Pushpa: 'పుష్ప' మేనియా చూశారా? బన్నీ, రష్మిక ఫొటోలతో చీరలు
'పుష్ప'కి ఉన్న క్రేజ్ ని అందరూ వాడేసుకుంటున్నారు. ఇప్పటికే సినిమా పేరుతో చిప్స్ ప్యాకెట్లు కూడా వచ్చాయి. ఇప్పుడు ఏకంగా చీరలను డిజైన్ చేస్తున్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ రూపొందించిన సినిమా 'పుష్ప'. గతేడాది డిసెంబర్ లో విడుదలైన ఈ సినిమా భారీ కలెక్షన్స్ ను రాబట్టింది. 'పుష్ప' ఓటీటీలో కూడా రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమాలో బన్నీ పెర్ఫార్మన్స్ కు అందరూ ఫిదా అయిపోయారు. సినిమాలో కొన్ని సాంగ్స్ ను, డైలాగ్స్ ను అనుకరిస్తూ.. లక్షల రీల్స్ అండ్ మీమ్స్ వచ్చాయి. ఈ సినిమాతో బన్నీ పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్నారు.
'పుష్ప'కి ఉన్న క్రేజ్ ని అందరూ వాడేసుకుంటున్నారు. ఇప్పటికే సినిమా పేరుతో చిప్స్ ప్యాకెట్లు కూడా వచ్చాయి. ఇప్పుడు ఏకంగా చీరలను డిజైన్ చేస్తున్నారు. రకరకాల వస్తువులను తయారు చేయడంలో సూరత్ ప్రసిద్ధి చెందిన సంగతి తెలిసిందే. అక్కడ చరణ్ జీత్ క్లాత్ మార్కెట్ లో ప్రస్తుతం 'పుష్ప' సినిమా పోస్టర్లతో డిజైన్ చేసిన చీరలను అమ్ముతున్నారు. 'పుష్ప' సినిమా పాపులర్ అవ్వడంతో ఈ సినిమాతో ప్రత్యేకంగా చీరలు రూపొందించాలనే ఆలోచన చరణ్ పాల్ అనే వ్యాపారికి వచ్చింది.
దీంతో వెంటనే తన ఆలోచనను ఆచరణలో పెట్టి కొన్ని చీరలను తయారు చేశాడు. దీనికి సంబంధించిన ఫొటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ ఫొటోలు వైరల్ అవ్వడంతో దేశవ్యాప్తంగా వస్త్ర వ్యాపారుల నుంచి భారీ డిమాండ్ వస్తున్నాయంట. దీని గురించి చరణ్ పాల్ మాట్లాడుతూ.. రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల నుంచి తన 'పుష్ప' చీరల కోసం ఆర్డర్లు వస్తున్నాయని చెప్పారు.
'పుష్ప' సినిమా విడుదలైన రెండు నెలలు గడుస్తున్నా.. క్రేజ్ తగ్గడం లేదని వీటన్నింటిని చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమాలో బన్నీకి జోడీగా రష్మిక నటించింది. అలానే సునీల్, అనసూయ, అజయ్ ఘోష్ లాంటి నటులు కీలకపాత్రలు పోషించారు. ఫహద్ ఫాజిల్ విలన్ గా కనిపించారు. మైత్రి మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా బ్యానర్లపై తెరకెక్కించిన ఈ సినిమా పార్ట్ 2 రాబోతుంది. కొన్ని రోజుల్లో రెగ్యులర్ షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు.
Craze 💥🤙@alluarjun ❣️ @PushpaMovie
— 𝔸٭ℕ٭𝕂٭𝕀٭𝕋 ツ 𝔸𝔸𝔻ℍ𝔽 (@_ankit_padhi_) February 11, 2022
#Pushpa #PushpaSaree
pic.twitter.com/kYaVXdRhJX
View this post on Instagram