![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
VirataParvam: రానా పట్టుదలే 'విరాటపర్వం' నష్టాలకు కారణమా?
'విరాటపర్వం' సినిమా రిలీజ్ ఆలస్యమవ్వడానికి కారణం సురేష్ బాబు ఆలోచనలే. నిజానికి ఈ సినిమా ఎప్పుడో పూర్తయింది కానీ రిలీజ్ విషయంలో చాలా లేట్ చేశారు.
![VirataParvam: రానా పట్టుదలే 'విరాటపర్వం' నష్టాలకు కారణమా? Suresh Babu's Prediction over Virata Parvam movie turns true VirataParvam: రానా పట్టుదలే 'విరాటపర్వం' నష్టాలకు కారణమా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/20/cee25b72df55c8e269a7ea3ae2852618_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
టాలీవుడ్ లో ఉన్న టాప్ ప్రొడ్యూసర్స్ లో సురేష్ బాబు ఒకరు. సినిమాల విషయంలో ఆయన జడ్జిమెంట్ పెర్ఫెక్ట్ అనే చెప్పాలి. ఎలాంటి సినిమా ఆడియన్స్ ను మెప్పిస్తుంది..? ఏ సమయానికి రిలీజ్ చేస్తే సినిమా ఆడుతుంది..? పెట్టుబడి, మార్కెటింగ్ ఇలా అన్ని విషయాల్లో ఆయనకు మంచి అనుభవం ఉంది. ఒక సినిమాపై ఎంత ఖర్చు పెడితే వర్కవుట్ అవుతుందో అంతే పెడతారు. తన సొంత కొడుకు సినిమా అయినా.. బడ్జెట్ విషయంలో లో లిమిట్స్ దాటరు.
'విరాటపర్వం' సినిమా రిలీజ్ ఆలస్యమవ్వడానికి కారణం సురేష్ బాబు ఆలోచనలే. నిజానికి ఈ సినిమా ఎప్పుడో పూర్తయింది కానీ రిలీజ్ విషయంలో చాలా లేట్ చేశారు. ఈ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయాలనేది సురేష్ బాబు ఆలోచన. ఇలాంటి సినిమాలను జనాలు మెచ్చుకుంటారు కానీ థియేటర్లకు చూడడానికి రారని.. అలాంటప్పుడు థియేటర్లో విడుదల చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని చెబుతూనే ఉన్నారట.
నెట్ ఫ్లిక్స్ సంస్థ కూడా 'విరాటపర్వం' డిజిటల్ రిలీజ్ కోసం రూ.40 కోట్లు చెల్లించడానికి ముందుకొచ్చింది. కానీ రానా మాత్రం ఈ సినిమాను థియేటర్లోనే విడుదల చేయాలని పట్టుబట్టారట. ఈ సినిమాకి సురేష్ బాబుతో పాటు మరో నిర్మాత సుధాకర్ చెరుకూరి కూడా ఉన్నారు. ఆయన కూడా సినిమాను థియేటర్లో రిలీజ్ చేద్దామనే అన్నారట. దీంతో సురేష్ బాబు సైలెంట్ అయిపోయారట.
ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తరువాత సురేష్ బాబు ఆలోచనే కరెక్ట్ అయింది. సినిమాకి టాక్ అయితే బాగుంది కానీ సరైన వసూళ్లు మాత్రం రావడం లేదు. వీక్ డేస్ లో ఈ సినిమా ఏ మాత్రం పెర్ఫార్మ్ చేస్తుందో సందేహమే. థియేటర్లో విడుదలై.. ఆ తరువాత ఓటీటీకి వెళ్తుంది కాబట్టి ఓటీటీ రేటు కూడా పడిపోయింది. ముందే సురేష్ బాబు మాట విని ఉంటే నిర్మాతలకు మంచి లాభాలు వచ్చేవి. ఇప్పుడు థియేటర్లకు జనాలు రాక వెలవెలబోతున్నాయి.
Also Read: కరణ్ జోహార్ కిడ్నాప్ - బిష్ణోయ్ గ్యాంగ్ ప్లాన్ ఇదే!
Also Read: నా బర్త్ డే రోజే ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది: అడివి శేష్
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)