అన్వేషించండి

కృష్ణ అసలు పేరు అలా మారింది - ఒకేసారి 20 సినిమా అవకాశాలు తెచ్చిన ఆ చిత్రం ఏమిటో తెలుసా?

కృష్ణ మూడు వందలకు పైగా చిత్రాల్లో నటించి తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. హీరోగానే కాకుండా నిర్మాతగానూ భారీ, వైవిధ్యమైన చిత్రాలను నిర్మించిన ఆయన దర్శకుడిగానూ విజయవంతమైన చిత్రాలను రూపొందించారు.

తెలుగు సినిమా సీనియర్ నటుడు, సూపర్ స్టార్ కృష్ణ(79) కన్నుమూశారు. ఆదివారం కార్డియాక్ అరెస్ట్ కావడంతో హైదరాబాద్ లో కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో మంగళవారం వేకువ జామున తుదిశ్వాస విడిచారు. ఇటీవలే కృష్ణ భార్య ఇందిరా దేవి కన్నుమూసిన విషయం తెలిసిందే. అలాగే ఆయన పెద్ద కుమారుడు రమేష్ బాబు కూడా అనారోగ్యంతో కన్నుమూశారు. దీంతో ఆయన మనోవేదనకు గురయ్యారు. కృష్ణ మృతితో అటు కుటుంబ సభ్యుల తో పాటు ఇటు సినీ ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖులు కృష్ణ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

సూపర్ స్టార్ కృష్ణ తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. మూడు వందలకు పైగా చిత్రాల్లో నటించి తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. హీరోగానే కాకుండా నిర్మాతగానూ భారీ, వైవిధ్యమైన చిత్రాలను నిర్మించిన ఆయన దర్శకుడిగానూ విజయవంతమైన చిత్రాలను రూపొందించారు. తెలుగు సినిమా సాంకేతికంగా అభివృద్ధి కావడానికి కృష్ణ ప్రముఖ పాత్రను పోషించారు. 

బుర్రిపాలెం బుల్లోడు కృష్ణ అసలు పేరు ఇదే

సూపర్ స్టార్ కృష్ణ అసలు పేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి. సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఆయన ఘట్టమనేని కృష్ణగా పేరు మార్చుకున్నారు. గుంటూరుజిల్లా, తెనాలి మండలం బుర్రిపాలెంలో ఆయన 1942 మే 31 న ఘట్టమనేని వీరరాఘవయ్య చౌదరి, నాగరత్న దంపతుల పెద్ద కొడుకుగా కృష్ణ జన్మించారు. బాల్యం అంతా తల్లిదండ్రుల వద్దే గడిచింది. తర్వాత ఏలూరులోని సి.ఆర్.రెడ్డి కళాశాలలో ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తి చేశారు. తాను డిగ్రీ చదువుతున్న రోజుల్లో ఏలూరులో అక్కినేని నాగేశ్వరరావుకు జరిగిన సన్మానం, ప్రజాదరణ చూసి సినిమా రంగంలోకి రావాలని నిర్ణయించుకున్నారు కృష్ణ. అనుకున్న కొద్ది కాలంలోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. కెరీర్ ప్రారంభంలో పలు సినిమాల్లో పాత్రలు చేశారు.

హీరోగా తొలి చిత్రం ‘తేనె మనసులు’: ఆయన 1964 లో హీరోగా నటించిన తొలి సినిమా 'తేనెమనసులు', మూడవ సినిమా 'గూఢచారి 116' పరిశ్రమలో నిలదొక్కుకునేందుకు ఉపకరించాయి. కృష్ణ హీరోగా తొలి సినిమా 'తేనె మనసులు' ప్రారంభమయ్యేనాటికే ఇందిరతో వివాహం అయింది. వీరికి ఇద్దరు కొడుకులు, ముగ్గురు కుమార్తెలు సంతానం ఉన్నారు. తర్వాత 'సర్కార్ ఎక్స్‌ప్రెస్' సినిమాలో హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సమయంలో కృష్ణ విజయనిర్మలను ప్రేమిస్తున్నానని పెళ్ళిచేసుకుంటానని చెప్పారు. పరస్పర అంగీకారంతో మరో రెండేళ్ళకు 1969లో తిరుపతిలో పెళ్ళిచేసుకున్నారు. అప్పటికే వివాహితులైన కృష్ణకు, విజయనిర్మలకూ ఇది రెండవ పెళ్ళి. తోటి నటిగానూ, దర్శకురాలిగానూ విజయనిర్మల సినీ రంగంలో రాణించింది. ఆమె దర్శకత్వంలోనూ కృష్ణ నటించారు. 


ప్రయత్నాలు, లక్ కలిసొచ్చిన వేళ..

డిగ్రీ పూర్తై తర్వాత ఇంజనీరింగ్ సీటు రాకపోవడంతో అప్పటికే సినిమాల్లోకి వెళ్లాలని అనుకున్నారు. తండ్రి అనుమతి తీసుకుని సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టారు. సినిమాలో అవకాశాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. సినిమా ఆఫీస్ ల చుట్టూ తిరిగారు. నటుడు అవ్వాలంటే ముందు నాటకాలు చేయాలని, అద్దం ముందు సాధన చేయాలని స్నేహితులు చెప్పినా.. అదృష్టం ఉంటే అవకాశాలు అవే వస్తాయ్ అని కొట్టిపారేసేవారట కృష్ణ. ఎన్నో ప్రయత్నాలు తర్వాత కొంగర జగ్గయ్య నిర్మించిన 'పదండి ముందుకు' (1962) సినిమాలో చిన్న పాత్ర పోషించారు. తర్వాత కులగోత్రాలు (1962), పరువు ప్రతిష్ఠ (1963), మురళీకృష్ణ వంటి సినిమాల్లో నటించారు. ఓ తమిళ సినిమాకు ఎంపికై భాష రాక అవకాశం పోగొట్టుకున్నారు. ఆ తర్వాత కృష్ణ తెనాలి తిరిగి వెళ్ళిపోయారు.

ఆ ఒక్క సినిమాతో.. ఒకేసారి 20 అవకాశాలు

అయితే కృష్ణ ఇంటి దగ్గర ఉండగా పత్రికలో వార్త చూసి ఆ సినిమాలో నటించడానికి ప్రయత్నించారు. అదే 1964లో ప్రముఖ దర్శక నిర్మాత ఆదుర్తి సుబ్బారావు అందరూ కొత్తవాళ్ళతో తాను తీస్తున్న 'తేనె మనసులు' సినిమా. ఈ సినిమా కృష్ణ జీవితాన్ని మార్చేసింది. తర్వాత వచ్చిన 'గూఢచారి 116' సినిమా సంచలన విజయం సాధించి కృష్ణ కెరీర్ మలుపుతిప్పింది. ఈ విజయంతో కృష్ణ ఒకేసారి 20 సినిమాల్లో హీరోగా ఎంపికయ్యారు. 1968లో కృష్ణ నటించిన 10 సినిమాలు విడుదలయ్యాయి. 1969లో రికార్డు స్థాయిలో 19 సినిమాలు విడుదలయ్యాయి. 1970 లో 16 సినిమాలు, 1971 లో 11 సినిమాలు, 1972 లో 18 సినిమాలు, 1973 లో 15 సినిమాలు, 1974 లో 13 సినిమాలు, 1975 లో 8 సినిమాలు విడుదలయ్యాయి. ఈ దశలో కృష్ణ రోజుకు మూడు షిఫ్టుల చొప్పున విరామం లేకుండా సినిమాలు చేసేవారట.

పడిలేచిన కెరటం

1970 లో తన సొంత నిర్మాణ సంస్థ పద్మాలయా పిక్చర్స్ ను ప్రారంభించారు. 1971 లో తీసిన 'మోసగాళ్ళకు మోసగాడు' మాత్రం భారీ విజయం సాధించి, సాహసిగా కృష్ణకు పేరును తెచ్చిపెట్టింది. 1974 లో సొంత బ్యానర్‌పై నిర్మించిన 'అల్లూరి సీతారామరాజు'  కృష్ణ కెరీర్ లోనే బెస్ట్ సినిమాగా నిలిచింది. ఇప్పటికీ అల్లూరి సీతారామరాజు పేరు చెప్తే కృష్ణ పేరు గుర్తొస్తుంది. తర్వాత 1974, 1975 లో కృష్ణ చేసిన పలు సినిమాలు ఫ్లాపయ్యాయి. 1976 లో 'పాడిపంటలు' సినిమాతో కృష్ణ మరోసారి తన లక్ పరీక్షించుకున్నారు. ఆ చిత్రం మంచి విజయం సాధించడంతో కృష్ణకు మరోసారి అవకాశాలు క్యూ కట్టాయి. 

1977 లో కురుక్షేత్రం, తర్వాత ఇంద్రధనుస్సు (1978), భలే కృష్ణుడు (1980), ఊరికి మొనగాడు (1981), బంగారు భూమి (1982), బెజవాడ బెబ్బులి (1983), ఇద్దరు దొంగలు (1984), అగ్నిపర్వతం (1985), తండ్రీ కొడుకుల ఛాలెంజ్ (1987), కలియుగ కృష్ణుడు (1988), రాజకీయ చదరంగం (1989) సినిమాలను విడుదల చేశారు.1978-1985 మధ్యకాలం కృష్ణ కెరీర్‌లో ఉచ్ఛదశ నడిచింది. ఈ దశలో కూడా అత్యంత వేగంగా సినిమాలు పూర్తిచేశారు సూపర్ స్టార్. 1977 నుంచి పదేళ్ళు లెక్క వేసుకున్నా హీరోగా మరో 117 సినిమాల్లో నటించారు కృష్ణ. ఈ దశలో సింహాసనం, అగ్నిపర్వతం, వజ్రాయుధం, ఊరికి మొనగాడు, ఈనాడు వంటి సినిమాలు ఘన విజయం సాధించాయి. ఈ సినిమాలతో పాటు ఎన్టీఆర్, ఏఎన్ ఆర్, శోభన్ బాబు, కృష్ణంరాజు లాంటి సీనియర్ నటులతో మల్టీ స్టారర్ సినిమాల్లో కూడా నటించారు. 1990 తర్వాత సినిమాలు సంఖ్య నెమ్మదిగా తగ్గుతూ వచ్చింది. వాటిలో కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి. అలా దాదాపు 340  లకు పైగా సినిమాలు చేసి రికార్డ్ సృష్టించారు సూపర్ స్టార్.


అభిమాన సంఘాలు, పురస్కారాలు

సూపర్ స్టార్ కృష్ణకు రికార్డు స్థాయిలో 2500 పైగా అభిమాన సంఘాలు ఉండేవి. కృష్ణ మంచి ఫామ్ లో ఉన్నప్పుడు ఒక సినిమా శతదినోత్సవానికి ఆంధ్రప్రదేశ్ నుంచి మద్రాసుకు 30 వేల మంది అభిమానులు స్వచ్ఛందంగా 400 బస్సుల్లో తరలివచ్చారు. అప్పట్లోనే అలా వెళ్లారు అంటే కృష  కు ఎలాంటి ఫాలోయింగ్ ఉండేదో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఆయన నటనకు ఎన్నో పురస్కారాలు అందాయి. ఫిల్మ్‌ఫేర్ సౌత్ జీవిత సాఫల్య పురస్కారం (1997), ఎన్టీఆర్ జాతీయ పురస్కారం (2003), ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ (2008), పద్మభూషణ్  (2009) లాంటి పురస్కారాలు ఆయన్ను వరించాయి.

రాజకీయ జీవితం

సినిమాల తో పాటు కృష్ణ రాజకీయాల్లోనూ రంగ ప్రవేశం చేశారు. 1989లో కృష్ణ కాంగ్రెస్ తరఫున ఏలూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేసి విజయం సాధించారు.1991 లోక్‌సభ ఎన్నికల్లో కృష్ణ గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం కోరుకున్నా తిరిగి ఏలూరులోనే పార్టీ పోటీచేయించింది. ఆ ఎన్నికల్లో 31 వేల ఓట్ల పైచిలుకు తేడాతో ప్రత్యర్థి బోళ్ళ బుల్లిరామయ్యపై కృష్ణ ఓటమి పాలయ్యారు. 1991లో తనకు సన్నిహితుడు, రాజకీయాల్లో తనను ప్రోత్సహించిన కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దారుణ హత్యకు గురికావడం, తాను కోరిన గుంటూరు నియోజకవర్గం కాంగ్రెస్ ఇవ్వకపోవడం, ఏలూరులో ఓటమి చెందడం వంటి కారణాలతో కృష్ణ ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారు. 

సూపర్ స్టార్ కృష్ణ తర్వాత సినిమాలు, రాజకీయాలకు దూరం అయ్యారు. చాలా కాలం నుంచి ఆయన ఆయన నివాసంలో శేష జీవితాన్ని గడుపుతున్నారు. ఈ మధ్య కాలంలో ఫంక్షన్ లకు దూరంగా ఉంటున్న ఆయన కుమారుడు, భార్య మరణంతో మరింత కుంగిపోయారు. దానికి తోడు గత కొంత కాలంగా శ్వాస సంబంధిత సమస్యతో ఆయన ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కార్డియాక్ అరెస్ట్ తో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కృష్ణ మృతితో ఆయన సొంత ఊరు బుర్రిపాలెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కృష్ణ మరణ వార్త విని ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Also Read : సూపర్ స్టార్ కృష్ణకు తీరని కోరికలు - ఆ నాలుగూ...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan Request: నేను మీసం తిప్పితే మీకు రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
నేను మీసం తిప్పితే రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Request: నేను మీసం తిప్పితే మీకు రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
నేను మీసం తిప్పితే రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Accidents : తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
Look Back 2024: అయిపోయింది అనుకున్న స్థితి నుంచి అధికార పీఠానికి.. టీడీపీకి మర్చిపోలేని సంవత్సరంగా 2024
అయిపోయింది అనుకున్న స్థితి నుంచి అధికార పీఠానికి.. టీడీపీకి మర్చిపోలేని సంవత్సరంగా 2024
Stock Market: కేంద్ర బడ్జెట్ శనివారం రోజున వస్తే స్టాక్ మార్కెట్లకు సెలవు ఇస్తారా, ఓపెన్‌ చేస్తారా?
కేంద్ర బడ్జెట్ శనివారం రోజున వస్తే స్టాక్ మార్కెట్లకు సెలవు ఇస్తారా, ఓపెన్‌ చేస్తారా?
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Embed widget