Dejavu - Repeat : 'రిపీట్' రిలీజుకు ముందు 'డెజావు' సక్సెస్ - ప్రైమ్‌లో పెరిగిన క్లిక్స్

Dejavu - Repeat  : 'రిపీట్' రిలీజుకు ముందు 'డెజావు' సక్సెస్ - ప్రైమ్‌లో పెరిగిన క్లిక్స్

Ram Charan NTR : ఎన్టీఆర్, చరణ్ మధ్య నో గొడవ, నథింగ్ - ముందే అంతా మాట్లాడుకుని

Ram Charan NTR : ఎన్టీఆర్, చరణ్ మధ్య నో గొడవ, నథింగ్ - ముందే అంతా మాట్లాడుకుని

టాప్ స్టోరీస్

Bandi Sanjay : భైంసా పేరు మహిషాగా మారుస్తాం, పీడీయాక్ట్ లు ఎత్తేసి ఉద్యోగాలిస్తాం - బండి సంజయ్

Bandi Sanjay :  భైంసా పేరు మహిషాగా మారుస్తాం, పీడీయాక్ట్ లు ఎత్తేసి ఉద్యోగాలిస్తాం - బండి సంజయ్

Ys Vijayamma Comments : ఆ రాష్ట్రంతో మనకేంటి ? - ఏపీ గురించి వైఎస్ విజయమ్మ సంచలన కామెంట్స్ !

Ys Vijayamma Comments : ఆ రాష్ట్రంతో మనకేంటి ? - ఏపీ గురించి వైఎస్ విజయమ్మ  సంచలన కామెంట్స్ !

Tirumala Update: భక్తులకు టీటీడీ అలర్ట్ - డిసెంబర్ 1 నుంచి తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శన సమయాల్లో మార్పు

Tirumala Update: భక్తులకు టీటీడీ అలర్ట్ - డిసెంబర్ 1 నుంచి తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శన సమయాల్లో మార్పు

Chandrababu On Viveka Case : సొంత బాబాయ్ హత్య కేసు వేరే రాష్ట్రానికి బదిలీ, తలెక్కడ పెట్టుకుంటావ్ - చంద్రబాబు

Chandrababu On Viveka Case : సొంత బాబాయ్ హత్య కేసు వేరే రాష్ట్రానికి బదిలీ, తలెక్కడ పెట్టుకుంటావ్ - చంద్రబాబు