Sushant Singh Facebook: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఫేస్‌బుక్ డీపీ ఛేంజ్... షాక్ అవుతున్న అభిమానులు..
సుశాంత్ ఫేస్‌బుక్ ప్రొఫైల్ డీపీ మార్పుపై అభిమానుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా ఎవరు చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఏమోషన్స్‌తో ఆడుకోవద్దని మండిపడుతున్నారు.
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఫేస్‌బుక్ ప్రొఫైల్‌లో మార్పులు చోటుచేసుకోవడం ఆయన అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. చనిపోయిన తర్వాత ఆయన ఫేస్‌బుక్‌ను ఎవరు రన్ చేస్తున్నారని సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఆయన అభిమానుల ఏమోషన్స్‌తో ఆడుకోవద్దని మరికొందరు రిక్వెస్ట్ చేస్తున్నారు.
సుశాంత్ సింగ్ గతేడాది జూన్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి ఆయన సోషల్ మీడియా అకౌంట్స్‌ను సుశాంత్ సింగ్ టీం హ్యాండ్‌ఓవర్ చేసుకుంది. ఆయన మరణించిన తర్వాత ఆయా అకౌంట్స్‌లో ఆ టీమ్ కొన్ని పోస్టులు చేసింది.
మీ లాంటి ఫ్యాన్స్ ఉండటం సుశాంత్ అదృష్టమని ఓ పోస్టు పెట్టింది. ఆయనకు ఫ్యాన్సే నిజమైన గాడ్‌ఫాదర్ అని... ఆయన ఆలోచనలకు అనుగుణంగానే ఈ సోషల్ మీడియా స్పేస్ ఉంటుందని పేర్కొన్నారు. నటుడు సుశాంత్ గురించి తెలుసుకోవాలనుకునే వారికి మరింత సమాచారం ఇచ్చేందుకు ఓ డాక్యుమెంట్ రెడీ చేస్తున్నట్టు కూడా సుశాంత్ టీం ఇటీవల తెలిపింది.
ALSO READ: చిరంజీవి ఫ్యాన్స్‌కు మహేష్ బాబు సర్‌ప్రైజ్.. 154వ సినిమా టైటిల్ వచ్చేసింది.
అప్పటి నుంచి సోషల్ మీడియాలో సుశాంత్ పేజ్‌లో ఎలాంటి అప్‌డేట్స్ ఎవరూ ఇవ్వడం లేదు. అయినా ఆయనకున్న ఫాలోవర్స్ కూడా ఏ మాత్రం తగ్గలేదు. ఉన్నట్టుంటి సడెన్‌గా డీపీ మార్చడంతో ఫేస్‌బుక్ ఫాలోయర్స్ అంతా ఆశ్చర్యపోతున్నారు.
సుశాంత్ ఫేస్‌బుక్ పేజ్ డీపీ మార్చడంపై ఒక్కొక్కరు ఒక్కలా స్పందిస్తున్నారు. ఈ అకౌంట్‌ను ఎవరు మానిటర్ చేస్తున్నారని ఒకరు ప్రశ్నిస్తుంటే... నిజంగా ఈ మార్పు నేను నమ్మలేనంటూ మరొకరు రియాక్ట్ అయ్యారు. ఆయన లేడన్న విషయాన్ని మళ్లీ మళ్లీ గుర్తు చేసి తమ ఏమోషన్స్‌తో ఆడుకోవద్దని మరికొందరు సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్ చేస్తున్నారు.
ALSO READ: కీర్తి సురేష్ ఓనమ్ సెలబ్రేషన్.. ట్రెడీషనల్ లుక్‌లో ‘మహానటి’ ఫొటోస్
తాను చాలా షాక్ తిన్నానని.. ఒక సెకనుకు అతను తిరిగి వచ్చాడని నేను అనుకున్నానని ఇంకో నెటిజన్ ఫీల్ అయ్యాడు. కానీ ఇది ఎలా సాధ్యమవుతుంది? అతని ఖాతాను ఎవరు రన్ చేస్తున్నారు ? అతని డీపీని అప్‌లోడ్ చేసి ఏం చెప్పాలనుకుంటున్నారని మరో వ్యక్తి ప్రశ్నించాడు.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ గత ఏడాది జూన్ 14 న ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మృతిపై అప్పట్లో పెను దుమారమే రేగింది. ఇండస్ట్రీలోనే కొందరి చర్యల వల్లే అతను ఆత్మహత్య చేసుకున్నాడని బహిరంగంగానే కొందరు నటీనటులు, అభిమానులు విమర్శలు గుప్పించారు.
ALSO READ: చిరు ‘లూసిఫర్’ రీమేక్ టైటిల్ ఇదే.. మోషన్ పోస్టర్ అదుర్స్