అన్వేషించండి

Rajinikanth - Rishab Shetty: రిషబ్ శెట్టికి ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన రజినీకాంత్, ‘కాంతారా’ మూవీకి సూపర్ స్టార్ ఫిదా!

'కాంతార' సినిమా దేశవ్యాప్తంగా మంచి హిట్ అందుకొని విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న నేపథ్యంలో తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ రిషబ్ శెట్టి ను అభినందించారు.

కన్నడ సినిమా 'కాంతార' సినిమా దేశవ్యాప్తంగా ఎంత హిట్ అయిందో తెలిసిందే. మొదట కన్నడలో విడుదలైన ఈ సినిమా.. అక్కడ భారీగా విజయం సాధించడంతో ఆ సినిమాను ఇతర భాషల్లో కూడా విడుదల చేశారు. విడుదలైన అన్ని చోట్లా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో రిషబ్ శెట్టి పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. ఈ సినిమాలో హీరోగా నటించడమే కాకుండా రచన, దర్శకత్వం కూడా రిషబ్ శెట్టి నే చేయడం విశేషం. ‘కాంతార’  సినిమాపై ఇప్పటికే హీరో ప్రభాస్, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తదితర సినీ ప్రముఖలు ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు తాజాగా రిషబ్ శెట్టి కు తమిళ సూపర్ స్టార్ రజని కాంత్ నుంచి ప్రశంసలు మాత్రమే కాదు, ఖరీదైన గిఫ్ట్ కూడా లభించింది.

'కాంతార' సినిమా దేశవ్యాప్తంగా మంచి హిట్ అందుకొని విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న నేపథ్యంలో తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ రిషబ్ శెట్టి ను అభినందించారు. ఈ సందర్భంగా రిషబ్ ను చెన్నై లోని  ఆయన నివాసానికి ఆహ్వానించారు. రిషబ్ ను సత్కరించారు. అంతేకాకుండా ఆయనకు గోల్డ్ చైన్, గోల్డ్ లాకెట్ ను బహుమతిగా అందించారు రజనీ. కాంతార సినిమా చాలా బాగుందని, అద్భుతమైన సినిమాను తీసావంటూ రిషబ్ ను ప్రశంసించారు. గతంలోనే కాంతార సినిమా చూసిన రజనీ ఆ మూవీ పై ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా మాస్టర్ పీస్ అని, 50 ఏళ్లకోసారి గానీ ఇలాంటి సినిమాలు రావని, సినిమా తనకు గూస్ బంప్స్ తెప్పించిందని ట్వీట్ చేశారు. తర్వాత రిషబ్ ను ఇంటికి ఆహ్వానించి సత్కరించారు రజనీ.

అయితే వీరిద్దరి కలయికపై అభిమానులు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. త్వరలో వీరిద్దరి కాంబోలో సినిమా ఉండబోతోందా అనే టాక్ కూడా నడుస్తోంది. అందుకే రిషబ్ శెట్టిని రజనీ ఇంటికి ఆహ్వానించారని, భవిష్యత్ ప్రాజెక్టులపై వీరిద్దరూ కాసేపు ముచ్చటించారని భోగట్టా. దీంతో రజనీ, రిషబ్ కాంబో లో సినిమా అంటే ఎలా ఉంటుందా అని ఫ్యాన్స్ ఊహించుకుంటున్నారట. అయితే దీనిపై ఇంకా స్పష్టత లేదు. 

Also Read : 'అహ నా పెళ్ళంట' వెబ్ సిరీస్ రివ్యూ : రాజ్ తరుణ్, శివానీ రాజశేఖర్‌ల కామెడీ, రొమాన్స్ ఎలా ఉందంటే?

ఇక ‘కాంతార’ సినిమా సెప్టెంబర్ 30న కన్నడలో విడుదలైంది. సైలెంట్ గా రిలీజ్ అయిన ఈ మూవీ తర్వాత ఓ ప్రభంజనం సృష్టించింది. తెలుగు, తమిళ్, హిందీ లో రిలీజై బాక్స్ ఆఫీసు వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాలో రిషబ్ నటనకు వందశాతం మార్కులు పడ్డాయి. సినిమా కు సంబంధించి ప్రతీ టేక్ నూ చాలా నేచురల్ గా తీశారట రిషబ్, అందుకే సినిమాలో ప్రతీ సన్నివేశం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా చివరి పది నిమిషాలు సినిమాకు హైలెట్. సినిమాకు బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా మరో బలం అనే చెప్పాలి. మొత్తంగా ఈ సినిమా 300 కోట్లకు పైగానే వసూళ్లు రాబట్టి చరిత్ర సృష్టించింది. ఇప్పటికీ థియేటర్లలో కాంతార హవా కొనసాగుతోంది. ఇంత హిట్ అయిన ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేయాల్సి ఉంది.

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today August 12th: 'గోదావరి' సీరియల్: గౌతమి సూసైడ్ ప్రయత్నం! కల్యాణ్‌కి అరెస్ట్ చేసే సాక్ష్యాలు లభ్యం!
'గోదావరి' సీరియల్: గౌతమి సూసైడ్ ప్రయత్నం! కల్యాణ్‌కి అరెస్ట్ చేసే సాక్ష్యాలు లభ్యం!
Love Entertainer OTT : మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
Bigg Boss Agnipariksha 2026: 'బిగ్ బాస్' అగ్నిపరీక్ష ఫైనల్ కంటెస్టెంట్లు వీళ్ళే... పదిహేను మందిలో ఎవరున్నారంటే?
'బిగ్ బాస్' అగ్నిపరీక్ష ఫైనల్ కంటెస్టెంట్లు వీళ్ళే... పదిహేను మందిలో ఎవరున్నారంటే?
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Telangana News: 10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
Breaking News: పర్మిషన్ లేకుండా ర్యాలీలు.. పలువురు వైసీపీ నేతలపై కేసులు నమోదు
పర్మిషన్ లేకుండా ర్యాలీలు.. పలువురు వైసీపీ నేతలపై కేసులు నమోదు
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Embed widget